Prabhas: ఆ విషయంలో ప్రభాస్‌ నిజంగానే రాజులాంటి వారు.. పాన్‌ ఇండియా హీరోపై రంగస్థలం మహేశ్‌ ప్రశంసలు

ప్రభాస్ ఆతిథ్యం గొప్పతనం గురించి కృతి సనన్, దీపిక పదుకొణె, అమితాబ్, శ్రుతి హాసన్.. ఇలా ఎంతో మంది చెప్పుకొచ్చారు. దిషా పటానీ అయితే ప్రభాస్‌ ఆతిథ్యం చూసి ఆశ్చర్యపోయినట్లు చెప్పుకొచ్చింది. తాజాగా రంగస్థలం మహేశ్‌ ప్రభాస్‌ గొప్పతనం గురించి ఆసక్తికర కామెంట్లు చేశాడు.

Prabhas: ఆ విషయంలో ప్రభాస్‌ నిజంగానే రాజులాంటి వారు.. పాన్‌ ఇండియా హీరోపై రంగస్థలం మహేశ్‌ ప్రశంసలు
Mahesh, Prabhas
Follow us
Basha Shek

|

Updated on: May 06, 2023 | 8:48 PM

పాన్‌ ఇండియా హీరో ప్రభాస్‌ మంచి తనం గురించి అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఆయనతో పాటు సెట్లో ఉండే నటీనటులకు భోజనానికి ఏ మాత్రం ఢోకా ఉండదు. సెట్‌లో ఎంతమంది ఉన్నా అందరికీ తన ఇంటి నుంచే భోజనం తెప్పిస్తుంటాడు ప్రభాస్‌. ప్రభాస్ ఆతిథ్యం గొప్పతనం గురించి కృతి సనన్, దీపిక పదుకొణె, అమితాబ్, శ్రుతి హాసన్.. ఇలా ఎంతో మంది చెప్పుకొచ్చారు. దిషా పటానీ అయితే ప్రభాస్‌ ఆతిథ్యం చూసి ఆశ్చర్యపోయినట్లు చెప్పుకొచ్చింది. తాజాగా రంగస్థలం మహేశ్‌ ప్రభాస్‌ గొప్పతనం గురించి ఆసక్తికర కామెంట్లు చేశాడు. రెబల్‌ స్టార్‌, మారుతీ కాంబినేషన్లో వస్తోన్న ఓ మూవీలో ఫుల్‌ లెంగ్త్‌ కామెడీ రోల్‌లో నటిస్తున్నాడు మహేశ్‌. ఇటీవల ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆయన తన పర్సనల్‌, ప్రొఫెషనల్‌ లైఫ్‌ గురించి పలు ఇంట్రెస్టింగ్‌ విషయాలు చెప్పుకొచ్చాడు. ముఖ్యంగా సినిమా సెట్‌లో ప్రభాస్‌ ఆతిథ్యం ఎలా ఉంటుందో అందరితో పంచుకున్నాడు.

‘ కేవలం సినిమాలోని మెయిన్ టీంకు మాత్రమే కాకుండా సెట్‌లో ఎంత మంది ఉంటే అంత మందికి స్పెషల్ ఫుడ్‌ను తీసుకొస్తారు ప్రభాస్‌. షూటింగ్‌లో 200 మంది ఉంటే 200… 300 ఉంటే 300 మందికి ప్రభాస్ తరపున నుంచి ఫుడ్ వస్తుంది. నాకు ఏ ఫుడ్‌ నచ్చిందో అని అడిగారు ఒకరోజు. మటన్ అని చెప్తే.. నెక్ట్స్ డే నాకు మళ్లీ మటన్ తెచ్చాడు’ అంటూ ప్రభాస్‌ మంచి మనసు గురించి చెప్పుకొచ్చాడు మహేశ్‌. ఇక సినిమాలో ప్రభాస్ క్యారెక్టర్‌ గురించి మాట్లాడుతూ.. చాలా రోజుల తర్వాత చెక్‌ షర్ట్స్‌ వేస్కోని మంచి కామెడీ పాత్ర చేస్తున్నారు ప్రభాస్‌ అని తెలిపాడు. కాగా ఈ సినిమా 40 శాతానికి పైగా షూటింగ్ కంప్లీట్ అయినట్లు తెలుస్తోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభట్ల ఈ మూవీని నిర్మిస్తున్నారు. హీరోయిన్‌, ఇతర క్యాస్టింగ్‌ గురించి వివరాలపై త్వరలో క్లారిటీ రానుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..