AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jr.NTR : ఎన్టీఆర్ ఎక్కువగా వినే పాట ఇది.. నిజంగా జీవితం మొత్తాన్ని కళ్లు ముందు చూపించే సాంగ్.. యూట్యూబ్‏లో ట్రెండింగ్..

జూనియర్ ఎన్టీఆర్ సినిమాల కోసం ఫ్యా్న్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే దేవర మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న తారక్.. ప్రస్తుతం డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ అనే సినిమా చేస్తున్నారు. కొన్ని నెలలుగా ఈ మూవీ షూటింగ్ వేగంగా జరుగుతుంది. మే 20న ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఆయన వ్యక్తిగత జీవితం గురించి తెలుసుకోవడానికి నెటిజన్స్ తెగ ఆసక్తి చూపిస్తున్నారు.

Jr.NTR : ఎన్టీఆర్ ఎక్కువగా వినే పాట ఇది.. నిజంగా జీవితం మొత్తాన్ని కళ్లు ముందు చూపించే సాంగ్.. యూట్యూబ్‏లో ట్రెండింగ్..
Jr Ntr
Rajitha Chanti
|

Updated on: May 19, 2026 | 3:32 PM

Share

పాన్ ఇండియా స్టార్ ఎన్టీఆర్ క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. ఆర్ఆర్ఆర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న తారక్.. ప్రస్తుతం డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ అనే సినిమాలో నటిస్తున్నారు. కొన్ని నెలలుగా ఈ మూవీ చిత్రీకరణలో బిజీగా ఉన్నారు తారక్. భారతీయ చలనచిత్ర పరిశ్రమలో నటుడిగా, అద్భుతమైన డ్యాన్సర్‌గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్. కేవలం నటనలోనే కాకుండా గాయకుడిగా కూడా తారక్ తన ప్రతిభను చాటుకున్నారు. ఆయన గతంలో నటించిన ‘యమదొంగ’, ‘కంత్రీ’, ‘ఊసరవెల్లి’, ‘రభస’, ‘నాన్నకు ప్రేమతో’ వంటి చిత్రాలలో పాటలు పాడి ప్రేక్షకులను అలరించారు. అంతేకాకుండా కన్నడంలో కూడా ఒక సూపర్ హిట్ సాంగ్ ఆలపించారు. అయితే, ఇంతటి సంగీతాభిమానం ఉన్న జూనియర్ ఎన్టీఆర్ ఫోన్‌లో అత్యధిక సార్లు ప్లే అయ్యే సాంగ్ ఏంటో తెలుసా? అదే.. ఆశాపాశం సాంగ్.

ఎక్కువ మంది చదివినవి : Trisha : ఆ హీరోను చూసి చాలా గిల్టీగా ఫీలయ్యా.. అతడంటే చాలా ఇష్టం.. హీరోయిన్ త్రిష కామెంట్స్..

చిన్న సినిమాగా వచ్చి బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన సినిమా ‘కేరాఫ్ కంచరపాలెం’. ఈ చిత్రంలోని “ఆశ పాశం” పాట ఎంతగా పాపులర్ అయ్యిందో చెప్పక్కర్లేదు. ఇప్పటికీ యూట్యూబ్ లో ట్రెండింగ్ అవుతుంది ఈ సాంగ్. తారక్ మొబైల్‌లో లూప్‌లో ప్లే అయ్యే మెలోడీ ట్రాక్ ఇదే అని గతంలో ఆర్ఆర్ఆర్ ప్రమోషనల్లో చెప్పుకొచ్చారు. రామ్ చరణ్, దర్శకుడు రాజమౌళితో కలిసి పాల్గొన్న ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. “మీ ఫోన్‌లో ఎక్కువగా ప్లే అయ్యే పాట ఏది?” అని యాంకర్ అడగ్గా, ఎన్టీఆర్ ఏమాత్రం ఆలోచించకుండా “ఆశ పాశం” అని సమాధానమిచ్చారు. అంతేకాదు, ఆ ఇంటర్వ్యూలోనే ఈ పాటలోని కొన్ని లైన్లను తారక్ తన మధురమైన గాత్రంతో పాడి వినిపించారు.

ఎక్కువ మంది చదివినవి : Kajal : నా ఫస్ట్ క్రష్ అతడే.. ఇప్పటికీ నాకు మంచి స్నేహితుడిగా ఉన్నాడు.. హీరోయిన్ కాజల్..

ఎన్టీఆర్ పాడుతుంటే పక్కనే ఉన్న రామ్ చరణ్ స్పందిస్తూ.. “నేను ముందే చెప్పాను కదా, తారక్ చాలా అద్భుతంగా పాడగలడు” అని అన్నారు. దర్శకుడు వెంకటేష్ మహా తెరకెక్కించిన ‘కేరాఫ్ కంచరపాలెం’ చిత్రంలోని ఈ హార్ట్ టచింగ్ సాంగ్‌కు స్వీకర్ అగస్తీ అద్భుతమైన బాణీలు అందించగా, విశ్వ సాహిత్యం సమకూర్చారు. ప్రముఖ గాయకుడు అనురాగ్ కులకర్ణి తన గాత్రంతో ఈ పాటను మరో స్థాయికి తీసుకెళ్లారు. రీల్ లైఫ్‌లోనే కాకుండా రియల్ లైఫ్‌లోనూ ఎన్టీఆర్ క్లాసిక్ అండ్ మెలోడీ సాంగ్స్‌ను ఎంతగా ఇష్టపడతారో చెప్పడానికి ఈ సంఘటనే ఒక ఉదాహరణ.

ఎక్కువ మంది చదివినవి : Murali Mohan: ఆరోజు బాలకృష్ణ చేసిన పని ఇప్పటికీ మర్చిపోలేను.. ఉదయాన్నే 5 గంటల వరకే.. మురళిమోహన్ కామెంట్స్..

ఎక్కువ మంది చదివినవి : Jagapathi Babu : ఇప్పుడున్న హీరోలలో అతడంటే చాలా ఇష్టం.. మాట ఇస్తే నిలబెట్టుకుంటాడు.. జగపతి బాబు..

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!