చిత్ర పరిశ్రమలో రాణించాలంటే కేవలం అందం, అభినయం ఉంటేనే సరిపోదు, వీటికి తోడు కొద్దిగా అదృష్టం కూడా కలిసి రావాలి. టాలీవుడ్‌లో గ్లామర్ పరంగా సెన్సేషన్ సృష్టించింది
కానీ సరైన సక్సెస్ లేక వెనుకబడిన ముద్దుగుమ్మలలో కేతిక శర్మ ఒకరు. పూరి జగన్నాథ్ నిర్మించిన ‘రొమాంటిక్’ సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది ఈ అమ్మడు.
తొలి చిత్రంలోనే తన హాట్ లుక్స్‌తో, రొమాంటిక్ సీన్స్‌తో కుర్రకారు గుండెల్లో మంటలు రేపింది. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది.
ఆ తర్వాత నాగశౌర్య సరసన ‘లక్ష్య’ సినిమాలో నటించినా ఈమెకు నిరాశే ఎదురైంది. అయినప్పటికీ కేతికకు అవకాశాలు మాత్రం తగ్గలేదు. తెలుగులో వరుస ఆఫర్స్ వచ్చాయి.
మెగా హీరో వైష్ణవ్ తేజ్ సరసన ‘రంగ రంగ వైభవంగా’, అలాగే పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్‌లో వచ్చిన ‘బ్రో’ సినిమాలోనూ కీలక పాత్ర పోషించింది.
ఈ భారీ చిత్రాలు కూడా ఆమెకు బ్రేక్ ఇవ్వలేకపోయాయి. ప్రస్తుతం కొత్త సినిమాలు ఏవీ అనౌన్స్ చేయని కేతిక శర్మ, సోషల్ మీడియా వేదికగా అభిమానులను పలకరిస్తోంది.
నిరంతరం సరికొత్త, స్టన్నింగ్ ఫోటోషూట్లను షేర్ చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. తాజాగా ఈ భామ పోస్ట్ చేసిన కొన్ని గ్లామరస్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
ఈ ఫోటోలలో కేతిక తన పర్ఫెక్ట్ ఫిగర్ , బోల్డ్ లుక్స్‌తో ఇంటర్నెట్‌లో హీట్ పెంచేస్తోంది. ఈ ఫోటోలపై నెటిజన్లు "బ్యూటీ క్వీన్", "స్టన్నింగ్ కేతిక" అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.