AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: అదేం పనిరా నాయనా.. భార్య కాపురానికి రావడం లేదని భర్త ఏం చేశాడంటే..

Telangana: భర్త వేధింపులు భరించలేక లావణ్య కొన్ని నెలల క్రితం తన ఇద్దరు పిల్లలను తీసుకొని దౌలాపూర్‌లోని పుట్టింటికి వచ్చేసింది. అయినా నాగరాజులో మార్పురాలేదు. పుట్టింటికి వెళ్లిన భార్యకు ఫోన్లు చేస్తూ, కాపురానికి రాకపోతే చంపేస్తానంటూ వరుసగా బెదిరింపులకు పాల్పడ్డాడు. ఈ..

Telangana: అదేం పనిరా నాయనా.. భార్య కాపురానికి రావడం లేదని భర్త ఏం చేశాడంటే..
Sangareddy Crime
P Shivteja
| Edited By: |

Updated on: May 22, 2026 | 7:49 PM

Share

Telangana: భార్య కాపురానికి రావడం లేదని ఓ అల్లుడు ఘాతుకానికి ఒడిగట్టాడు. కట్టుకున్న భార్య, కన్నబిడ్డలు, అత్తమామలు ఉన్న ఇంటికి అర్ధరాత్రి వేళ పెట్రోల్ పోసి నిప్పంటించాడు. అంతటితో ఆగకుండా భార్యకు వీడియో కాల్ చేసి లైవ్‌లో ఆ దారుణాన్ని చూపించాడు. ఈ షాకింగ్ ఘటన సంగారెడ్డి జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. హత్నూర మండలం దౌలాపూర్ గ్రామంలో అర్థరాత్రి పెద్ద ప్రమాదం తప్పింది.

మద్యం మత్తు అదనపు కట్నం వేధింపులు. చివరకు కన్నపిడ్డలను, భార్యను సజీవ దహనం చేసే స్థాయికి అతన్ని దిగజార్చాయి. మెదక్ జిల్లా కొల్చారం మండలం నాయిని జలాల్ పూర్ గ్రామానికి చెందిన నాగరాజుకు, దౌలాపూర్ గ్రామానికి చెందిన లావణ్యతో 2018లో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే పెళ్లైన కొంతకాలానికే నాగరాజు మద్యానికి బానిసయ్యాడు. అదనపు కట్నం తేవాలంటూ భార్య లావణ్యను తీవ్రంగా వేధించడం మొదలుపెట్టాడు.

ఇది కూడా చదవండి: Telangana: మరణిస్తూ ఐదుగురు ప్రాణాలను కాపాడాడు..

ఇవి కూడా చదవండి

భర్త వేధింపులు భరించలేక లావణ్య కొన్ని నెలల క్రితం తన ఇద్దరు పిల్లలను తీసుకొని దౌలాపూర్‌లోని పుట్టింటికి వచ్చేసింది. అయినా నాగరాజులో మార్పురాలేదు. పుట్టింటికి వెళ్లిన భార్యకు ఫోన్లు చేస్తూ, కాపురానికి రాకపోతే చంపేస్తానంటూ వరుసగా బెదిరింపులకు పాల్పడ్డాడు. ఈ క్రమంలోనే ఈ నెల 14న అర్ధరాత్రి నాగరాజు దౌలాపూర్‌లోని అత్తగారింటికి చేరుకున్నాడు. అందరూ నిద్రిస్తున్న సమయంలో ఇల్లు పక్కన ఉన్న గుడిసెకి నిప్పు పెట్టాడు.

గుడిసెతో పాటు ఇల్లు కూడా తగలబడి పోయేలా ప్లాన్ వేశాడు. ఇలా పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఎవరూ బయటకు రాకుండా తలుపులు గడియపెట్టాడు. ఆ తర్వాత భార్య లావణ్యకు వీడియో కాల్ చేసి మీ ఇల్లు తగలబడుతోంది చూడు అంటూ వికృత ఆనందం పొందాడు. గుడిసెలో నుండి పెద్ద ఎత్తున పొగలు, మంటలు రావడాన్ని పక్కింటి వారు గమనించారు. వెంటనే అప్రమత్తమై మంటలను ఆర్పివేయడంతో.. లోపల ఉన్న అత్తమామలు, లావణ్య, ఇద్దరు పిల్లలు ప్రాణాలతో బయటపడ్డారు. ఊహించని ఈ ప్రమాదం నుంచి వారంతా తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
గ్యారేజీలోకి లగ్జరీ ఈవీకి వెల్‌కమ్ చెప్పిన కొరియోగ్రాఫర్
గ్యారేజీలోకి లగ్జరీ ఈవీకి వెల్‌కమ్ చెప్పిన కొరియోగ్రాఫర్
AI టెక్నాలజీతో కొత్త ప్రొడక్ట్‌ తెచ్చేసిన మెటా
AI టెక్నాలజీతో కొత్త ప్రొడక్ట్‌ తెచ్చేసిన మెటా
ఒప్పో రెనో కొత్త మోడల్ చూసి ఫిదా అయిపోయారా
ఒప్పో రెనో కొత్త మోడల్ చూసి ఫిదా అయిపోయారా
నేపాల్ ప్రకృతి అందాల మధ్యలో మీనాక్షి చౌదరి.. బ్యూటిఫుల్ ఫొటోస్
నేపాల్ ప్రకృతి అందాల మధ్యలో మీనాక్షి చౌదరి.. బ్యూటిఫుల్ ఫొటోస్
మీ లైఫ్ స్టైల్‌కు తగ్గట్టుగా స్మార్ట్‌వాచ్ ఎంచుకోండిలా
మీ లైఫ్ స్టైల్‌కు తగ్గట్టుగా స్మార్ట్‌వాచ్ ఎంచుకోండిలా
దేవుడికి నైవేద్యం ఎందుకు పెడతారు? పరమాత్మ నిజంగా స్వీకరిస్తాడా?
దేవుడికి నైవేద్యం ఎందుకు పెడతారు? పరమాత్మ నిజంగా స్వీకరిస్తాడా?
బాష్, సీమెన్స్ నుంచి కొత్త ఫోర్-డోర్ రిఫ్రిజిరేటర్‌‌
బాష్, సీమెన్స్ నుంచి కొత్త ఫోర్-డోర్ రిఫ్రిజిరేటర్‌‌
నిర్జల ఏకాదశి వ్రత కథ.. భీముడు చేసిన ఈ ఒక్క వ్రతం వల్ల 26..
నిర్జల ఏకాదశి వ్రత కథ.. భీముడు చేసిన ఈ ఒక్క వ్రతం వల్ల 26..
క్రేజీ ఆఫర్:ఎలుగుబంటిలా నటిస్తే చాలు..లక్షల్లో జీతం,కండీషన్స్ ఇవే
క్రేజీ ఆఫర్:ఎలుగుబంటిలా నటిస్తే చాలు..లక్షల్లో జీతం,కండీషన్స్ ఇవే
ఆ మంచి సినిమాను డిజాస్టర్ చేశారు.. హిట్ అయ్యింటే నా కెరీర్ మరోలా
ఆ మంచి సినిమాను డిజాస్టర్ చేశారు.. హిట్ అయ్యింటే నా కెరీర్ మరోలా