ఒక్క ఫొటోతో.. రకరకాల రూమర్స్‌కు చెక్ పెట్టిన త్రిష
విజయ్ బర్త్‌డే సందర్భంగా త్రిష షేర్ చేసిన ఒకే ఒక ఫోటో, వారి స్నేహ బంధంపై నెలకొన్న వందల అనుమానాలకు, బ్రేకప్ రూమర్లకు తెరదించింది. కనీసం విషెస్ కూడా చెప్పలేదని సోషల్ మీడియాలో వైరల్ అయిన వార్తలకు చెక్ పెడుతూ, కేక్ కట్ చేస్తున్న ఫోటోని షేర్ చేసింది.
గత కొద్ది రోజులుగా తమిళనాడులోనే కాదు, దేశవ్యాప్తంగా సినీ ప్రియులను ఊపేసిన ఒక వార్తపై హీరోయిన్ త్రిష క్రిష్ణన్ స్పష్టతనిచ్చింది. తమిళనాడు ప్రముఖ నటుడు విజయ్, త్రిషల బంధానికి బ్రేకప్ వచ్చిందని, వారి స్నేహం ముగిసిందని రకరకాల వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. జూన్ 22న విజయ్ పుట్టినరోజు సందర్భంగా త్రిష కనీసం విషెస్ కూడా చెప్పలేదని, విజయ్ ఇన్‌స్టాగ్రామ్‌ను త్రిష అన్‌ఫాలో చేశారంటూ వార్తలు తెగ వైరల్ అయ్యాయి. దీంతో అభిమానుల్లో నిజంగానే వారి మధ్య దూరం పెరిగిందా అనే చర్చ మొదలైంది.అయితే, ఈ రూమర్లన్నింటికీ త్రిష ఒక్క ఫోటోతో సమాధానం చెప్పింది. విజయ్ పుట్టినరోజు విషెస్‌తో పాటు, స్వయంగా కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేస్తున్న ఫోటోని ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఒకే ఒక్క ఫోటో వందల అనుమానాలను పటాపంచులు చేసింది. కోట్ల మంది అభిమానుల ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది. త్రిష షేర్ చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది విజయ్, త్రిష మధ్య బంధం ఇప్పటికీ బలమైనదే అని నిరూపించింది.
అడవిలో చరిత్ర ఆనవాళ్లు
హుండీ దొంగ అడ్డంగా బుక్
వారెవ్వా.. తొలిరోజే మత్స్యకారులకు జాక్‌పాట్.. ఒకే సారి
రాత్రివేళ ఒంటరిగా క్యాబ్‌లో యువతి ప్రయాణం! ఆ డ్రైవర్ చేసిన పనికి
బ్లాక్ మిల్క్.. ప్రకృతి వింత! ఆశ్చర్యపరిచే శాస్త్రీయ నిజం
భూకంపాలకు చెక్కుచెదరని పిరమిడ్ల సీక్రెట్ ఇది!
ఇంట్లో కూలర్ ఆన్ చేస్తున్నారా.. ఒక్కసారి ఈ వీడియో చూడండి!

