కూల్‌డ్రింక్స్‌తో చిప్స్ తినే అలవాటు మీకుందా? ఇది శరీరానికి ప్రమాదకరమని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కూల్‌డ్రింక్స్ డీహైడ్రేషన్‌కు, చిప్స్ శరీరంలో ఉప్పు, కొవ్వుల అసమతుల్యతకు దారితీస్తాయి. ఈ కాంబినేషన్ దీర్ఘకాలంలో బరువు పెరగడం, జీర్ణ సమస్యలు, గుండె సంబంధిత వ్యాధులకు కారణం కావచ్చని నిపుణులు సూచిస్తున్నారు.