Balakrishna: బాలయ్య మజాకా! లైవ్‌లో పాట పాడిన నందమూరి హీరో.. ప్రేక్షకుల స్టాండింగ్‌ ఒవేషన్‌.. వీడియో వైరల్‌

ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణలోని గాన ప్రతిభ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఇప్పటికే పలు సందర్భాల్లో తన గొంతును సవరించుకున్నారాయన. తాజాగా తనలోని గాయకుడిని మరోసారి ప్రేక్షకులకు పరిచయం చేశారు నందమూరి హీరో.

Balakrishna: బాలయ్య మజాకా! లైవ్‌లో పాట పాడిన నందమూరి హీరో.. ప్రేక్షకుల స్టాండింగ్‌ ఒవేషన్‌.. వీడియో వైరల్‌
Nandamuri Balakrishna
Follow us
Basha Shek

|

Updated on: May 06, 2023 | 6:28 PM

ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణలోని గాన ప్రతిభ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఇప్పటికే పలు సందర్భాల్లో తన గొంతును సవరించుకున్నారాయన. తాజాగా తనలోని గాయకుడిని మరోసారి ప్రేక్షకులకు పరిచయం చేశారు నందమూరి హీరో. దోహాలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న బాలకృష్ణ లైవ్‌లో పాట ఆలపించి ఆహూతులను అలరించారు. స్వర్గీయ నందమూరి తారకరామారావు శత జయంతి ఉత్సవాల్లో భాగంగా ఖతార్‌లోని దోహాలో ఓ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పాట పాడాలని అభిమానులు కోరగా.. ఎన్టీఆర్‌ నటించిన ‘జగదేకవీరుని’ సినిమాలోని శివశంకరీ పాటను అద్భుతంగా ఆలపించారు. బాలయ్య పాటకు ఫిదా అయిన ప్రేక్షకులు చప్పట్లు కొట్టి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఒక్కసారిగా అతిథులందరూ లేచి ఆయనకు స్టాండింగ్ ఒవేషన్‌ ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరలవుతోంది. కాగా గతంలోనూ బాలయ్య స్టేజీపైన పాటలు పాడిన సంగతి తెలిసిందే. గతంలోనూ ఒక స్టేజ్‌పై ఇదే శివశంకరీ పాటను ఆలపించి ఆకట్టుకున్నారు.

అలాగే తెలుగు సినిమా వజ్రోత్సవాల సందర్భంగా లైవ్‌లో డ్యాన్స్‌ పెర్ఫామెన్స్‌ ఇచ్చారు బాలయ్య. మొత్తానికి ఇలా లైవ్‌లో పెర్ఫామెన్స్ ఇవ్వడం బాలయ్య బాబుకే చెల్లిందంటూ ఆయన అభిమానులు నెట్టింట కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే.. వీరసింహారెడ్డి సూపర్‌ హిట్‌ తర్వాత అనిల్‌ రావిపూడి డైరెక్షన్‌లో ఓ మూవీని చేస్తున్నారు బాలకృష్ణ. ఎన్‌బీకే 108 (వర్కింగ్‌ టైటిల్‌) పేరుతో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో కాజల్‌ అగర్వాల్‌ హీరోయిన్‌గా నటించనుంది. అలాగే లేటెస్ట్‌ సెన్సేషన్‌ శ్రీలీల బాలయ్య కూతురు పాత్రలో కనిపించనుంది. ఉగాది సందర్భంగా రిలీజైన బాలయ్య లుక్స్‌, అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.

బాలయ్య సాంగ్ వీడియో:

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!