ఇతను టాలీవుడ్‌లో కరుడుగట్టిన విలన్‌.. కడుపుబ్బా నవ్వించే బాబాయ్‌ కూడా.. ఎవరో గుర్తుపట్టారా మరి?

నాటి సీనియన్‌ ఎన్టీఆర్‌ నుంచి నేటి జూనియర్‌ ఎన్టీఆర్‌ వరకు మూడు తరాల హీరోలతో కలిసి నటించిన అనుభవం ఆయన సొంతం. తన నటనా పటిమతో తెలుగు చిత్ర పరిశ్రమలో ఎప్పటికీ గుర్తించుకోదగ్గ నటుల్లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్న ఆయన గతేడాది చివరిలో కన్నుమూశారు.

ఇతను టాలీవుడ్‌లో కరుడుగట్టిన విలన్‌.. కడుపుబ్బా నవ్వించే బాబాయ్‌ కూడా.. ఎవరో గుర్తుపట్టారా మరి?
Tollywood Actor
Follow us
Basha Shek

|

Updated on: May 08, 2023 | 6:02 AM

పై ఫొటోలో చలాకీగా చిరునవ్వులు చిందిస్తున్నది 90వ దశకం నాటి ప్రముఖ నటుడు. టాలీవుడ్‌లో ఆయనకు కరుడుగట్టిన విలన్‌గా పేరుంది. ముఖ్యంగా రేప్‌ సీన్లలో ఎక్కువగా నటించారు. సినిమాల్లోకి 90కిపైగా రేప్ సీన్లలో కనిపించిన ఆయనను చూసి నిజ నిజ జీవితంలో ఆడవాళ్లు భయపడిన సందర్భాలూ ఉన్నాయి. అలాగనీ అందుకే పరిమితం కాలేదు. తన కామెడీతో కడుపుబ్బా నవ్వించారు. ఏ పాత్ర ఇచ్చినా అందులో పరకాయ ప్రవేశం చేస్తుంటారాయన. నాటి సీనియన్‌ ఎన్టీఆర్‌ నుంచి నేటి జూనియర్‌ ఎన్టీఆర్‌ వరకు మూడు తరాల హీరోలతో కలిసి నటించిన అనుభవం ఆయన సొంతం. తన నటనా పటిమతో తెలుగు చిత్ర పరిశ్రమలో ఎప్పటికీ గుర్తించుకోదగ్గ నటుల్లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్న ఆయన గతేడాది చివరిలో కన్నుమూశారు. మరి ఈ పాటికే ఆయనెవరో అర్థమై ఉంటుంది. ఎస్‌.. ఆయన మరెవరో కాదు చలపతి రావు. 1200కు పైగా చిత్రాల్లో నటించి టాలీవుడ్‌పై చెరగని ముద్ర వేసిన ఆయన జయంతి నేడు (మే8).

చలపతిరావు 1944 మే 8న కృష్ణా జిల్లా, పామర్రు మండలంలోని బల్లిపర్రులో గ్రామంలో మణియ్య, వియ్యమ్మ దంపతులకు జన్మించారు. చిన్నప్పుడే నాటకాలపై ఆసక్తి పెంచుకున్న ఆయన ఎన్టీఆర్‌ ప్రోత్సాహంతో సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. 1966లో గూడచారి 116 సినిమాతో ఆయన చిత్రపరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చారు. యమగోల, యుగపురుషుడు,డ్రైవర్‌ రాముడు, భలే కృష్ణుడు ,సరదా రాముడు,జస్టిస్‌ చౌదరి, బొబ్బిలి పులి, దొంగ రాముడు, అల్లరి అల్లుడు, నిన్నేపెళ్లాడతా, నువ్వేకావాలి, సింహాద్రి, ఆది, చెన్నకేశవరెడ్డి, బన్నీ, బొమ్మరిల్లు, అరుంధతి, సింహా, దమ్ము, లెజెండ్‌ ఇలా ఎన్నో వందలాది హిట్ చిత్రాల్లో చలపతిరావు కీలకపాత్రలు పోషించారు. కేవలం నటుడిగానే కాకుండా కలియుగ కృష్ణుడు, కడప రెడ్డమ్మ, జగన్నాటకం, పెళ్లంటే నూరేళ్ల పంట, రాష్ట్రపతి గారి అల్లుడు, అర్ధరాత్రి హత్యలు, రక్తం చిందిన రాత్రి తదితర సినిమాలను నిర్మించి అభిరుచిగల నిర్మాతగా గుర్తింపు తెచ్చుకున్నారు. చలపతిరావు చివరిగా నాగార్జున బంగర్రాజు చిత్రంలో కనిపించారు. ఆతర్వాత ఆయనకు ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో గతేడాది డిసెంబర్‌ 24న తుది శ్వాస విడిచారు.

ఇవి కూడా చదవండి
Chalapathi Rao

Chalapathi Rao

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..