తమిళ్ లో దూసుకుపోతున్న కుర్ర భామ .. తెలుగులోకి ఎప్పుడో.? 

Rajeev 

22 May  2026

instagram

తమిళంలో సూపర్ హిట్ అయిన 96 సినిమాతో సినీరంగంలో పాపులర్ అయ్యింది గౌరీ కిషన్. ఇదే సినిమా తెలుగులో జాను పేరుతో రీమేక్ చేయగా.. అందులోనూ నటించింది.

దీంతో ఇప్పుడు గౌరీ కిషన్ పేరు నెట్టింట మారుమోగింది. ఇప్పుడు ఈ అమ్మడు గురించి తెగ సెర్చ్ చేస్తున్నారు.

96 సినిమాలో చిన్నప్పటి త్రిష పాత్రలో కనిపించింది. కేరళలో జన్మించిన గౌరీ.. చెన్నైలోనే ఎక్కువగా గడిపింది. '96' తర్వాత గౌరీ కిషన్ చాలా సినిమాల్లో నటించింది.

ఇటీవలే గౌరీ కిషన్ నటించిన 'అదర్స్' సినిమా విడుదలైంది. ఆమె 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' సినిమాలో కూడా నటించింది.

అలాగే తమిళంలో మాస్టర్, కర్ణన్, హాట్ స్పాట్ వంటి చిత్రాలతో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు అదర్స్ సినిమాలో కథానాయికగా నటిస్తుంది.

తెలుగులో ఈ ముద్దుగుమ్మ సంతోష్ శోభన్ తో కలిసి శోభన్ బాబు శ్రీదేవి అనే సినిమాలో నటించింది. ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేదు.

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ అమ్మడు తాజాగా కొన్ని క్రేజీ ఫోటోలను పంచుకుంది. ఈ ఫోటోలు ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి.