Tollywood: చురకత్తుల్లాంటి చూపులతో కవ్విస్తోన్న ఈ బ్యూటీని గుర్తుపట్టారా? మస్త్ క్రేజ్ ఉందండోయ్..
పైన పేర్కొన్న ఫోటోలోని బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా.? మన తెలుగు అమ్మాయే.. టాలీవుడ్‌లో మస్త్ క్రేజ్ ఉందండోయ్. చేసినవి 8 సినిమాలే.. అందం, అభినయంతో..
పైన పేర్కొన్న ఫోటోలోని బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా.? మన తెలుగు అమ్మాయే.. టాలీవుడ్‌లో మస్త్ క్రేజ్ ఉందండోయ్. చేసినవి 8 సినిమాలే.. అందం, అభినయంతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించింది. ప్రతీ మూవీలోనూ క్యారెక్టర్ ఓరియంటెడ్ రోల్స్ చేస్తూ తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గర అవుతోంది ఈ బ్యూటీ. అటు సోషల్ మీడియాలో కూడా ఎలప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ.. విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించింది. ఇంతకీ ఆమె ఎవరో కనిపెట్టారా.? మీకో చిన్న క్లూ.. ఇటీవలే ఓ పాన్ ఇండియా మూవీతో థియేటర్లలో సందడి చేసింది. మీకు గుర్తొచ్చిందా.. మేమే చెప్పేయమా..!
ఆమె మరెవరో కాదు అనన్య నాగళ్ల. ‘మల్లేశం’ మూవీతో తెలుగు తెరకు హీరోయిన్‌గా అరంగేట్రం చేసింది ఈ అందాల భామ. ‘ప్లేబ్యాక్’ సినిమాతో మంచి గుర్తింపు సంపాదించింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన ‘వకీల్ సాబ్’ చిత్రంలో కీలక పాత్ర పోషించింది. ఇక ఇటీవల సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘శాకుంతలం’లో నటించి మెప్పించింది. త్వరలోనే ‘అన్వేషి’, ‘బూట్‌కట్ బాలరాజు’ చిత్రాలతో ప్రేక్షకులను పలకరించనుంది. కాగా, అనన్య నాగళ్ల సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన సినిమా అప్డేట్స్, లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ ఫ్యాన్స్‌తో ఇంటరాక్ట్ అవుతోంది.
View this post on Instagram