AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

'చేతబడులు.. క్షుద్ర పూజలు..' సరదాగా ఈ వీకెండ్ వణికిపోవాలంటే ఈ సిరీస్ చూడండి!

‘చేతబడులు.. క్షుద్ర పూజలు..’ సరదాగా ఈ వీకెండ్ వణికిపోవాలంటే ఈ సిరీస్ చూడండి!

Samatha J
|

Updated on: Jun 25, 2026 | 1:15 PM

Share

హారర్ థ్రిల్లర్ అభిమానుల కోసం ZEE5లో ముత్తశ్శి అనే మలయాళ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. కేరళ-కర్ణాటక సరిహద్దులోని తుళు గ్రామంలో రాజన్ కుటుంబం పూర్వీకుల ఇంట్లోకి అడుగుపెట్టాక వింత సంఘటనలు జరుగుతాయి. క్షుద్ర పూజల ప్రభావంతో శ్రీకుట్టన్ రాక్షసుడిగా మారతాడు. కుటుంబం ఈ తాంత్రిక శక్తులను ఎలా ఎదుర్కొంటుంది అన్నది కథాంశం. జూన్ 26 నుండి తెలుగులోనూ అందుబాటులో ఉంటుంది.

హారర్, థ్రిల్లర్ సినిమాలు, వెబ్ సిరీస్‌లను ఇష్టపడే ప్రేక్షకులను అలరించడానికి ముత్తశ్శి అనే మలయాళ వెబ్ సిరీస్ సిద్ధంగా ఉంది. చేతబడులు, క్షుద్ర పూజల నేపథ్యంలో రూపొందిన ఈ సిరీస్ ZEE5 ఓటీటీలో జూన్ 26 నుండి స్ట్రీమింగ్ కానుంది. తెలుగులో కూడా అదే రోజు అందుబాటులోకి వస్తుంది. ఈ సిరీస్ కథ కేరళ-కర్ణాటక సరిహద్దులో ఉన్న తుళు అనే గ్రామంలో మొదలవుతుంది. రాజన్, అతని భార్య లీల, కుమారుడు శ్రీకుట్టన్‌తో కలిసి జీవిస్తుంటారు. ఒక రోజు వారు తమ పూర్వీకుల ఇంటికి వెళ్ళినప్పుడు, ఆ ఇంట్లో వింతవింత సంఘటనలు ఎదురవుతాయి. శ్రీకుట్టన్ దెయ్యం పట్టిన వాడిలా ప్రవర్తిస్తాడు. గతంలో రాజన్ తల్లి చేసిన క్షుద్ర పూజల ప్రభావం వల్ల శ్రీకుట్టన్ క్రమంగా రాక్షసుడిగా మారిపోతాడు.కన్నబిడ్డ కళ్లముందే ఇలా మారిపోవడంతో తల్లి లీల, తండ్రి రాజన్ తీవ్ర ఆవేదనకు గురవుతారు. తమ కుమారుడిని తాంత్రిక శక్తుల నుండి ఎలా కాపాడుకున్నారు? ఆ క్షుద్ర శక్తులను వారు ఎలా ఎదుర్కొన్నారు అన్నదే ఈ సిరీస్ లో ప్రధాన అంశం.

Published on: Jun 25, 2026 12:37 PM
Follow Us