Pawan Kalyan: పవర్‌ స్టార్‌ OG సినిమాలో అకిరా నందన్!! సర్‌ప్రైజ్‌ సిద్ధం చేస్తోన్న సుజిత్‌! ఫ్యాన్స్‌కు ఇక పూనకాలే

స్టైలిష్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ప్రియాంక అరుల్‌ మోహన్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. కాగా ఓజీ సినిమా గురించి నెట్టింట ఒక ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. అదేంటంటే.. పవన్‌ తనయుడు అకిరా నందన్‌ కూడా ఈ సినిమాలో నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది

Pawan Kalyan: పవర్‌ స్టార్‌ OG సినిమాలో అకిరా నందన్!! సర్‌ప్రైజ్‌ సిద్ధం చేస్తోన్న సుజిత్‌! ఫ్యాన్స్‌కు ఇక పూనకాలే
Pawan Kalyan, Akira Nandan
Follow us
Basha Shek

|

Updated on: May 03, 2023 | 8:28 PM

పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ ఇప్పుడు వరుసగా సినిమాలు చేస్తున్నారు. ఒక వైపు క్రియాశీల రాజకీయాల్లో ఉంటూనే.. జెట్‌ స్పీడ్‌లో సినిమాలు కంప్లీట్‌ చేస్తున్నారు. ఇప్పటికే వినోదయ సీతం తెలుగు రీమేక్‌లో తన షూటింగ్‌ పార్ట్‌ కంప్లీట్‌ చేసుకున్న ఆయన ఇప్పుడు హరీశ్‌ శంకర్‌ ఉస్తాద్‌ భగత్ సింగ్ షూటింగ్‌లో జాయిన్‌ అయ్యాడు. ఈ రెండింటితో పాటు సాహో డైరెక్టర్‌ సుజిత్‌తో కలిసి ‘(OG ఒరిజినల్‌ గ్యాంగస్టర్‌, వర్కింగ్‌ టైటిల్‌) మూవీ చేస్తున్నాడు. ఇటీవలే ముంబయి వేదికగా ఈ సినిమా షూటింగ్‌ కూడా లాంఛనంగా ప్రారంభమైంది. పవన్‌ కల్యాణ్‌పై కొన్ని సీన్లు కూడా షూట్‌ చేశారు. స్టైలిష్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ప్రియాంక అరుల్‌ మోహన్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. కాగా ఓజీ సినిమా గురించి నెట్టింట ఒక ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. అదేంటంటే.. పవన్‌ తనయుడు అకిరా నందన్‌ కూడా ఈ సినిమాలో నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఒకవేళ ఇదే నిజమైతే ఫ్యాన్స్ కి పూనకాలు రావడం ఖాయం. ఎందుకంటే పవర్‌ స్టార్‌ ఒక్కడు స్ర్కీన్‌పై కనిపిస్తేనే థియేటర్లు దద్దరిల్లిపోతాయి. అలాంటిది పవన్‌తో పాటు అకీరానందన్‌లను ఒకేసారి సిల్వర్‌ స్ర్కీన్‌పై కనిపిస్తే అభిమానుల కోలాహలం నెక్ట్స్‌ లెవెల్‌లో ఉండనుంది.

కాగా నెట్టింట నడుస్తోన్న ప్రచారం ప్రకారం పవన్ ఈ సినిమాలో మూడు విభిన్న పాత్రల్లో కనిపిస్తున్నాడని టాక్‌ వినిపిస్తోంది. ఇందులో ఒకటి మాఫియా డాన్ పాత్ర కాగా, మరొకటి కాలేజ్ లెక్చరర్ రోల్ అట. అలాగే టీనేజ్ కుర్రాడిగా కూడా పవన్‌ కనిపించనున్నారట. అయితే ఈ రోల్ కోసం డైరెక్టర్ సుజీత్.. అకిరా నందన్‌ని తీసుకోవాలనుకుంటున్నారని తెలుస్తోంది. ఇదే విషయంపై త్వరలోనే పవన్ కల్యాణ్‌తో చర్చించనున్నారట. ఒకవేళ పవన్ దీనికి గ్రీన్ సిగ్నల్ ఇస్తే మాత్రం అకిరా నందన్ ది ఇదే డెబ్యూ మూవీ అవుతుంది. ఇప్పటికే పవన్‌- సుజీత్‌ సినిమాపై అంచనాలు ఓ రేంజ్‌లో ఉన్నాయి. ఒకవేళ అకిరా నటిస్తే మాత్రం థియేటర్లు దద్దరిల్లిపోవడం గ్యారెంటీ అంటున్నారు ఫ్యాన్స్‌. మరి ఈ వార్తలో ఎంతమేర నిజమవుతుందో త్వరలోనే క్లారిటీ రానుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

సంగీత ప్రపంచంలో యార్కర్ల కింగ్ మలింగ...
సంగీత ప్రపంచంలో యార్కర్ల కింగ్ మలింగ...
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?