AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ట్రంప్‌ ఎస్టేట్‌లోకి చొరబడ్డ సాయుధ దుండగుడు.. ట్రంప్ దంపతులకు తప్పిన ముప్పు..!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఎస్టేట్‌లోకి మరోసారి దుండగుడు చొరబడ్డాడు. ఫ్లోరిడాలోని ఆయన నివాసంలోకి సాయుధుడు చొరబడటంతో సీక్రెట్‌ సర్వీస్‌ ఏజెంట్లు అతడిని కాల్చిచంపారు. ఫ్లోరిడాలోని పామ్‌ బీచ్‌లో ఉన్న మార్‌-ఎ-లాగో ఎస్టేట్‌కి వారాంతంలో వస్తుంటారు ట్రంప్‌. ఇక్కడ కట్టుదిట్టమైన సెక్యూరిటీ ఉంటుంది.

ట్రంప్‌ ఎస్టేట్‌లోకి చొరబడ్డ సాయుధ దుండగుడు.. ట్రంప్ దంపతులకు తప్పిన ముప్పు..!
Donald Trump's Mar A Lago Residence
Balaraju Goud
|

Updated on: Feb 23, 2026 | 7:45 AM

Share

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఎస్టేట్‌లోకి మరోసారి దుండగుడు చొరబడ్డాడు. ఫ్లోరిడాలోని ఆయన నివాసంలోకి సాయుధుడు చొరబడటంతో సీక్రెట్‌ సర్వీస్‌ ఏజెంట్లు అతడిని కాల్చిచంపారు. ఫ్లోరిడాలోని పామ్‌ బీచ్‌లో ఉన్న మార్‌-ఎ-లాగో ఎస్టేట్‌కి వారాంతంలో వస్తుంటారు ట్రంప్‌. ఇక్కడ కట్టుదిట్టమైన సెక్యూరిటీ ఉంటుంది. అయితే, దుండగుడు.. ఈ ఎస్టేట్‌లోకి చొరబడినప్పుడు ట్రంప్‌ దంపతులు ఇక్కడ లేరని, వైట్‌హౌస్‌లోనే ఉన్నారని అమెరికా పోలీసులు వెల్లడించారు. ఇందుకు సంబంధించి దర్యాప్తు చేపట్టినట్లు ఉన్నతాధికారులు తెలిపారు.

2024 జులైలో అధ్యక్ష ఎన్నికల ప్రచార సమయంలోనూ డోనాల్డ్ ట్రంప్‌పై హత్యాయత్నం జరిగింది. ఆ దాడి నుంచి తృటిలో తప్పించుకున్నారు. గతంలో కూడా ట్రంప్‌ నివాసంలోకి చొరబడే ప్రయత్నం చేశారు దుండగులు. పామ్‌ బీచ్‌ గోల్ఫ్‌ కోర్సులో రైఫిల్‌తో అనుమానాస్పదంగా తిరుగుతోన్న ఒకరిని అప్పుడు అరెస్ట్‌ చేశారు. ఇక తాజాగా మరోసారి సాయుధ దుండగుడు ఇంట్లోకి చొరబడే ప్రయత్నం చేయడంతో కలకలం రేగింది. అర్థరాత్రి సమయంలో ఎస్టేట్‌ నార్త్‌ గేట్‌ నుంచి లోపలికి వచ్చాడు దుండగులు. అతడి చేతిలో ఆయుధంతోపాటు ఇంధనం డబ్బా ఉన్నట్టు సీక్రెట్‌ సర్వీస్‌ ఏజెంట్లు గుర్తించారు. దాంతో, అప్రమత్తమైన భద్రతా సిబ్బంది.. అతడిని కాల్చిచంపారు. దుండగుడి వయసు పాతికేళ్లలోపు ఉంటుందని.. పూర్తి సమాచారం కోసం దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు సీక్రెట్‌ సర్వీస్‌ ఏజెంట్లు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us