Actress: అద్దంలో అందాల తార.. పవన్‌ కల్యాణ్‌తో స్క్రీన్‌ షేర్‌ చేసుకోనున్న ఈ సుందరాంగిని గుర్తించారా?

పై ఫొటోలో అద్దంలో తన అందాన్ని చూసుకుంటూ మురిసిపోతున్న ముద్దుగుమ్మను గుర్తుపట్టారా? కర్ణాటకకు చెందిన ఈ బ్యూటీ తెలుగుతో పాటు తమిళ్‌లో సినిమాలు చేసింది. చేసింది కొన్ని చిత్రాలే అయినా తన అందంతో కుర్రాళ్ల మనసును కొల్లగొట్టింది.  తన క్యూట్‌ ఎక్స్‌ప్రెషన్స్‌ కు చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు.

Actress: అద్దంలో అందాల తార.. పవన్‌ కల్యాణ్‌తో స్క్రీన్‌ షేర్‌ చేసుకోనున్న ఈ సుందరాంగిని గుర్తించారా?
Actress
Follow us
Basha Shek

|

Updated on: May 09, 2023 | 6:18 AM

పై ఫొటోలో అద్దంలో తన అందాన్ని చూసుకుంటూ మురిసిపోతున్న ముద్దుగుమ్మను గుర్తుపట్టారా? కర్ణాటకకు చెందిన ఈ బ్యూటీ తెలుగుతో పాటు తమిళ్‌లో సినిమాలు చేసింది. చేసింది కొన్ని చిత్రాలే అయినా తన అందంతో కుర్రాళ్ల మనసును కొల్లగొట్టింది.  తన క్యూట్‌ ఎక్స్‌ప్రెషన్స్‌ కు చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. టాలీవుడ్‌తో పాటు కోలీవుడ్‌లోనూ యంగ్‌ హీరోలతో విజయాలు అందుకుందీ ముద్దుగుమ్మ. అయితే ఎందుకో కానీ ఆఫర్లు దక్కించుకోలేకపోతోంది. తెలుగులో నటించి సుమారు మూడేళ్లవుతోంది. ఇక మళ్లీ టాలీవుడ్‌కు రాదేమో అనుకున్న తరుణంలో ఓ బంపరాఫర్‌ ఆమె తలుపు తట్టింది. పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ తో స్క్రీన్‌ షేర్‌ చేసుకునే ఛాన్స్‌ వచ్చింది. ఈ పాటికే ఈ ముద్దుగుమ్మ ఎవరో మీకు అర్థమై ఉంటుంది. ఆమె మరెవరో కాదు గ్యాంగ్‌ లీడర్‌ సినిమాలో నానితో కలిసి సందడి చేసిన ప్రియాంక అరుల్‌ మోహన్‌. అందులో తన అమాయకపు నటన, ఎక్స్‌ ప్రెషన్స్‌ తో అందరినీ ఆకట్టుకుందీ అందాల తార. ఆతర్వాత శర్వానంద్‌తో శ్రీకారం సినిమాలో నటించింది. అయితే ఈ సినిమా పెద్దగా ఆడకపోవడంతో కోలీవుడ్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది.

శివకార్తికేయన్‌తో కలిసి డాక్టర్‌, డాన్‌ వంటి సినిమాల్లో నటించిన ప్రియాంక సూర్యతో కలిసి ఈటీ మూవీలో సందడి చేసింది. ప్రస్తుత అక్కడ వరుసగా సినిమాలు చేస్తోందీ సొగసరి. అయితే మూడేళ్ల తర్వాత మళ్లీ ఓ తెలుగు సినిమాలో నటించే అవకాశం దక్కింది. సుజిత్‌ దర్శకత్వంలో పవన్‌ కల్యాణ్‌ చేస్తోన్న ఓజీ సినిమాలో హీరోయిన్‌గా ప్రియాంక ఎంపికైంది. త్వరలోనే ఆమె షూటింగ్‌లో జాయిన్‌ కానుంది. సినిమాలతో పాటు సోషల్‌ మీడియాలో బిజీగా ఉండే ప్రియాంక తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని ఫొటోలను షేర్‌ చేసింది. ఇందులో వైట్‌ డ్రెస్‌లో పాలరాతి శిల్పంలా కనిపిస్తూ కనువిందు చేసింది ప్రియాంక. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?
పెరుగులో ఈ పొడి మిక్స్ చేసి రాస్తే..10నిమిషాల్లో తెల్లజుట్టు నల్ల
పెరుగులో ఈ పొడి మిక్స్ చేసి రాస్తే..10నిమిషాల్లో తెల్లజుట్టు నల్ల
విమానంలో ప్రయాణించే వారికి అలర్ట్‌.. మారిన లగేజీ నిబంధనలు
విమానంలో ప్రయాణించే వారికి అలర్ట్‌.. మారిన లగేజీ నిబంధనలు
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణకు వర్షాలే వర్షాలు..
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణకు వర్షాలే వర్షాలు..