- Telugu News Photo Gallery Cinema photos Rashmika Mandanna Younger Sister Shiman Mandanna Mother Suman Visits Rainbow Movie Sets
Rashmika Mandanna: ‘రెయిన్ బో’ మూవీ సెట్స్‌లో రష్మిక చిట్టి చెల్లెలు.. ఎంత క్యూట్‌గా ఉందో చూశారా?
పాన్ ఇండియా హీరోయిన్ రష్మిక మందన్నా ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. కాగా ఆమె నటిస్తోన్న లేడీ ఓరియంటెడ్ మూవీ 'రెయిన్‌బో. తాజాగా ఈ సినిమా తొలి దశ షూటింగ్ కూడా పూర్తయినట్లు తెలిపింది రష్మిక.
Updated on: Apr 30, 2023 | 9:09 PM

పాన్ ఇండియా హీరోయిన్ రష్మిక మందన్నా ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. కాగా ఆమె నటిస్తోన్న లేడీ ఓరియంటెడ్ మూవీ 'రెయిన్‌బో. తాజాగా ఈ సినిమా తొలి దశ షూటింగ్ కూడా పూర్తయినట్లు తెలిపింది రష్మిక.

ఓ వైపు ‘పుష్ప 2’ సినిమా షూటింగ్ లో పాల్గొంటూనే మరోవైపు ‘రెయిన్ బో’ సినిమా షూటింగ్ కు హాజరవుతోంది రష్మి. ఇందులో శాకుంతలం ఫేమ్ దేవ్ మోహన్ కీలక పాత్రలో కనిపించనున్నాడు.

డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ఎస్.ఆర్. ప్రకాష్ బాబు, ఎస్.ఆర్. ప్రభు రెయిన్ బో మూవీని నిర్మిస్తున్నారు. చెన్నై, మున్నార్ ప్రాంతాల్లో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది.

తాజాగా ఈ సినిమా షూటింగ్‌లో రష్మిక తల్లి, చెల్లెలు కూడా సందడి చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది నేషనల్ క్రష్. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరలవుతున్నాయి.

అలాగే హీరో దేవ్ మోహన్‌తో కలిసి దిగిన సెల్ఫీని కూడా ఫ్యాన్స్‌తో పంచుకుంది రష్మిక. ప్రస్తుతం ఈ సినిమాతో పాటు అల్లు అర్జున్ 'పుష్ప 2', రణబీర్ కపూర్ 'యానిమల్', నితిన్ - వెంకీ కుడుముల సినిమాల్లో నటిస్తోందీ పాన్ ఇండియా హీరోయిన్.





























