Soundarya: సౌందర్య భర్త ఇప్పటికీ నాకు ఫోన్ చేస్తాడు.. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే.. హీరోయిన్ ప్రేమ కామెంట్స్..
ఒకప్పుడు తెలుగు సినిమా ప్రపంచంలో కథానాయికగా తనదైన ముద్ర వేసిన హీరోయిన్ ప్రేమ. గ్లామరస్ పాత్రలు కాకుండా కంటెంట్ ప్రాధాన్యత ఉన్న చిత్రాలను ఎంచుకుంటూ తెలుగు ప్రేక్షకుల హృదయాలు గెలుచుకుంది. అప్పట్లో స్టార్ హీరోలందరి సరసన నటించిన ఆమె.. ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో దివంగత హీరోయిన్ సౌందర్యతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు వెలుగు వెలిగిన హీరోయిన్లలో ప్రేమ ఒకరు. విభిన్న కంటెంట్ చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్న ఆమె ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన సినీ ప్రయాణం గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది. అలాగే దివంగత అగ్రతార సౌందర్యతో తనకున్న స్నేహం గురించి చెప్పుకొచ్చింది. కన్నడ చిత్రసీమలో శివరాజ్‌కుమార్, రాఘవేంద్ర రాజ్‌కుమార్‌లతో నటించిన తన మొదటి రెండు సినిమాలు ఫ్లాప్ కావడంతో, ప్రేమ నిరాశకు గురయ్యానని… ఒకానొక దశలో సినీ పరిశ్రమను విడిచిపెట్టి చదువుకుని వేరే వృత్తిని ఎంచుకోవాలని కూడా భావించానని ఆమె తెలిపారు. అయితే, డాక్టర్ రాజ్‌కుమార్ ఆమెను ఓం సినిమాకు ఎంపిక చేయడంతో తన కెరీర్ మలుపు తిరిగిందని. ఓం సినిమా అప్పట్లో కన్నడలో పెద్ద విజయం సాధించిందని అన్నారు. ఈ మూవీ తర్వాత తాను వెనుదిగిరి చూడలేదని అన్నారు.
ఎక్కువ మంది చదివినవి : Gunashekar: ఆ హీరో చిన్నప్పుడు కూచిపూడి డ్యాన్స్ చేస్తే.. రవింద్రభారతిలో విజిల్స్ మారుమోగాయి.. డైరెక్టర్ గుణశేఖర్..
సౌందర్య గురించి మాట్లాడుతూ, ఆమె తెలుగులో ఎక్కువగా నటించినప్పటికీ, కన్నడ ప్రజలు ఆమెను తమ ఇంటి ఆడపిల్లగా ఆదరించారని ప్రేమ అన్నారు. సౌందర్య ఎప్పుడూ పోటీ భావనను కలిగి ఉండేవారు కాదని, తన పాత్రకు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చేవారని ప్రేమ వెల్లడించారు. తామిద్దరం కలిసి కన్నడ, తెలుగు భాషల్లో నాలుగు చిత్రాల్లో నటించారని, ముఖ్యంగా అప్తమిత్ర షూటింగ్‌లో విష్ణువర్ధన్, సౌందర్యలతో కలిసి జోకులు వేసుకుంటూ సరదాగా గడిపిన క్షణాలను గుర్తుచేసుకున్నారు. సౌందర్య సాధారణంగా తక్కువ మాట్లాడే వ్యక్తి అని, కానీ అప్తమిత్ర సమయంలోనే ఆమె తనతో ఎక్కువగా మాట్లాడారని ప్రేమ తెలిపారు.
ఎక్కువ మంది చదివినవి : Surya S/o Krishnan: హార్ట్ టచింగ్.. కుర్రాళ్ల మనసును కదిలించే సాంగ్.. ‘చంచల’ పాట వెనుక ఇంత స్టోరీ ఉందా..
సౌందర్య బయోపిక్ గురించి అడగగా, అలాంటి జీవితాన్ని లీడ్ చేసిన సౌందర్య బయోపిక్ తీయడానికి ఎందుకు భయపడుతున్నారో తెలియదని ప్రేమ అన్నారు. ఆమెను దగ్గరగా తెలిసిన వ్యక్తులు దర్శకత్వం వహించినట్లయితే, అది చాలా పెద్ద హిట్ అవుతుందని ప్రేమ తెలిపారు. సౌందర్య తన గ్లామర్ ప్రదర్శన లేకుండానే స్టార్ హీరోయిన్‌గా ఎదిగారని, శరీర సౌందర్యం కాకుండా ముఖ కవళికలకే ప్రాధాన్యత ఇచ్చారని అన్నారు. సౌందర్య వ్యక్తిగతంగా చాలా క్రమశిక్షణతో ఉండేవారని, ఆహారం విషయంలోనూ నియంత్రణ పాటించేవారని, ఆమె నుంచి పప్పు నెయ్యి వేసుకొని తినడం నేర్చుకున్నానని ప్రేమ తెలిపారు.
ఎక్కువ మంది చదివినవి : Rajamouli : ఆ హీరో చాలా గొప్పోడు.. సినిమా కోసం తన జీవితాన్నే ఇచ్చేశాడు.. రాజమౌళి కామెంట్స్..
సౌందర్య మరణానంతరం ఆమె ఇంటికి వెళ్ళినప్పుడు, బాక్స్ లో ఉన్న బాడీని చూసి, ఆమె తల్లి బాధను చూసి తాను చాలా చలించిపోయానని అన్నారు. సౌందర్య మృతదేహం ఆమె చేతికున్న వాచ్ ద్వారానే గుర్తించబడిందని వచ్చిన వార్తలు నిజమే అని అన్నారు. సౌందర్య, ఆమె సోదరుడి ఫోటోలను చూసి, “ఇంత గొప్ప అమ్మాయి పోయిందా” అని ఎమోషనల్ అయ్యాయని.. . కళాకారుల జీవితం క్షణికమని, కీర్తి, హోదా ఇక్కడే వదిలి వెళ్లాల్సి వస్తుందని, కేవలం కర్మ, గౌరవం మాత్రమే మన వెంట వస్తాయని ఈ సంఘటన ద్వారా తనకు అర్థమైందని చెప్పుకొచ్చింది. సౌందర్య భర్త రఘు గురించి మాట్లాడుతూ, ప్రస్తుతం ఆయన సాఫ్ట్‌వేర్ రంగంలో పనిచేస్తున్నారని.. ఆయన మళ్ళీ వివాహం చేసుకున్నారని, వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారని తెలిపారు. వారిలో ఒకరు కుమార్తె అని, ఆమెను చూస్తే మళ్ళీ సౌందర్య పుట్టినట్టే ఉందని ప్రేమ అన్నారు. రఘు చాలా మృదు స్వభావి అని, డౌన్ టు ఎర్త్ వ్యక్తి అని ప్రేమ చెప్పుకొచ్చారు. ఇప్పటికీ తాను మాట్లాడుతుంటాడని తెలిపింది.
ఎక్కువ మంది చదివినవి : Tollywood : ఆ వాన పాట వల్లే హీరోయిన్‌గా సినిమాలు చేయడం మానేశా.. అసలు విషయం చెప్పిన టాలీవుడ్ నటి.
