Actress: ఈ ఫొటోలోని అమ్మాయి ఇప్పుడు ఓ స్టార్ హీరోయిన్.. క్రేజ్ చూస్తే మతి పోవాల్సిందే.. ఎవరో గుర్తుపట్టారా?
బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్ స్టేటస్. అలాగే దేశం గర్వించదగ్గ స్టార్ క్రికెటర్‌కి సతీమణి అనుష్క శర్మ పుట్టిన రోజు నేడు (మే 1). ఈ సందర్భంగా ఆమె అరుదైన, చిన్ననాటి ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి.
Updated on: May 01, 2023 | 1:33 PM

బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్ స్టేటస్. అలాగే దేశం గర్వించదగ్గ స్టార్ క్రికెటర్‌కి సతీమణి అనుష్క శర్మ పుట్టిన రోజు నేడు (మే 1). ఈ సందర్భంగా ఆమె అరుదైన, చిన్ననాటి ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి.

కాగా ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమా పరిశ్రమలో అడుగుపెట్టింది అనుష్కా శర్మ. షారుఖ్ ఖాన్ ‘రబ్ నే బనాది జోడీ’ సినిమాతో వెండితెరకు పరిచయమైందీ ముద్దుగుమ్మ.

మొదటి సినిమాలోనే షారుఖ్‌తో నటించడం, సినిమా కూడా సూపర్ హిట్ కావడంతో అనుష్క క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. అనతికాలంలోనే స్టార్ హీరోయిన్ స్టేటస్‌ను సొంతం చేసుకుంది.

ఇక విరాట్ కోహ్లీని ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆమె వామిక అనే పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. గత కొన్నేళ్లుగా కూతురి ఆలనాపాలనాలోనే బిజీగా ఉంటోన్న ఆమె త్వరలోనే మళ్లీ సిల్వర్ స్ర్కీన్ పై కనిపించనుంది.

టీమిండియా స్టార్ పేసర్ ఝులన్ గోస్వామి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతోన్న చక్డా ఎక్స్ ప్రెస్ సినిమాలో నటిస్తోంది అనుష్క. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.