AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bank Holidays: దేశవ్యాప్తంగా వరుసగా మూడు రోజుల పాటు బ్యాంకులు బంద్.. రేపటి నుంచే..

శుక్రవారం నుంచి వరుసగా మూడు రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. జనవరి 26వ తేదీన మెహర్రం పండుగ వస్తోంది. దీంతో దేశవ్యాప్తంగా బ్యాంకులు బంద్ కానున్నాయి. ఆ తర్వాత నాల్గో శనివారం, ఆదివారం బ్యాంకులకు సాధారణ సెలవు. దీంతో మూడు రోజులు బ్యాంకులు ఉండవు.

Venkatrao Lella
|

Updated on: Jun 25, 2026 | 11:57 AM

Share
ఏదైనా పని కోసం బ్యాంకుకు వెళ్లాలని అనుకుంటున్నారా..? అయితే మీ పని ఈ రోజే పూర్తి చేసుకోండి. ఎందుకంటే రేపటి నుంచి బ్యాంకులు వరుసగా మూడు రోజుల పాటు మూతపడనున్నాయి. మొహర్రం వస్తుండటంతో బ్యాంకులకు వరుస సెలవులు రానున్నాయి. మొహర్రం కారణంగా జూన్ 26న బ్యాంకులు మూతపడనన్నాయి. ఇక నాలుగో శనివారం, ఆదివారం రావడంతో మరో రెండు రోజుల పాటు బ్యాంకులు బంద్ కానున్నాయి.

1 / 5
బ్యాంక్ పనులు ఏమైనా ఉంటే ఈ రోజే పూర్తి చేసుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అయితే మెహర్రం సెలవులు ఒక్కొ రాష్ట్రంలో ఒక్కొలా ఉన్నాయి. దీంతో బ్యాంకులు ఏ రోజున మూతపడతాయనే విషయంలో కాస్త గందరగోళం నెలకొంది. చంద్రుడి దర్శనం ఆధారంగా పండుగ తేదీని నిర్ణయించే సాంప్రదాయం అమల్లో ఉంది.

2 / 5
ప్రవక్త ముహమ్మద్ మనవడైన హజ్రత్ హుస్సేన్, అతని సహచరులు కర్బలాలో అమరులయ్యారు. వారి అమరత్వాన్ని స్మరించుకోవడానికి మొహర్రం పండుగను జరుపుకుంటారు. ఈ సంవత్సరం జూన్ 26 శుక్రవారం నాడు వస్తుంది. ఈ సందర్భంగా బ్యాంకులు మూసివేయబడతాయి. జూన్ 27వ తేదీ నెలలోని నాల్గవ శనివారం సందర్భంగా బ్యాంకులకు సెలవు దినం. అలాగే జూన్ 28వ తేదీ ఆదివారం బ్యాంకులకు సాధారణ సెలవు.

3 / 5
అయితే మొహర్రం పండుగ గురించి కొంతమందికి స్పష్టత ఉండదు. ఇస్లామిక్ పండుగలు చంద్ర క్యాలెండర్ ఆధారంగా ఉండటమే ఈ సందేహానికి కారణం. మొహర్రం పండుగ తేదీ చంద్రుని దర్శనంపై ఆధారపడి ఉంటుంది. చంద్రుడు కనిపిస్తే పండుగను ప్రకటిస్తారు. లేకపోతే మరుసటి రోజు ప్రకటిస్తారు. దీంతో ఒక్కొ ప్రాంతంలో ఒక్కొలా పండుగ తేదీ ఉంటుంది.

4 / 5
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రాష్ట్రాల వారీగా బ్యాంకు సెలవులను ప్రకటిస్తూ ఉంటుంది. దేశంలోని చాలా ప్రాంతాలలో మొహర్రం సెలవు జూన్ 26న రానుంది. అయితే చంద్ర దర్శనం ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక ప్రకటన జారీ చేస్తే బ్యాంకు సెలవులు మారవచ్చు. దీంతో బ్యాంక్ ఖాతాదారులు స్థానిక అధికారులు, బ్యాంకుల నుండి వచ్చే ప్రకటనలను గమనించాలి.

5 / 5
Follow Us