AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Samantha: అందుకే మా ఆయన సమంతకు గుడి కట్టాడు.. సందీప్ భార్య కామెంట్స్ వైరల్

ఇటీవల సామ్‌ పుట్టిన రోజు సందర్భంగా ఆమె విగ్రహాన్ని ఆవిష్కరించి కోవెలను ప్రారంభించాడు. ఈ సందర్భంగా ఊర్లోవారందరికీ భోజనాలు కూడా పెట్టించాడు. ఇక గ్రామస్తులు తెలిపిన సమాచారం ప్రకారం సమంత కోసం గుడి కట్టడానికి సుమారు ఐదు నుంచి ఆరు లక్షల రూపాయల వరకు ఖర్చు చేశాడట సందీప్‌.

Samantha: అందుకే మా ఆయన సమంతకు గుడి కట్టాడు..  సందీప్ భార్య కామెంట్స్ వైరల్
Samantha Temple
Basha Shek
|

Updated on: May 02, 2023 | 11:23 AM

Share

టాలీవుడ్ స్టార్ హీరోయిన్​ సమంతకు ఒక వీరాభిమాని గుడి కట్టిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్​లోని బాపట్ల జిల్లాకు చెందిన సందీప్ సమంత విగ్రహాన్ని తయారుచేయింది ఇంట్లో ప్రతిష్ఠించుకున్నాడు. ఇటీవల సామ్‌ పుట్టిన రోజు సందర్భంగా ఆమె విగ్రహాన్ని ఆవిష్కరించి కోవెలను ప్రారంభించాడు. ఈ సందర్భంగా ఊర్లోవారందరికీ భోజనాలు కూడా పెట్టించాడు. ఇక గ్రామస్తులు తెలిపిన సమాచారం ప్రకారం సమంత కోసం గుడి కట్టడానికి సుమారు ఐదు నుంచి ఆరు లక్షల రూపాయల వరకు ఖర్చు చేశాడట సందీప్‌. సామ్‌ నటనతో పాటు ప్రత్యూష ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆమె చేసే సేవా కార్యక్రమాలకు ఫిదా అయినందుకే గుడి కట్టానని చెప్పుకొచ్చాడు సందీప్‌. తాజాగా సామ్‌కు గుడి కట్టడంపై సందీప్‌ సతీమణి స్పందించారు. తాను ఎంతగానో ఆరాధించే, ఇష్టపడే హీరోయిన్‌కు సందీప్ ఆలయం కట్టడంపై ఆమె హర్షం వ్యక్తం చేశారు. ‘ మా ఆయన లాగే నాకు కూడా సామ్‌ అంటే ఎంతో ఇష్టం. రోజూ ఒక్కసారైనా సమంత టాపిక్ మా ఇంట్లో వస్తుంటుంది. ఇక పెళ్లైన కొత్తలోనే సమంత అభిమానినని మా ఆయన చెప్పారు. ఆమెకు చాన్నాళ్లుగా గుడి కట్టాలని అనుకుంటున్నాం. ఇప్పటికీ కుదిరింది’ అని సందీప్‌ సతీమణి చెప్పుకొచ్చింది.

ఇక సమంత సినిమాల విషయానికొస్తే.. ఆమె నటించిన శాకుంతలం ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గుణశేఖర్‌ దర్శకత్వంలో వచ్చిన ఈసినిమాకు మిశ్రమ స్పందన వచ్చింది. ప్రస్తుతం హిందీలో సిటాడెల్‌ అనే వెబ్‌ సిరీస్‌లో నటిస్తోంది సామ్‌. ఫ్యామిలీ మెన్ సిరీస్‌ ఫేం రాజ్‌ అండ్‌ డీకే నిర్మిస్తోన్న ఈ సిరీస్‌లో వరుణ్‌ధావన్‌ హీరోగా నటిస్తున్నాడు. దీంతో పాటు విజయ్ దేవరకొండతో జంటగా ‘ఖుషి’ సినిమాలోనూ నటిస్తోంది సామ్. మజిలీ, నిన్నుకోరి సినిమాలతో ట్యాలెంటెడ్‌ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న శివ నిర్వాణ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చిన దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్స్..
మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చిన దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్స్..
రాత్రుళ్లు ఈ ప్రదేశాలు మహాద్భుతం.. హాలీవుడ్ భవనాలను తలపిస్తాయి..
రాత్రుళ్లు ఈ ప్రదేశాలు మహాద్భుతం.. హాలీవుడ్ భవనాలను తలపిస్తాయి..
సామ్‌ రూట్లో సంయుక్త... ఫ్యాన్స్.. ఊ అంటారా.. ఊ ఊ అంటారా
సామ్‌ రూట్లో సంయుక్త... ఫ్యాన్స్.. ఊ అంటారా.. ఊ ఊ అంటారా
ఈ రత్నం మీ అదృష్టాన్ని మార్చేస్తుంది.. అప్పుల బాధలు పోయి ఆనందంగా
ఈ రత్నం మీ అదృష్టాన్ని మార్చేస్తుంది.. అప్పుల బాధలు పోయి ఆనందంగా
హైదరాబాద్ నుంచి 300 కిలోమీటర్లలోనే స్విట్జర్‎ల్యాండ్.. ఎక్కడంటే.?
హైదరాబాద్ నుంచి 300 కిలోమీటర్లలోనే స్విట్జర్‎ల్యాండ్.. ఎక్కడంటే.?
సౌత్ పై నార్త్ హీరోయిన్‌ల ఫోకస్..
సౌత్ పై నార్త్ హీరోయిన్‌ల ఫోకస్..
భారతదేశంలో 5-స్టార్‌ సేఫ్టీ రేటింగ్‌ పొందిన ఎలక్ట్రిక్ కార్లు ఇవే
భారతదేశంలో 5-స్టార్‌ సేఫ్టీ రేటింగ్‌ పొందిన ఎలక్ట్రిక్ కార్లు ఇవే