Ugram: 20 ఏళ్ల కెరీర్‌లో అల్లరోడికి ఫస్ట్ మాస్ హిట్.. ఉగ్రంకు ప్రివ్యూల నుంచి పాజిటివ్ రిపోర్ట్

ఇకపై అల్లరోడు కాదు. అవును అల్లరి నరేశ్ జోనర్ మార్చేశాడు. కామెడీని కాస్త పక్కనపెట్టారు. ఉగ్రం అంటూ కొత్త సిరియస్‌ సబ్జెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా ప్రివ్యూ చూసిన సినీ జనాలు సినిమా హిట్ బరాబర్ చెప్పేస్తున్నారు.

Ugram: 20 ఏళ్ల కెరీర్‌లో అల్లరోడికి ఫస్ట్ మాస్ హిట్.. ఉగ్రంకు ప్రివ్యూల నుంచి పాజిటివ్ రిపోర్ట్
Allari Naresh's Ugram
Follow us
Ram Naramaneni

|

Updated on: May 03, 2023 | 8:30 PM

నిన్న మొన్నటి వరకు నవ్వుతూ.. నవ్విస్తూ ఉన్న అల్లరి నరేష్ .. ఉన్నట్టుండి తన పంథా మార్చుకున్నారు. సీరియస్‌ రోల్స్‌ చేస్తూ… స్ట్రెయిట్ అవే హిట్లు కొడుతూ వస్తున్నారు. అందరి చేత చప్పట్లు కొట్టించుకుంటున్నారు. ఇక ఈ క్రమంలోనే తాజాగా తన ఉగ్ర రూపాన్ని చిన్న ట్రైలర్‌లో చూపించేశారు అల్లరి నరేష్. చూపించడమే కాదు.. సినిమా రిలీజ్ కాకముందే హిట్ టాక్‌ తెచ్చుకున్నారు కూడా..!. విజయ్ కనకమేడల డైరెక్షన్లో.. అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కిన ఫిల్మ్‌ ఉగ్రం. మనుషుల మిస్సింగ్ నేపథ్యంలో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో.. నరేష్ ఉగ్ర యాక్టింగ్‌తో.. మే5న వస్తున్న ఈ సినిమా… రిలీజ్కు ముందే సూపర్ డూపర్ హిట్ టాక్‌ వచ్చేలా చేసుకుంది.

అకార్డింగ్ టూ ఫిల్మ్ నగర్ బజ్ ఈ సినిమా చాలా బాగుందట. ప్రివ్యూ చూసిన జనాలు సినిమాను తెగ పొగుడుతున్నారు. యాజ్‌ ఏ యాక్టర్‌ అండ్ పర్ఫార్మర్‌గా నరేష్‌ను మరో మెట్టు ఎక్కించేదిలా ఉందట. నరేష్‌ను మరో రకంగా ఎక్స్‌ప్లోర్ చేసిందట. అతడిలోని మాస్ యాంగిల్ బయటకు వచ్చిందట. ఇక ఇదే టాక్ త్రూ ఫిల్మ్ నగర్ బయటికి వచ్చి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. అందర్నీ ఈ సినిమా వైపే చేసేలా చేస్తోంది. దాంతో పాటే.. ఈ సినిమాపై విపరీతంగా అంచనాలను పెంచేస్తోంది. నెట్టింట తెగ వైరల్అ తొందర్లో మన ముందుకు వస్తున్న ఈ సినిమా నుంచి తాజాగా ట్రైలర్ రిలీజ్ అయింది. రిలీజ్ అవ్వడమే కాదు.. అందర్నీ తెగ ఆకట్టుకుంటోంది. అందరి చేత చప్పట్లు కొట్టించుకుంటోంది.

అంతేకాదు.. ! ఇప్పటికే నాంది హిట్‌తో .. హిట్ పెయిర్‌గా నామ్ కమాయించిన హీరో నరేష్‌, డైరెక్టర్‌ విజయ్‌ … మళ్లీ ఈ సినిమాతో పెయిరప్‌ అవడం కూడా ఈ సినిమాపై హై ఎక్స్‌పెక్టేషన్స్ పెరగడానికి కారణం అవుతోంది. దానికితోడు.. తాజాగా రిలీజ్‌ అయిన ఉగ్రం ట్రైరల్.. అందులో టూ షేడ్స్‌లో కట్టిపడేసే రేంజ్‌లో అల్లరోడు చేసిన యాక్టింగ్ ఇప్పుడు ఈ సినిమాను నెక్ట్స్‌ లెవల్‌కు తీసుకెళ్లేలా చేస్తోంది. ఎక్స్‌పెక్టేషన్స్ స్కై హై చేరుకుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి.