మారిన ట్రెండ్‌కు తగ్గట్టుగా హీరోల ఖతర్నాక్ లుక్స్..!
టాలీవుడ్ హీరోలు ఇప్పుడు ప్రతి సినిమాకు సరికొత్త లుక్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. మహేష్ బాబు, ప్రభాస్, ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలు తమ సినిమాలకు తగ్గట్టుగా మేకోవర్లు చేసుకుంటున్నారు. పోటీని తట్టుకుని, కథ డిమాండ్స్‌కు అనుగుణంగా తమ రూపాన్ని మార్చుకుంటూ, సినిమాపై ఆసక్తిని పెంచుతున్నారు. ఈ నూతన ట్రెండ్‌ను పరిశీలిద్దాం.
టాలీవుడ్లో ఇప్పుడు ఒక కొత్త ట్రెండ్ కొనసాగుతోంది. కేవలం రామ్ చరణ్, అల్లు అర్జున్ మాత్రమే కాకుండా, గతంలో లుక్స్ విషయంలో పెద్దగా మార్పులు చేయడానికి ఇష్టపడని హీరోలు కూడా ప్రతి సినిమాకు ఒక సరికొత్త లుక్‌ను మెయింటైన్ చేయడానికి వెనుకాడటం లేదు. బయట కాంపిటీషన్ పెరగడం, కథ డిమాండ్స్ అలాగే ఉండటంతో హీరోలకు ఇది అనివార్యంగా మారింది.మహేష్ బాబు విషయానికొస్తే, గతంలో ఆయనకు లుక్స్ విషయంలో పెద్ద పట్టింపులు ఉండేవి కావు. కానీ గుంటూరు కారం కోసం జుట్టు పెంచిన ఆయన, రాజమౌళి సినిమా కోసం పూర్తిగా రూపాన్ని మార్చేశారు. గత సూపర్ స్టార్ మహేష్‌కి, ఇప్పుడు చూస్తున్న మహేష్‌కి చాలా తేడాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.మేకోవర్ విషయంలో ప్రభాస్ అందరికంటే ముందున్నారు. రాజా సాబ్ చిత్రంలో వింటేజ్ లుక్‌లో, కల్కిలో పొడవాటి జుట్టుతో పోనీటెయిల్‌తో కనిపించారు. సలార్‌లో మాసీ లుక్, ఇక స్పిరిట్ కోసం మరోలా మారిపోయారు. కల్కి 2, సలార్ 2, ఫౌజీ వంటి భవిష్యత్ చిత్రాలకు కూడా ఆయన లుక్స్ విభిన్నంగా ఉంటాయి.
నీటిలో చిక్కుకున్న ఐదుగురిని రక్షించిన పోలీసులు!
ఏంట్రా ఇలా ఉన్నారు.. AIతో చావును కూడా మోసం చేశాడు..
పరుగెత్తి గెలిచింది కానీ.. నిరాశే ఎదురైంది!
సీఎంనే కదిలించిన చిన్నారి పెద్ద మనసు
రూ.3 లక్షల ఐఫోన్లో డిస్ప్లే సమస్య.. అసలు కారణం ఇదేనా?
11 కేవీ విద్యుత్ వైర్‌పై ఉమ్మి వేశాడు.. క్షణాల్లో..
రెండేళ్లకే చిన్నారి అద్భుతం.. తబలాపై 12 తాళాలు వాయించి రికార్డ్

