Pawan Kalyan: ఓజీ షూటింగ్‌ స్పాట్‌లో పవర్‌ స్టార్‌ సెల్ఫీ.. పవన్‌ కల్యాణ్‌తో ఉన్న ఈ ముగ్గురు ఎవరో తెలుసా?

పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ ఫుల్‌ స్పీడ్‌లో ఉన్నారు. ఇప్పటికే వినోదయ సీతం తెలుగు రీమేక్‌లో తన షూటింగ్‌ పార్ట్‌ను పూర్తి చేసిన పవన్‌ వెంటనే సుజిత్‌ ఓజీ సెట్‌లో జాయిన్‌ అయ్యారు. కొన్ని రోజుల క్రితమే గ్రాండ్‌గా లాంఛ్ అయిన ఈ మూవీ షూటింగ్‌ జెట్‌ స్పీడ్‌లో జరుగుతోంది.

Pawan Kalyan: ఓజీ షూటింగ్‌ స్పాట్‌లో పవర్‌ స్టార్‌ సెల్ఫీ.. పవన్‌ కల్యాణ్‌తో ఉన్న ఈ ముగ్గురు ఎవరో తెలుసా?
Pawan Kalyan
Follow us
Basha Shek

|

Updated on: May 09, 2023 | 6:05 AM

పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ ఫుల్‌ స్పీడ్‌లో ఉన్నారు. ఇప్పటికే వినోదయ సీతం తెలుగు రీమేక్‌లో తన షూటింగ్‌ పార్ట్‌ను పూర్తి చేసిన పవన్‌ వెంటనే సుజిత్‌ ఓజీ సెట్‌లో జాయిన్‌ అయ్యారు. కొన్ని రోజుల క్రితమే గ్రాండ్‌గా లాంఛ్ అయిన ఈ మూవీ షూటింగ్‌ జెట్‌ స్పీడ్‌లో జరుగుతోంది. ప్రస్తుతం ముంబైలో జరుగుతోన్న ఈ సినిమా షూటింగ్‌ స్పాట్‌ నుంచి విడుదలైన పవన్‌ ఫొటోస్‌ అభిమానులను తెగ ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం ఓజీ యాక్షన్‌ సీక్వెన్స్‌ మహారాష్ట్రలోని వాయ్‌ సరస్సు ప్రాంతంలో చిత్రీకరిస్తున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి మరొక ఫొటోను షేర్‌ చేశారు పవన్‌. షూటింగ్ జరుగుతుండగా రాజమండ్రి, కొవ్వూరు, తూర్పు గోదావరికి చెందిన ముగ్గురు జనసేన నాయకులు అక్కడికి పడవలో వచ్చారు. జనసేన జెండాను ప్రదర్శించారు. దీంతో షూటింగ్‌ స్పాట్‌లో ఉన్న పవన్‌ వారితో కలిసి సెల్ఫీ దిగారు. ‘మహారాష్ట్రలోని వాయి సరస్సు వద్ద ఓజీ షూటింగ్ చేస్తుండగా.. ముగ్గురు జన సైనికులు సింగిరి సాయి, సింగిరి రాజేశ్, సన్నీ జాన్‌లను కలిశాను’ అని ఆ ఫొటోను ట్విట్టర్‌లో షేర్‌ చేశారు పవన్‌. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఓజీలో నాని గ్యాంగ్ లీడర్‌ ఫేం ప్రియాంకా ఆరుళ్ మోహన్‌ హీరోయిన్‌గా నటిస్తోంది.

ఓజీ చిత్రంలో పవన్‌ స్టైలిష్ గ్యాంగస్టర్‌గా కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే విడుదలైన స్టిల్స్‌ పవన్‌ అభిమానుల్లో జోష్‌ నింపుతున్నాయి. తాజాగా రిలీజైన ఫొటోస్‌లో కరాటే డ్రెస్‌లో కనిపించారు పవన్‌. గతంలో ఖుషి సినిమాలోనూ ఆయన ఇదే లుక్‌లో కనిపించిన సంగతి తెలిసిందే. ఓజీ మూవీకి రవి కే చంద్రన్ సినిమాటోగ్రాఫర్‌ వ్యవహరిస్తుండగా, ఏఎస్ ప్రకాశ్ ప్రొడక్షన్‌ డిజైనర్‌ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మరోవైపు హరీష్‌ శంకర్ దర్శకత్వంలో నటిస్తున్న ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ కూడా షూటింగ్‌ దశలో ఉంది. దీంతో పాటు హరిహరవీరమల్లు షూటింగ్‌కు సంబంధించి అప్‌డేట్‌ రావాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

అప్పటి వరకు పాదరక్షలు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
అప్పటి వరకు పాదరక్షలు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్