రాంబాయి రూటు మార్చిందిరోయ్.. కుర్రాళ్లను ఆగం చేస్తున్న తేజస్వి రావు

Rajitha Chanti

Pic credit - Instagram

22 May 2026

తెలుగు సినీ పరిశ్రమలోకి రోజుకో కొత్త ప్రతిభ అడుగుపెడుతోంది. వైవిధ్యమైన కథలతో పాటు అందం, అభినయం ఉన్న నటీమణులకు టాలీవుడ్ ఎప్పుడూ రెడ్ కార్పెట్ పరుస్తుంది.

ఈ క్రమంలోనే 'రాజు వెడ్స్ రాంబాయి' (Raju Weds Rambai) చిత్రంతో అందం, సహజ నటనతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న అచ్చ తెలుగమ్మాయి తేజస్వి రావు.

తాజాగా సోషల్ మీడియాలో చేసిన సరికొత్త ఫోటోషూట్‌తో నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది. గ్లామరస్ ఫోటోషూట్లతో నెట్టింట రచ్చ చేస్తుంది ఈ వయ్యారి ముద్దుగుమ్మ. 

తన లేటెస్ట్ గ్లామర్ ఫొటోషూట్‌తో సోషల్ మీడియాలో ఒక్కసారిగా హీట్ పెంచేసింది. ట్రెండీ మోడ్రన్ డ్రెస్సులో తన స్టైలిష్ లుక్స్‌ను ప్రదర్శిస్తూ కుర్రకారును కట్టిపడేస్తోంది.

గ్లామర్ అండ్ క్యూట్‌నెస్ కలబోసినట్లున్న తేజస్వి షేర్ చేసిన ఈ క్రేజీ పిక్స్ ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తుండగా నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. 

వెస్ట్రన్ అవుట్‌ఫిట్‌లో ఆమె చూపించిన ఈ సరికొత్త యాంగిల్ ఫ్యాన్స్‌ను సర్ప్రైజ్ చేస్తోంది. ఈ ఫోటోలలో తేజస్వి రావు బాడీ లాంగ్వేజ్, ఆమె ఇచ్చిన కాన్ఫిడెంట్ పోజులు వైరలవుతున్నాయి. 

కేవలం సాంప్రదాయ పాత్రలకే పరిమితం కాకుండా, గ్లామరస్ రోల్స్ చేయడానికి కూడా తాను సిద్ధమేనని ఈ ఫోటోషూట్ ద్వారా ఆమె పరోక్షంగా హింట్ ఇచ్చినట్లు కనిపిస్తోంది.

ప్రస్తుతం టాలీవుడ్‌లో కొత్త హీరోయిన్లకు మంచి క్రేజ్ లభిస్తోంది. రాజు వెడ్స్ రాంబాయి సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది ఈ అమ్మడు.