AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

లక్ష్మీ నారాయణ యోగంతో ఈ 4 రాశుల జాతకం మారనుంది.. కోటీశ్వర యోగం ఖాయం!

Lakshmi Narayana Yoga: మే 29న అత్యంత శుభప్రదమైన లక్ష్మీ నారాయణ యోగం ఏర్పడనుంది. బుధుడు మిథున రాశిలోకి ప్రవేశించడంతో ఈ ప్రత్యేక యోగం కలుగుతుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఈ యోగం ప్రభావంతో కొన్ని రాశుల వారికి అకస్మాత్తుగా ధనలాభం, అదృష్టం, విజయాలు కలిగే అవకాశాలు ఉన్నాయి.

Rajashekher G
|

Updated on: May 22, 2026 | 7:49 PM

Share
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి గ్రహం నిర్దిష్ట సమయంలో రాశి మార్పు చేస్తుంది. ఈ గ్రహ సంచారాల వల్ల కొన్ని శుభయోగాలు ఏర్పడి, వాటి ప్రభావం 12 రాశులపై పడుతుంది. అలాంటి శుభప్రదమైన యోగాల్లో ఒకటైన లక్ష్మీ నారాయణ యోగం మే నెల చివర్లో ఏర్పడబోతోంది. మే 29న బుధుడు మిథున రాశిలోకి ప్రవేశించి జూన్ 8 వరకు అక్కడే సంచరిస్తాడు. ఈ కాలంలో ఏర్పడే లక్ష్మీ నారాయణ యోగం వల్ల సంపద, అదృష్టం, ఆనందం పెరుగుతాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా నాలుగు రాశుల వారికి ఈ యోగం ప్రత్యేక శుభఫలితాలను అందించనుంది.

1 / 5

మిథున రాశి.. 
లక్ష్మీ నారాయణ యోగం మిథున రాశి వారికి ఆర్థికంగా మంచి ఫలితాలు ఇవ్వనుంది. నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి. వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. పాత పెట్టుబడుల నుంచి మంచి ఆదాయం వస్తుంది. కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశముంది. అప్పుల భారం తగ్గి ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. సుదూర ప్రయాణ సూచనలు కూడా కనిపిస్తున్నాయి.

మిథున రాశి.. లక్ష్మీ నారాయణ యోగం మిథున రాశి వారికి ఆర్థికంగా మంచి ఫలితాలు ఇవ్వనుంది. నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి. వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. పాత పెట్టుబడుల నుంచి మంచి ఆదాయం వస్తుంది. కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశముంది. అప్పుల భారం తగ్గి ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. సుదూర ప్రయాణ సూచనలు కూడా కనిపిస్తున్నాయి.

2 / 5

సింహ రాశి..  
సింహ రాశి వారికి ఈ యోగం ఆకస్మిక ధనలాభాలను తీసుకురావచ్చు. ఉద్యోగంలో పురోగతి, కొత్త అవకాశాలు లభిస్తాయి. వ్యాపార విస్తరణకు ఇది అనుకూల సమయం. పని ప్రదేశంలో గుర్తింపు పెరుగుతుంది. మీ కష్టానికి తగిన ఫలితం దక్కుతుంది. పలు మార్గాల ద్వారా ఆదాయం పెరిగే సూచనలు ఉన్నాయి.

సింహ రాశి.. సింహ రాశి వారికి ఈ యోగం ఆకస్మిక ధనలాభాలను తీసుకురావచ్చు. ఉద్యోగంలో పురోగతి, కొత్త అవకాశాలు లభిస్తాయి. వ్యాపార విస్తరణకు ఇది అనుకూల సమయం. పని ప్రదేశంలో గుర్తింపు పెరుగుతుంది. మీ కష్టానికి తగిన ఫలితం దక్కుతుంది. పలు మార్గాల ద్వారా ఆదాయం పెరిగే సూచనలు ఉన్నాయి.

3 / 5

కన్యా రాశి.. కన్య రాశి వారికి లక్ష్మీ నారాయణ యోగం కెరీర్‌లో కొత్త అవకాశాలు తెస్తుంది. పదోన్నతులు, కొత్త బాధ్యతలు వచ్చే అవకాశం ఉంది. చాలా కాలంగా నిలిచిపోయిన పనులు పూర్తి అవుతాయి. విదేశీ ఉద్యోగ అవకాశాలు కలిసివస్తాయి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి విజయ సూచనలు కనిపిస్తున్నాయి. ఆదాయం పెరిగి ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది.

4 / 5
తులా రాశి.. తులా రాశి వారికి ఈ యోగం సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. వ్యాపారాల్లో లాభదాయకమైన ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది. కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయి. పాత అప్పులు తీర్చగలుగుతారు. ఇల్లు లేదా వాహనం కొనుగోలు చేసే యోగం ఉంది. కుటుంబంలో ఆనంద వాతావరణం నెలకొంటుంది. విదేశీ ప్రయాణ అవకాశాలు కూడా కలిసివస్తాయి. 

(Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం జ్యోతిష్యం, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.)

తులా రాశి.. తులా రాశి వారికి ఈ యోగం సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. వ్యాపారాల్లో లాభదాయకమైన ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది. కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయి. పాత అప్పులు తీర్చగలుగుతారు. ఇల్లు లేదా వాహనం కొనుగోలు చేసే యోగం ఉంది. కుటుంబంలో ఆనంద వాతావరణం నెలకొంటుంది. విదేశీ ప్రయాణ అవకాశాలు కూడా కలిసివస్తాయి. (Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం జ్యోతిష్యం, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.)

5 / 5
Follow Us