AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gunashekar: ఆ హీరో చిన్నప్పుడు కూచిపూడి డ్యాన్స్ చేస్తే.. రవింద్రభారతిలో విజిల్స్ మారుమోగాయి.. డైరెక్టర్ గుణశేఖర్..

డైరెక్టర్ గుణశేఖర్.. తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ఇప్పటివరకు ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించి ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేశాడు. తక్కువ సమయంలోనే విభిన్న కంటెంట్ చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించాడు. చివరగా యుఫోరియా చిత్రంతో అడియన్స్ ముందుకు వచ్చిన ఆయన.. గతంలో ఓ ఇంటర్వ్యూలో టాలీవుడ్ స్టార్ హీరో గురించి చెప్పుకొచ్చారు.

Gunashekar: ఆ హీరో చిన్నప్పుడు కూచిపూడి డ్యాన్స్ చేస్తే.. రవింద్రభారతిలో విజిల్స్ మారుమోగాయి.. డైరెక్టర్ గుణశేఖర్..
Gunashekar
Rajitha Chanti
|

Updated on: May 21, 2026 | 4:09 PM

Share

తెలుగు చలన చిత్రపరిశ్రమలో వన్ ఆఫ్ ది సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గుణశేఖర్. టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలతో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలను తెరకెక్కించారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. తన కెరీర్‌లో మైలురాయిగా నిలిచిన “బాలరామాయణం” చిత్ర నిర్మాణ విశేషాలను, గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ బాల్య జ్ఞాపకాలను పంచుకున్నారు. తాను తన రెండవ సినిమా “సొగసు చూడతరమా” తర్వాత పురాణ నేపథ్యం కలిగిన “బాలరామాయణం” ప్రతిపాదనతో నిర్మాత ఎం.ఎస్.రెడ్డిని సంప్రదించినప్పుడు ఎదురైన తొలి సవాళ్లను గుణశేఖర్ వివరించారు. కుర్రాడైన తాను రామాయణం వంటి పురాణ గాథను ఎలా హ్యాండిల్ చేయగలనని ఎం.ఎస్.రెడ్డి మొదట సందేహించారన్నారు. దీనిపై స్పష్టత నిచ్చేందుకు, ఎం.ఎస్.రెడ్డి సూచన మేరకు దాదాపు 20 మంది పండితులు, వారిలో మాలకొండయ్య రెడ్డి, గుంటూరు శేషేంద్ర శర్మ వంటి ప్రముఖులు ఉన్న సభలో గుణశేఖర్ “బాలరామాయణం” కథను వివరించాల్సి వచ్చింది. వాల్మీకి రామాయణం చదివి, కథను తాను రాసుకున్న క్రమంలో వివరించిన తర్వాత, పండితులందరికీ ఆయన దర్శకత్వ ప్రతిభపై నమ్మకం కుదిరిందని, అప్పుడే సినిమా ముందుకు కదిలిందని గుణశేఖర్ తెలిపారు. అప్పట్లో మూడు కోట్లతో నిర్మించిన ఈ చిత్రం భారీ బడ్జెట్ ప్రాజెక్టుగా నిలిచింది.

ఎక్కువ మంది చదివినవి : Mahesh Babu: మహేష్ బాబును అన్నయ్య అని పిలిచిన ఏకైక హీరోయిన్.. హీరో రియాక్షన్ తెలిస్తే..

బాల నటుడుగా జూనియర్ ఎన్టీఆర్‌ను ఎంపిక చేయడం వెనుక కూడా ఆసక్తికరమైన కథ ఉంది. జూనియర్ ఎన్టీఆర్‌ను ఎం.ఎస్.రెడ్డి గుర్తించారు. ఎం.ఎస్.రెడ్డి ప్రతి సాయంత్రం రవీంద్రభారతిలో జరిగే కార్యక్రమాలకు అతిథిగా హాజరయ్యేవారు. అలా ఒకసారి రవీంద్రభారతిలో జూనియర్ ఎన్టీఆర్ ఇచ్చిన కూచిపూడి నృత్య ప్రదర్శనను చూసి ఆయన ఎంతగానో ఆకట్టుకున్నారు. ఎన్.టి.రామారావు మనవడు అసాధారణమైన ప్రదర్శన ఇచ్చాడని చెప్పి, జూనియర్ ఎన్టీఆర్ పేరును గుణశేఖర్‌కు సూచించింది ఎం.ఎస్.రెడ్డి.

ఎక్కువ మంది చదివినవి : Jr.NTR : ఎన్టీఆర్ ఎక్కువగా వినే పాట ఇది.. నిజంగా జీవితం మొత్తాన్ని కళ్లు ముందు చూపించే సాంగ్.. యూట్యూబ్‏లో ట్రెండింగ్..

“బాలరామాయణం” షూటింగ్ సమయంలో జూనియర్ ఎన్టీఆర్ హైపర్ యాక్టివ్‌గా ఉండేవారని, ఒకచోట కుదురుగా కూర్చోలేని చురుకైన పిల్లవాడని గుణశేఖర్ గుర్తు చేసుకున్నారు. ఒక సందర్భంలో శివధనుస్సును షాట్‌కు ముందే విరిచేయడంతో షూటింగ్ ఆగిపోయిందని, అప్పుడు తాను ఎన్టీఆర్‌ను తీవ్రంగా మందలించానని ఆయన తెలిపారు. అయితే, ఈ సమయంలో జూనియర్ ఎన్టీఆర్ తల్లి ప్రదర్శించిన సహనం, క్రమశిక్షణ అద్భుతమని గుణశేఖర్ అన్నారు. తన తల్లి, డైరెక్టర్ ఏం చెప్పినా వినాలని, ఆయన తిట్టినా, కొట్టినా పడాల్సిందే అని తన కొడుకుకు చెప్పిందని, ఇది జూనియర్ ఎన్టీఆర్ ఉన్నత స్థాయికి ఎదగడంలో ఆయన తల్లి పెంపకం ఎంత ముఖ్యమో తెలియజేస్తుందని చెప్పారు. జూనియర్ ఎన్టీఆర్ చిన్ననాటి ప్రతిభ, అంకితభావం, తల్లిదండ్రుల సహకారం అతని విజయానికి పునాదులని ఈ సంఘటనలు రుజువు చేస్తున్నాయి.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : ప్రకాష్ రాజ్ సినిమాలో ఛాన్స్ అన్నారు.. ఐదుగురికి కమిట్మెంట్ అడిగారు.. టాలీవుడ్ నటి..

Jrntr

Jrntr

ఎక్కువ మంది చదివినవి : Sravana Bhargavi: ఇద్దరి మధ్య చిన్న చిన్న గొడవలు కామన్.. కానీ చివరకు.. తల్లి కూతురు మధ్యలో అలాంటివి.. శ్రావణ భార్గవి..

Follow Us