Director Shankar: డైరెక్టర్‌ శంకర్‌ కూతురిని చూశారా? ఎంత అందంగా ఉందో.. త్వరలోనే తెలుగు సినిమాల్లోకి ఎంట్రీ..

శంకర్‌ వారసత్వాన్ని నిలబెడుతూ ఆయన కుమార్తె అదితీ శంకర్‌ కూడా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. కార్తీ హీరోగా నటించిన విరూమాన్‌ మూవీతో వెండితెరకు పరిచయమైంది. తెలుగులో ఈ మూవీ పసలపూడి వీరబాబుగా రిలీజైంది. అయితే సినిమా పెద్దగా ఆకట్టుకోకపోవడంతో అదితి పేరు పెద్దగా ప్రాచుర్యంలోకి రాలేదు.

Director Shankar: డైరెక్టర్‌ శంకర్‌ కూతురిని చూశారా? ఎంత అందంగా ఉందో.. త్వరలోనే తెలుగు సినిమాల్లోకి ఎంట్రీ..
Director Shankar
Follow us
Basha Shek

|

Updated on: May 01, 2023 | 12:47 PM

సెన్సేషనల్‌ డైరెక్టర్‌ శంకర్‌ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. తీసింది కొన్ని సినిమాలైన ఇండియాలోనే ది మోస్ట్‌ క్రేజీ యెస్ట్‌ డైరెక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌తో కలిసి గేమ్ ఛేంజర్‌ మూవీని తెరకెక్కిస్తున్నారాయన. అలాగే కమల్ హాసన్‌తో కలిసి ఇండియన్‌ 2 సినిమాను కూడా డైరెక్ట్‌ చేస్తున్నారు. కాగా శంకర్‌ వారసత్వాన్ని నిలబెడుతూ ఆయన కుమార్తె అదితీ శంకర్‌ కూడా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. కార్తీ హీరోగా నటించిన విరూమాన్‌ మూవీతో వెండితెరకు పరిచయమైంది. తెలుగులో ఈ మూవీ పసలపూడి వీరబాబుగా రిలీజైంది. అయితే సినిమా పెద్దగా ఆకట్టుకోకపోవడంతో అదితి పేరు పెద్దగా ప్రాచుర్యంలోకి రాలేదు. అయితే ఈ మూవీలో పక్కా గ్రామీణ యువతి పాత్రలో నటించి మెప్పించింది. ప్రస్తుతం శివకార్తికేయన్‌కు జంటగా మా వీరన్‌ చిత్రంలో నటిస్తోంది. తెలుగులోనూ మహావీరుడు పేరుతో ఈ మూవీ విడుదల కానుంది. అంటే త్వరలోనే మరోసారి తెలుగు ప్రేక్షకులను పలకరించనుంది అదితి. అన్నట్లు ఈమెకు సంగీతంలోనూ ప్రావీణ్యముంది. పలు మ్యూజిక్‌ వీడియోలు కూడా చేసింది. ఇక తెలుగులో వరుణ్‌ తేజ్ నటించిన ‘గని’ సినిమాలో రోమియో జూలియట్ సాంగ్‌ను ఎంతో చక్కగా ఆలపించి సంగీతాభిమానుల మనసులు గెల్చుకుంది. అలాగే తన విరూమామన్‌లోనూ ఓ పాట పాడింది .

ఇక సోషల్‌ మీడియాలోనూ ఎంతో యాక్టివ్‌ గా ఉంటుంది అదితి. తన ప్రొఫెషనల్‌ అండ్‌ పర్సనల్‌ విషయాలతో పాటు తన లేటెస్ట్‌ ఫొటోలు, వీడియోలను అందులో షేర్‌ చేస్తుంటుంది. తాజాగా ఆమె తన తండ్రి దర్శకత్వం వహించిన నన్బన్‌ (తెలుగులో స్నేహితుడు) చిత్రంలోని ఓ పాటకు డాన్స్‌ చేసి ఆకట్టుకుంది. అందులో హీరో, హీరోయిన్లు విజయ్‌, ఇలియానాలపై షూట్‌ చేసిన ‘ఓలి బెల్లి’ అనే పాటకు కాలు కదిపింది. అచ్చం ఇలియానా లాగే నడుమును తిప్పుతూ అదితీ చేసిన డ్యాన్స్‌ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
అత్యున్నత ప్రమాణాలతో అమరావతి.. మరిన్ని పనులకు గ్రీన్ సిగ్నల్
అత్యున్నత ప్రమాణాలతో అమరావతి.. మరిన్ని పనులకు గ్రీన్ సిగ్నల్