Tollywood : ఆ వాన పాట వల్లే హీరోయిన్‌గా సినిమాలు చేయడం మానేశా.. అసలు విషయం చెప్పిన టాలీవుడ్ నటి..
టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఒక నటి తన కెరీర్‌లోని కీలక మలుపులు వివరించారు. ఒక వాన పాట షూటింగ్ సమయంలో జరిగిన అవమానం కారణంగా ఆమె సినిమాలు మానేశారు. ఆత్మాభిమానం ప్రధానంగా తాను జీవిస్తానని, ఆర్థిక కష్టాలు ఉన్నప్పటికీ ఇష్టపడ్డ పనినే చేస్తానని ఆమె వెల్లడించారు. టీవీ ద్వారా తిరిగి కెరీర్‌ను ప్రారంభించి, ప్రస్తుతం తన సొంత నిబంధనల ప్రకారమే పనిచేస్తున్నానని తెలిపారు.

తెలుగులో ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది నటి ప్రగతి. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన నటనా ప్రస్థానం, సినిమాలు ఎందుకు మానేశారు, తిరిగి పరిశ్రమకు ఎలా వచ్చారు అనే విషయాలను ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ముఖ్యంగా, ఒక వాన పాట చిత్రీకరణ సందర్భంగా జరిగిన సంఘటనే తనను సినిమాల నుంచి దూరం చేసిందని ఆమె స్పష్టం చేశారు. ప్రగతి హీరోయిన్‌గా చేసిన చివరి చిత్రంలో, ఒక వాన పాట షూటింగ్ జరుగుతుండగా సెట్‌లో ఒక వ్యక్తి మాట్లాడిన విధానం ఆమెకు నచ్చలేదు. “అసలు అతను ఎవరు? నాతోటి ఇలా మాట్లాడటం ఏంటి? అసలు ఇన్ని మాటలు పడతా నేను ఎందుకు చేయాలి” అని ప్రశ్నించుకుని, ఆత్మాభిమానం దెబ్బతినడంతో ఆ సినిమా తర్వాత తాను ఇంకెప్పుడూ నటించనని చెప్పి సినీ పరిశ్రమను వదిలి వెళ్లిపోయానని ప్రగతి తెలిపారు. తనకు ఆత్మాభిమానం చాలా ఎక్కువని, తప్పు చేయనప్పుడు ఎవరైనా అనవసరంగా ఒక మాట అంటే పడనని ఆమె అన్నారు. తాను చేసే పనిని వంద శాతం అంకితభావంతో, నిబద్ధతతో, డిసిప్లిన్‌తో చేస్తానని, ఎవరి జోలికీ వెళ్లనని, అబద్ధాలు మాట్లాడనని అన్నారు.
సినిమాలు మానేసిన తర్వాత, ఆర్థిక అవసరాల రీత్యా మళ్లీ పని చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని ప్రగతి పేర్కొన్నారు. అప్పుడు టెలివిజన్ ద్వారా, దూరదర్శన్‌లో తన ప్రయాణాన్ని తిరిగి ప్రారంభించారు. ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ మళ్లీ ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నారు. ప్రస్తుతం తాను తన సొంత నిబంధనల ప్రకారమే పనిచేస్తానని, ఏ రోజూ తన ఆత్మాభిమానాన్ని వదులుకుని బతకాలని అనుకోలేదని తెలిపారు. తాను సింగిల్ మదర్, సింగిల్ ఉమెన్ అయినప్పటికీ, పెద్ద ప్రొడక్షన్లలో, పెద్ద దర్శకులతో, ఎస్టాబ్లిష్డ్ హీరోలతో పనిచేయడం వల్ల ఇండస్ట్రీలో ఎటువంటి తీవ్రమైన సమస్యలు ఎదుర్కోలేదని ఆమె స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో వచ్చే ప్రపోజల్స్‌ను తాను పట్టించుకోనని, తనకు దాదాపు 50 ఏళ్లు అని ఆమె నవ్వేస్తూ చెప్పారు.
ప్రగతి కేవలం 24 సంవత్సరాల వయస్సులోనే తల్లి పాత్రలు చేయడం ప్రారంభించారు. హీరోయిన్‌గా గ్యాప్ వచ్చిన తర్వాత మళ్లీ అలాంటి అవకాశాలు రాలేదని, ఆ సమయంలో సురేష్ ప్రొడక్షన్స్‌లో తల్లి పాత్ర ఆఫర్ వచ్చిందని వివరించారు. మొదట నిరాకరించినప్పటికీ, శ్రీవిద్య అమ్మ సలహా మేరకు ఆ పాత్రకు అంగీకరించానని తెలిపారు. “సురేష్ ప్రొడక్షన్స్ చాలా పెద్ద కంపెనీ, నువ్వు వర్క్ చెయ్యి, మంచి పేరు వస్తుంది, సినిమా ఆడినా ఆడకపోయినా నీకైతే మంచి పేరు వస్తుంది” అని శ్రీవిద్య అమ్మ చెప్పిన మాట తన కెరీర్‌కు ఎంతో ఉపయోగపడిందని, ఆవిడ మాట వల్లే ఈరోజు తాను ఇక్కడ ఉన్నానని ప్రగతి కృతజ్ఞతలు తెలిపారు. అప్పుడంటే ఇప్పుడు తాను మరింత మెచ్యూర్డ్‌గా, ఆలోచనాత్మకంగా ఉన్నానని, ప్రస్తుత వయస్సులో అందంగా ఉండటమే గొప్ప అని ఆమె పేర్కొన్నారు. పవర్ లిఫ్టింగ్‌లో ఎటువంటి ఆర్థిక లాభం లేదని, అది తన అభిరుచిని తీర్చుకోవడానికే అని ఆమె వివరించారు. ఆర్థికంగా ఎప్పుడూ ఇబ్బందులు లేకుండా లేవని, అప్పులు చేస్తూనే జీవితాన్ని నెట్టుకొస్తున్నానని, ఇతరుల్లాగే ఆస్తిపాస్తులు రొటేట్ చేసుకుంటూ బతుకుతున్నానని వెల్లడించారు.
ఎక్కువ మంది చదివినవి : Mahesh Babu: మహేష్ బాబును అన్నయ్య అని పిలిచిన ఏకైక హీరోయిన్.. హీరో రియాక్షన్ తెలిస్తే..
View this post on Instagram
ఎక్కువ మంది చదివినవి : Tollywood : ప్రకాష్ రాజ్ సినిమాలో ఛాన్స్ అన్నారు.. ఐదుగురికి కమిట్మెంట్ అడిగారు.. టాలీవుడ్ నటి..
