AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kohli vs Gambhir: కోహ్లీ, గంభీర్‌లకు బలవంతంగానైనా బలగం సినిమాను చూపెట్టాల్సిందే.. ఫ్యాన్స్‌ డిమాండ్

తమ ఆటతీరుతో భారత జట్టుకు ఎన్నో గొప్ప విజయాలు అందించిన విరాట్ కోహ్లీ, గంభీర్‌ ఇలా తగవులాడడం చాలామందికి నచ్చడం లేదు. యువ క్రికెటర్లకు స్ఫూర్తిగా నిలవాల్సిన ఈ లెజెండరీ క్రికెటర్లు మైదానంలో కొట్లాటకు దిగడం ఏ మాత్రం సరికాదంటూ సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఈక్రమంలో విరాట్ కోహ్లీ, గంభీర్‌ల వాగ్వాదానికి సంబంధించి బలగం సినిమా మీమ్‌ బాగా ట్రెండ్‌ అవుతోంది.

Kohli vs Gambhir: కోహ్లీ, గంభీర్‌లకు బలవంతంగానైనా బలగం సినిమాను చూపెట్టాల్సిందే.. ఫ్యాన్స్‌ డిమాండ్
Kohli Vs Gambhir
Basha Shek
|

Updated on: May 03, 2023 | 8:15 PM

Share

ప్రస్తుతం ఎక్కడ చూసినా విరాట్‌ కోహ్లీ, గంభీర్‌ల కొట్లాటపైనే ఎక్కువగా జరుగుతోంది. ఇక సోషల్‌ మీడియాలో అయితే కోహ్లీ వర్సెస్‌ గంభీర్‌ పేరుతో లెక్కలేనన్నీ పోస్టులు దర్శనమిస్తున్నాయి. రెండ్రోజుల క్రితం లక్నో సూపర్‌ జెయింట్స్‌ వర్సెస్‌ రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరులో జరిగిన ఈ రచ్చ ఇప్పట్లో ఆగేలా లేదు. అయితే తమ ఆటతీరుతో భారత జట్టుకు ఎన్నో గొప్ప విజయాలు అందించిన విరాట్ కోహ్లీ, గంభీర్‌ ఇలా తగవులాడడం చాలామందికి నచ్చడం లేదు. యువ క్రికెటర్లకు స్ఫూర్తిగా నిలవాల్సిన ఈ లెజెండరీ క్రికెటర్లు మైదానంలో కొట్లాటకు దిగడం ఏ మాత్రం సరికాదంటూ సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఈక్రమంలో విరాట్ కోహ్లీ, గంభీర్‌ల వాగ్వాదానికి సంబంధించి బలగం సినిమా మీమ్‌ బాగా ట్రెండ్‌ అవుతోంది. కోహ్లీ – గంభీర్‌లకు అర్జెంట్‌గా బలవంతంగానైనా బలగం సినిమా చూపించాలంటున్నారు ఫ్యాన్స్‌. కుటుంబంలోని ఆప్యాయతలు, అనుబంధాలకు పెద్దపీట వేస్తూ తెరకెక్కిన ఈ సినిమాను చూపించి వారిద్దరినీ కలపాలని కోరుకుంటున్నారు. ఈ మేరకు నెట్టింట మీమ్స్ తెగ నవ్వు తెప్పిస్తున్నాయి.

సుడిగాడు సినిమాలో అల్లరి నరేష్.. 30 ఈయర్స్ ఇండస్ట్రీ పృథ్వీకి తాళ్లు కట్టేసి ఓ సీరియల చూపించినట్టుగా కోహ్లీ – గంభీర్‌లను కూడా కుర్చీలలో కూర్చోబెట్టి బలవంతంగా బలగం మూవీ చూపించాలంటూ ఓ నెటిజన్‌ క్రియేట్ చేసిన మీమ్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో తెగ ట్రెండ్‌ అవుతోంది. బలగం సినిమా చూశాక.. ‘వద్దు బ్రో, మేం కలిసిపోతాం’ అని వారితో చెప్పించిన మీమ్‌ నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది. బలగం సినిమాలోని ‘ఒక్కతల్లి బిడ్డలూ నా కొడుకా.. కలిసిమెలిసుండాలే నా కొడుకా..’ అనే పాటతో ఈ మీమ్స్ తెగ వైరల్ అవుతున్నాయి. కాగా జబర్దస్త్‌ కమెడియన్‌ వేణు తెరకెక్కించిన ఈ సినిమాను చూసి చాలామంది మారిపోయారు. తమ మధ్య ఉన్న గొడవలను చూసి కలిసిపోయారు. అందుకే బలగం సినిమాను చూపిస్తే కోహ్లీ, గంభీర్‌ కూడా మారిపోతారంటూ అభిమానులు నెట్టింట రచ్చ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by CAPDT (@capdt)

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి.