Allu Arjun: జస్ట్ మిస్.. లేదంటే.. వీర భద్రుడిగా బన్నీ రెచ్చిపోయేవాడే
సూర్య నటించిన ‘కరుప్పు’ సినిమా భారీ విజయాన్ని అందుకుంటుండగా, ఈ మూవీకి మొదట అల్లు అర్జున్‌ను హీరోగా అనుకున్నారనే వార్త ఆసక్తి రేపుతోంది. దర్శకుడు ఆర్జే బాలాజీ రెండేళ్ల క్రితమే బన్నీకి కథ వినిపించాడట. అయితే ‘పుష్ప 2’తో బిజీ కావడంతో ఆ ప్రాజెక్ట్ సూర్య వద్దకు వెళ్లిందని సమాచారం. ఇప్పుడు ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకుపోతోంది.
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య గత కొన్నేళ్లుగా వరుస అపజయాలతో సతమతమవుతున్నాడు. భారీ ఆశలు పెట్టుకున్న కంగువా, రెట్రో సినిమాలు బాక్సాఫీస్ వద్ద దారుణంగా పరాజయం పాలయ్యాయి. అయితే కరుప్పు, తెలుగులో వీరభద్రుడు సినిమాతో సూర్య ఎట్టకేలకు సక్సెస్ ట్రాక్ ఎక్కాడు. మే 15న రిలీజైన ఈ సినిమా తమిళంతో పాటు తెలుగులోనూ సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లను రాబడుతూ మరోసారి సూర్య స్టామినాను ప్రూవ్ చేసింది. ఇప్పటికే ఈ సినిమాకు రూ. 200 కోట్లకు పైగా కలెక్షన్లు వచ్చాయి. దర్శకుడు ఆర్జే బాలాజీ తెరకెక్కించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీలో బ్యూటీ క్వీన్ త్రిష హీరోయిన్‌గా నటించింది. ఆర్జే బాలాజీనే విలన్ గా ఆకట్టుకున్నాడు. ఇక ఈ విషయాలు పక్కకు పెడితే… కురుప్పు సినిమా గురించి ఒక ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. అదేంటంటే.. కరుప్పు సినిమాకు హీరో సూర్య ఫస్ట్ ఛాయిస్ కాదట. సినిమా కథను బట్టి మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అయితే బాగుంటుందని డైరెక్టర్ అనుకున్నాడట. అంతేకాదు.. కరుప్పు దర్శకుడు ఆర్జే బాలాజీ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి ముందుగా ఈ కథని కూడా వినిపించాడట. అది కూడా రెండేళ్ల క్రితమే. అంటే పుష్ప 2 సినిమా షూటింగ్ సమయంలో కరుప్పు సినిమా కథ బన్నీకి చెప్పాడట బాలాజీ. అల్లు అర్జున్‌కి కూడా సినిమ కాన్సెప్ట్, కథ కూడా చాలా బాగా నచ్చాయట. అయితే ద్వితీయార్థంలో కొన్ని మార్పులు సూచించాడట బన్నీ. దీనికి బాలాజీ చాలా సమయం తీసుకున్నాడట. ఇంతలోనే బన్నీ పుష్ప 2 తో బిజీ అయిపోవడం ఆతర్వాత అట్లీ, లోకేశ్ కనగరాజ్ లతో కమిట్ అవ్వడంతో ఆర్జే బాలాజీ సూర్యకు ఈ కథ వినిపించాడట. ఇక ఈ స్టోరీ విన్న సూర్య వెంటనే ఒకే చెప్పాడట. అలా కరుప్పు సినిమా తెరకెక్కి ఇప్పుడు బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్స్ సునామీ సృష్టిస్తోంది. అయితే ఒకవేళ అల్లు అర్జున్ ఈ సినిమా చేసి ఉంటే పుష్ప తరహాలో మరో ఇండస్ట్రీ హిట్ అయ్యేదని సినీ అభిమానులు అభిప్రాయపడుతున్నారు. వీరభద్రుడు గెటప్ బన్నీకి సరిగ్గా సరిపోతుందని, దీనికి తోడు ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలోనూ దేవుడి సినిమాల కాన్సెప్ట్ కు మంచి క్రేజ్ ఉందంటున్నారు. ఆ లెక్కన బన్నీ ఈ మూవీ చేసి ఉంటే ఈజీగా వందల కోట్లు వచ్చేదని ఫ్యాన్స్ సోషల్ మీడియా లో చర్చించుకుంటున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Ananya Nagalla: మూడేళ్లు బ్రేకప్ బాధతోనే బతికా.. శాడ్ బ్రేకప్ స్టోరీ
Jayam Ravi: నెలకు 40 లక్షలు ఇవ్వాల్సిందే! భార్య డిమాండ్ విని.. షాక్‌లో స్టార్ హీరో!
Peddi: పెద్ది మూవీకి ఐబొమ్మ టెన్షన్..! భారీ యాక్షన్‌కు సిద్ధమైన మేకర్స్
Dragon: 4 నిమిషాల్లోనే సోషల్ మీడియా షేక్.. డ్రాగన్‌తో ఆల్‌టైమ్ రికార్డ్ కొట్టిన ఎన్టీఆర్
Peddi: ఉప్పెన ట్విస్ట్ కంటే పెద్దిలో 100 రెట్లు ట్విస్ట్! చరణ్ బిగ్ హింట్!
కోట్లు ఇచ్చినా రాని ఆనందం.. రైతన్నను మురిపించిన నేల తల్లి
ఆ ఒక్క మాటతో.. ఆ మేనేజర్ లేచి వెళ్లిపోయాడు !
కొమ్ముతో జీపును ఎత్తిపడేసింది! భయంతో కేకలు వేసిన టూరిస్ట్‌లు..
10 నిమిషాల డెలివరీ కంటే ప్రశాంతతే ముఖ్యం!
కరెంట్ లేకుండానే కూలింగ్! ఇక ఏసీతో పనిలేదు
వామ్మో... ఆ ఊరి నిండా పాములే!
భీమేశ్వరాలయ సమీపంలో అరుదైన శ్వేతనాగు.. ప్రత్యక్షం

