AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వేసవిలో చికెన్, గుడ్లు, చేపలు తింటే ఒంట్లో వేడి చేస్తుందా..? అపోహలు కాదు నిపుణులు చెబుతున్న అసలు వాస్తవాలు ఇవే..

ఎండాకాలం వచ్చిందంటే నాన్‌వెజ్ ప్రియులకు ఒక పెద్ద టెన్షన్ మొదలవుతుంది. ఈ ఎండల్లో చికెన్, గుడ్లు తింటే ఒంట్లో వేడి చేస్తుందా? మొటిమలు, అజీర్ణం సమస్యలు వస్తాయా? అనే భయంతో చాలా మంది ముక్క ముట్టడమే మానేస్తుంటారు. అసలు వేసవిలో మాంసాహారం తినడం నిజంగానే హానికరమా? లేక ఇదంతా వట్టి అపోహేనా? అనేది తెలుసుకుందాం..

వేసవిలో చికెన్, గుడ్లు, చేపలు తింటే ఒంట్లో వేడి చేస్తుందా..? అపోహలు కాదు నిపుణులు చెబుతున్న అసలు వాస్తవాలు ఇవే..
Should You Eat Eggs, Chicken And Fish In Summer
Krishna S
|

Updated on: May 22, 2026 | 7:40 PM

Share

ఎండలు మండిపోతున్న ఈ కాలంలో ఆహార నియమాలపై రకరకాల చర్చలు నడుస్తుంటాయి. ముఖ్యంగా నాన్‌వెజ్ ప్రియులకు ఈ సీజన్‌లో ఒక పెద్ద సందేహం ఎదురవుతుంది. అదేంటంటే.. వేసవిలో గుడ్లు, చికెన్, చేపలు తింటే శరీరంలో వేడి పెరుగుతుందా? మొటిమలు, అజీర్ణం వంటి సమస్యలు వస్తాయా? అని.. ఈ భయంతో చాలా మంది ఎండాకాలం ముగిసే వరకు మాంసాహారాన్ని ముట్టడమే మానేస్తుంటారు. మరి వేడి వాతావరణంలో ఈ ఆహారాలు నిజంగానే హాని చేస్తాయా? ఇది నిజమా లేక కేవలం అపోహా? ఈ ప్రశ్నలన్నింటికీ ప్రముఖ పోషకాహార నిపుణులు సమాధానాలు ఇచ్చారు.

అది కేవలం అపోహ మాత్రమే

ప్రముఖ పోషకాహార నిపుణురాలు నమామి అగర్వాల్ ఒక ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో ఈ విషయంపై స్పష్టతనిచ్చారు. వేసవిలో గుడ్లు, చికెన్, చేపలు తినడం అనారోగ్యకరమనేది కేవలం ఒక అపోహ మాత్రమే అని ఆమె తేల్చి చెప్పారు. ఈ ఆహారాలు శరీరానికి బరువును పెంచకుండా రోజంతా చురుకుగా ఉండటానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలను అందిస్తాయని ఆమె వివరించారు.

గుడ్డు ఒక పవర్‌హౌస్

గుడ్లు శరీరంలో కొంత వేడిని కలిగించవచ్చు. కానీ మితంగా తింటే అది ఒక సంపూర్ణ ఆహారం. చాలా మంది బరువు తగ్గే క్రమంలో గుడ్డు పచ్చసొనను పక్కన పెడతారు. కానీ గుడ్డులో ఉండే కాల్షియం, ఐరన్ కంటెంట్‌లో దాదాపు 90 శాతం పచ్చసొనలోనే ఉంటుంది. గుడ్లు, చికెన్, చేపలలో లీన్ ప్రోటీన్, ఫైబర్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి, రక్తపోటును అదుపులో ఉంచడానికి, ఎముకలు మరియు దంతాలను బలోపేతం చేయడానికి అద్భుతంగా పనిచేస్తాయి.

రోజుకు ఎన్ని గుడ్లు తినవచ్చు?

మరొక పోషకాహార నిపుణురాలు మెహర్ రాజ్‌పుత్ కూడా దీనిని బలపరిచారు. గుడ్ల ద్వారా లభించే ప్రొటీన్, కాల్షియం, ఐరన్, ఫాస్ఫరస్, జింక్, విటమిన్ డి, ఎ వంటి పోషకాలు అలసటను నివారించి, రోగనిరోధక శక్తిని పెంచుతాయని ఆమె తెలిపారు. అయితే వేసవిలో రోజుకు రెండు గుడ్లు తినడం సురక్షితమని, అంతకంటే ఎక్కువ తీసుకుంటే శరీర ఉష్ణోగ్రత పెరిగి, కడుపు సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని ఆమె హెచ్చరించారు.

అన్నీ కలిపి తినవచ్చా? లిమిట్స్ ఏంటి?

వేసవిలో గుడ్లు, చికెన్, చేపలను కలిపి తినకూడదనే నియమం ఏమీ లేదు. మీకు నచ్చితే కలిపి కూడా తినవచ్చు. కానీ వీటిని రోజుకు కొద్ది మొత్తంలో లేదా వారానికి రెండు సార్లు పెద్ద పోర్షన్స్ రూపంలో తీసుకోవడం మంచిది. అలాగే, మీ డైట్‌లో ఎలాంటి పెద్ద మార్పులు చేసే ముందైనా ఒకసారి వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం.

తింటూనే శరీరాన్ని చల్లగా ఉంచుకోండి ఇలా..

మాంసాహారం తింటూనే వేసవి తాపం నుండి శరీరాన్ని కాపాడుకోవడానికి నిపుణులు కొన్ని చక్కటి వంట పద్ధతులను, చిట్కాలను సూచించారు

లైట్ కుకింగ్ పద్ధతులు: వేసవిలో చికెన్, చేపలను నూనెలో డీప్ ఫ్రై చేయడం లేదా చిక్కటి మసాలా గ్రేవీలతో వండటం మానేయాలి. వీటికి బదులు గ్రిల్లింగ్ , పోచింగ్, స్టీమింగ్ వంటి పద్ధతులను వాడితే అదనపు కొవ్వులు తగ్గి, జీర్ణక్రియ సులువవుతుంది.

కూలింగ్ కాంబినేషన్: ప్రోటీన్ ఆహారాలు తీసుకునేటప్పుడు వాటితో పాటు పెరుగు, దోసకాయ, పుదీనా వంటి చల్లదనాన్నిచ్చే పదార్థాలను చేర్చుకోండి.

హైడ్రేషన్ ముఖ్యం: శరీరంలో వేడి పెరగకుండా ఉండాలంటే పుష్కలంగా నీరు తాగాలి. నిమ్మరసం, మజ్జిగ, కొబ్బరినీళ్లు వంటి ఎలక్ట్రోలైట్లు అధికంగా ఉండే పానీయాలు ఎక్కువగా తీసుకోవాలి.

వెజ్ ఆప్షన్స్: చికెన్‌కు ప్రత్యామ్నాయంగా ప్రోటీన్ కోసం కాయధాన్యాలు, శనగలు, టోఫు వంటి ప్లాంట్-బేస్డ్ ఆహారాలను లేదా టర్కీ, రొయ్యలు వంటి తక్కువ కొవ్వు ఉండే మాంసాలను ఎంచుకోవచ్చు.

వేసవిలో నాన్‌వెజ్ పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు. అతిగా కాకుండా మితంగా తింటూ, సరైన పద్ధతిలో వండుకుంటే ముక్క లేనిదే ముద్ద దిగని నాన్‌వెజ్ ప్రియులకు ఎండ కాలం కూడా హ్యాపీగా గడిచిపోతుంది..

Follow Us