AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vishnu Vishal: నేను ఆ వ్యాధితో బాధపడుతున్నా.. అందుకే ఇలా అయిపోయా.. షాకింగ్ విషయం చెప్పిన విష్ణు విశాల్

కోలీవుడ్ హీరో విష్ణు విశాల్ గత కొద్ది రోజులుగా తన ఆరోగ్యంపై వస్తోన్న రూమర్లపై స్పందించాడు. ఈ మేరకు గురువారం (జూన్ 25) సోషల్ మీడియా వేదికగా ఒక ఎమోషనల్ నోట్ రిలీజ్ చేశాడు. ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్ కాగా పలువురు సెలబ్రిటీలు హీరోకు ధైర్యం చెబుతున్నారు.

Vishnu Vishal: నేను ఆ వ్యాధితో బాధపడుతున్నా.. అందుకే ఇలా అయిపోయా.. షాకింగ్ విషయం చెప్పిన విష్ణు విశాల్
Vishnu Vishal
Basha Shek
|

Updated on: Jun 25, 2026 | 4:08 PM

Share

కోలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో విష్ణు విశాల్ తెలుగు ఆడియెన్స్ కు కూడా బాగా పరిచయం. అతను నటించిన సినిమాలన్నీ తెలుగులోనూ విడుదలవుతుంటాయి. అలాగే దగ్గుబాటి రానా అరణ్య, ఎఫ్‌ఐఆర్ తదితర తెలుగు సినిమాల్లోనూ నటించాడీ ట్యాలెంటెడ్ యాక్టర్. సినిమాల సంగతి పక్కన పెడితే హైదరాబాద్ కు చెందిన ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు విష్ణు విశాల్. ఇలా తెలుగు ఆడియెన్స్ కు కూడా బాగా చేరువైన ఈ హీరో గురించి గత కొన్ని రోజులుగా రకరకాల రూమర్లు వస్తున్నాయి. ముఖ్యంగా అతని ఆరోగ్యం విషయంలో పలు వదంతులు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తన ఆరోగ్యంపై వస్తోన్న రూమర్లపై స్వయంగా స్పందించాడు విష్ణు విశాల్. ఈ మేరకు సోషల్ మీడియాలో ఒక ఎమోషనల్ నోట్ పెట్టాడీ హీరో.

‘అందరికీ హాయ్.. అన్నిటికంటే ముందుగా మీ కామెంట్స్, మెసేజుల ద్వారా మీరు చూపిన ప్రేమకు, శ్రద్ధకు ధన్యవాదాలు. ఇది నాకు నిజంగా చాలా విలువైనది. అందుకే ఈ విషయాన్ని మీ అందరితోనూ పంచుకోవాలనుకున్నాను. ఈ మధ్య నా ముఖం అలసిపోయినట్లు కనిపిస్తోందని మీలో చాలామంది గమనించారు. దీనికి కారణం ఏమిటంటే.. నేను గత 3-4 సంవత్సరాలుగా ఒక ఆటో ఇమ్యూన్ వ్యాధితో బాధపడుతున్నాను. దీని చికిత్సలో భాగంగా డాక్టర్స్ కొన్ని మందులు సూచించారు. అవి తీసుకున్నందుకే నేనిలా మారిపోయాను. ఈ మందులు తీసుకుంటున్నప్పుడు కడుపు ఉబ్బరంతో పాటు బాడీలో కొన్ని మార్పులు కలుగుతున్నాయి. నా ఆరోగ్యానికి మొదట ప్రాధాన్యత ఇవ్వాలి అలాగే వైద్యపరంగా ఈ చికిత్స చాలా అసవరం. ఈ క్లిష్ట సమయంలో మీ ప్రేమ, అభిమానం నన్నుముందుకు నడిపిస్తున్నాయి. ‘గట్ట కుస్తీ 2 (మట్టి కుస్తి)’ కోసం అవిశ్రాంతంగా పనిచేసిన ప్రతి ఒక్కరి పట్ల నాకున్న బాధ్యతను నిర్వర్తించాలనుకున్నాను. అందుకే నేను సినిమా ప్రమోషన్ల కు హాజరవుతూనే ఉన్నాను.

ఇవి కూడా చదవండి

విష్ణు విశాల్ ఎమోషనల్ పోస్ట్..

‘ త్వరలోనే నా ఆరోగ్యం మెరుగుపడుతుందని ఆశిస్తున్నా. మీ భయం, ఆందోళన నన్ను నేను మరింత జాగ్రత్తగా చూసుకోవడానికి ప్రోత్సహించింది. జులై 3న థియేటర్లలో ‘గట్ట కుస్తీ 2’ సినిమాను మీ అందరితో చూడటం కోసం నేను ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. మీ ప్రేమకు, మద్ధతుకు నిజంగా ధన్యవాదములు’ అని రాసుకొచ్చాడు విష్ణు విశాల్. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు ఈ హీరోకు జాగ్రత్తలు చెబుతున్నారు. అలాగే ధైర్యం చెబుతూ కామెంట్స్ పెడుతున్నారు.

భార్య బిడ్డలతో విష్ణు విశాల్..

View this post on Instagram

A post shared by Jwala Gutta (@jwalagutta1)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us