Niharika Konidela: యంగ్ హీరోతో స్టెప్పులేసిన నిహారిక.. మెగా డాటర్‌ గ్రేస్‌ అదిరిపోయిందిగా.. వీడియో వైరల్‌

ఎలిఫెంట్‌ పిక్చర్స్‌ అనే ప్రొడక్షన్‌ బ్యానర్‌ను స్థాపించి సినిమాలు, వెబ్‌ సిరీస్‌ల కోసం కథలు వింటోంది. ఇదిలా ఉంటే టాలీవుడ్ యంగ్ హీరో సంతోష్ శోభన్‌తో కలిసి నిహారిక డ్యాన్స్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Niharika Konidela: యంగ్ హీరోతో స్టెప్పులేసిన నిహారిక.. మెగా డాటర్‌ గ్రేస్‌ అదిరిపోయిందిగా.. వీడియో వైరల్‌
Niharika Dance
Follow us
Basha Shek

|

Updated on: May 05, 2023 | 8:05 PM

మెగా డాటర్‌ నిహారిక కొణిదెల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మొదట ఢీ షోలో యాంకర్‌గా కెరీర్ ప్రారంభించి బుల్లితెర ప్రేక్షకులను మెప్పించిందామె. ఆ తర్వాత హీరోయిన్‌గా వెండితెరకు పరిచయమైంది. ఒక మనసు, హ్యాపీ వెడ్డింగ్‌ సినిమాల్లో కథానాయికగా నటించింది. అలాగే సూర్యకాంతం, ముద్దపప్పు ఆవకాయ, మ్యాడ్‌ హౌస్‌ వంటి వెబ్‌ సిరీసుల్లోనూ యాక్ట్‌ చేసింది. అయితే జొన్నల గడ్డ చైతన్యతో వివాహం తర్వాత నటనకు కాస్త విరామమిచ్చింది. అయితే ఈ మధ్యన భర్తతో ఆమె విడాకులు తీసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వదంతులపై ఇటు నిహారిక కానీ, అటు మెగా ఫ్యామిలీ కానీ స్పందించడం లేదు. అయితే ఇవన్నీ ఏ మాత్రం పట్టించుకోవడం లేదు మెగా డాటర్‌. మళ్లీ తన పర్సనల్‌ లైఫ్‌లో బిజీగా మారేందుకు ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే మళ్లీ నటనవైపు దృష్టి సారించింది. అలాగే ప్రొడ్యూసర్‌గానూ సత్తాచాటేందుకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా ఎలిఫెంట్‌ పిక్చర్స్‌ అనే ప్రొడక్షన్‌ బ్యానర్‌ను స్థాపించి సినిమాలు, వెబ్‌ సిరీస్‌ల కోసం కథలు వింటోంది. ఇదిలా ఉంటే టాలీవుడ్ యంగ్ హీరో సంతోష్ శోభన్‌తో కలిసి నిహారిక డ్యాన్స్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

సంతోష్ శోభన్ ప్రస్తుతం నందినీ రెడ్డి దర్శకత్వంలో ‘అన్నీ మంచి శకునములే’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ మూవీ మే18 న విడుదల కానుంది. సినిమా ప్రమోషన్లలో భాగంగా నిహారికతో కలిసి సంతోష్‌ శోభన్‌ స్టెప్పులేశాడు. మూవీలోని మెరిసే మబ్బుల్లో సాంగ్‌కు ఎంతో హుషారుగా డ్యాన్స్‌ చేశారు. దీనిని సంతోష్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేయగా అది కాస్తా వైరలవుతోంది.

ఇవి కూడా చదవండి

నిహారిక డ్యాన్స్ వీడియో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.