AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prabhas: నా జీవితంలో మొదటిసారి కన్నీళ్లు వచ్చిన మూమెంట్ అదే.. ప్రభాస్ ఎమోషనల్

ప్రభాస్ తన తండ్రితో ఉన్న అనుబంధం గురించి తొలిసారి భావోద్వేగంగా మాట్లాడారు. తను ఎక్కువగా మౌనంగా ఉన్నా, తండ్రి తన మనసులోని మాటలను ఎలా అర్థం చేసుకునేవారో వివరించారు. ఈశ్వర్ పూజ సమయంలో తండ్రితో జరిగిన ఒక మధురమైన జ్ఞాపకాన్ని పంచుకుంటూ, ఆయన్ను ఎంతగా మిస్ అవుతున్నారో తెలియజేశారు.

Prabhas: నా జీవితంలో మొదటిసారి కన్నీళ్లు వచ్చిన మూమెంట్ అదే.. ప్రభాస్ ఎమోషనల్
Prabhas
Ram Naramaneni
|

Updated on: Feb 23, 2026 | 7:50 AM

Share

ప్రముఖ సినీ నటుడు ప్రభాస్ ఎంత డౌన్ టూ ఎర్త్ ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అంతేకాదు ఆయన ఇంట్రోవర్ట్ కూడా. జనంతో కలవడానికి ఇష్టపడరు. తన ఎమోషన్స్ ఎక్కువగా బయటపెట్టరు. అయితే తన తండ్రితో ఉన్న అనుబంధం గురించి ఒక ఇంటర్వ్యూలో తొలిసారిగా అత్యంత భావోద్వేగంగా మాట్లాడారు. తాను సహజంగా ఫీలింగ్స్ అన్నీ మనసులో ఉంటాయని..  స్నేహితులతో తప్ప తండ్రి, తల్లి వంటి కుటుంబ సభ్యులతో కూడా ఎక్కువగా మాట్లాడనని ప్రభాస్ పేర్కొన్నారు. అయితే, తన తండ్రి తన మనసులోని భావాలను, తనలో ఉన్న టెన్షన్‌ను తాను చెప్పకుండానే, కేవలం తన కనురెప్పపాటుతోనే అర్థం చేసుకుని, అవసరమైన అన్ని ఏర్పాట్లను చేసేవారని ఆయన గుర్తుచేసుకున్నారు. తాను ఏమీ చెప్పకుండానే తన కోసం తండ్రి ఆలోచించే ఆ అద్భుతమైన విధానాన్ని, ఆయన స్పష్టమైన అవగాహనను తాను చాలా మిస్ అవుతున్నానని ప్రభాస్ హృదయపూర్వకంగా తెలియజేశారు.

ఈ సందర్భంగా, ఒక ఈశ్వర్ పూజ సమయంలో జరిగిన ఒక మధురమైన, భావోద్వేగపూరితమైన జ్ఞాపకాన్ని కూడా ప్రభాస్ పంచుకున్నారు. ఆ సందర్భంలో తాను ఆవేశంగా “ఆ ఈశ్వరుడికి మూడు కళ్లయితే, ఈ ఈశ్వరుడికి మూడు గుండెలు” అనే డైలాగ్‌ను చెప్పానని, ఆ ఉద్వేగంలో ఎలా చెప్పానో కూడా తనకు తెలియదని వివరించారు. ఆ క్షణంలో తన తండ్రి తన చేయి పట్టుకుని “యస్..” అని అన్నారని, అది తన తండ్రితో తనకు ఉన్న అత్యంత అందమైన క్షణాలలో ఒకటని ప్రభాస్ భావోద్వేగంగా వెల్లడించారు. వారిద్దరి మధ్య ఉన్న లోతైన, మౌనమైన అనుబంధానికి, పరస్పర అవగాహనకు ఈ మాటలు నిదర్శనంగా నిలుస్తాయి.

Follow Us