శ్రీకాకుళం రూరల్ గనగళ్ళపేట వద్ద నాగవల్లి నదిలో స్నానానికి దిగిన ముగ్గురు యువకుల్లో ఇద్దరు గల్లంతయ్యారు. నది సముద్రంలో కలిసే చోట ఈ విషాదం జరిగింది. స్థానికులు ఒక యువకుడిని రక్షించగా, బాంబే కాలనీకి చెందిన లీలా కృష్ణ సాయి, తిలక్ అనే ఇద్దరి కోసం పోలీసులు, ఫైర్ సిబ్బంది గాలిస్తున్నారు.