AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cinema : వణుకుపుట్టించే సీన్స్.. మళ్లీ మళ్లీ చూడాలనిపించే సస్పెన్స్.. ఓటీటీలో ఈ సిరీస్ అస్సలు మిస్స్ అవ్వకండి..

ఇటీవల కాలంలో ఓటీటీలో సస్పెన్స్ థ్రిల్లర్, ఓటీటీ చిత్రాల జోరు నడుస్తుంది. నిత్యం కొత్త కొత్త కంటెంట్ చిత్రాలు దూసుకుపోతున్నాయి. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఓ సినిమా ఆద్యంతం ఆకట్టుకుంటుంది. క్షణక్షణం వణుకుపుట్టించే భయానక సీన్లతో సాగుతుంది. ఇంతకీ ఈ సినిమా పేరెంటో తెలుసా.. ?

Cinema : వణుకుపుట్టించే సీన్స్.. మళ్లీ మళ్లీ చూడాలనిపించే సస్పెన్స్.. ఓటీటీలో ఈ సిరీస్ అస్సలు మిస్స్ అవ్వకండి..
Kennedy Movie
Rajitha Chanti
|

Updated on: Feb 23, 2026 | 2:36 PM

Share

ప్రస్తుతం ఓటీటీలో ఓ మూవీ దూసుకుపోతుంది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఆ చిత్రం జనాలకు తెగ నచ్చేసింది. అనుక్షణం గుండె ఆగిపోయే సస్పెన్స్ తో సాగుతున్నప్పటికీ ఈ సినిమాను చూసేందుకు జనాలు ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న సినిమా పేరు కెన్నెడీ. ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ జీ5లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇందులో నటుడు రాహుల్ భట్ ఉదయ శెట్టి అనే మాజీ పోలీసు అధికారి పాత్రలో కనిపించాడు. అయితే ప్రపంచం మొత్తం అతడు చనిపోయాడని నమ్ముతుంది. కానీ అతడు కెన్నెడీ పేరుతో ముంబై వీధుల్లో నివసిస్తుంటాడు.

ఎక్కువ మంది చదివినవి : Cinema : వెంకటేశ్ హీరోగా సినిమా.. ఒక్క ఫైట్ లేకుండా తీస్తే ఇండస్ట్రీనే ఒక ఊపు ఊపేసింది.. నిర్మాత కామెంట్స్..

అతను యాప్ ద్వారా నడిచే టాక్సీ డ్రైవర్‌గా పనిచేస్తాడు. కానీ వాస్తవానికి అతను ముంబై పోలీస్ కమిషనర్ రహస్య హంతకుడిగా వ్యవహరిస్తాడు. రాజకీయ నాయకులు, రౌడీలు సృష్టించే సమస్యలను పరిష్కరించడానికి కమిషనర్ అతన్ని ఉపయోగించుకుంటాడు. అలాగే అతను నిద్రలేమితో బాధపడుతుంటాడు. 2014లో జరిగిన ఒక సంఘటన కారణంగా అతను తన భార్య, కుమార్తెను కోల్పోతాడు. అందుకు కారణమైన నేరస్థుడిపై ప్రతీకారం తీర్చుకోవాలని అతను నిశ్చయించుకుంటాడు.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : ప్రభాస్ అడగ్గానే 30 లక్షలు ఇచ్చాడు.. తాతలు 3 వేల ఎకరాలు దానం చేశారు.. డైరెక్టర్ కామెంట్స్..

ఈ సినిమాను అనురాగ్ కశ్యప్ తన సాధారణ శైలిలో హింసాత్మక, చీకటి ప్రపంచాన్ని చిత్రీకరించారు. ఈ చిత్రం రెండున్నర గంటల నిడివి ఉన్నప్పటికీ, వేగవంతమైన స్క్రీన్‌ప్లే కారణంగా ఇది బోరింగ్‌గా అనిపించదు. అలాగే ప్రతి క్షణం మిమ్మల్ని ఆకట్టుకుంటుంది. ఈ చిత్రాన్ని ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ జీ5లో చూడవచ్చు.

ఎక్కువ మంది చదివినవి : Folk Singer : ఒక్క పాటతో యూట్యూబ్ సెన్సేషన్.. దెబ్బకు 200 సాంగ్స్ వచ్చాయి.. ఫోక్ సింగర్స్..

Follow Us