Vasuki: 23 ఏళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇస్తోన్న పవన్ కల్యాణ్‌ ‘తొలిప్రేమ’ సిస్టర్‌.. ఇక ‘అన్నీ మంచి శకునములే’ అంటూ..

పవర్‌ స్టార్‌ పవన్ కల్యాణ్, కరుణాకరణ్ కాంబినేషన్‌లో వచ్చిన తొలిప్రేమ ఎవర్‌ గ్రీన్‌ లవ్‌ స్టోరీల్లో ఒకటిగా ఎప్పటికీ గుర్తుండిపోతోందుంది. ఇందులో కీర్తి రెడ్డి హీరోయిన్‌గా నటించగా, పవన్‌ చెల్లెలు బుజ్జి పాత్రలో వాసుకి అద్భుతంగా నటించింది.

Vasuki: 23 ఏళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇస్తోన్న పవన్ కల్యాణ్‌ 'తొలిప్రేమ' సిస్టర్‌.. ఇక 'అన్నీ మంచి శకునములే' అంటూ..
Actress Vasuki
Follow us
Basha Shek

|

Updated on: May 10, 2023 | 8:45 AM

పవర్‌ స్టార్‌ పవన్ కల్యాణ్, కరుణాకరణ్ కాంబినేషన్‌లో వచ్చిన తొలిప్రేమ ఎవర్‌ గ్రీన్‌ లవ్‌ స్టోరీల్లో ఒకటిగా ఎప్పటికీ గుర్తుండిపోతోందుంది. ఇందులో కీర్తి రెడ్డి హీరోయిన్‌గా నటించగా, పవన్‌ చెల్లెలు బుజ్జి పాత్రలో వాసుకి అద్భుతంగా నటించింది. ముఖ్యంగా పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్లేటప్పుడు ‘ఏరా బుజ్జి ఆఖరికి నువ్వు కూడా నన్ను వదిలి వెళ్లిపోతున్నావా?’ అని పవన్ అడిగిప్పుడు ఇద్దరి మధ్య వచ్చే ఎమోషనల్‌ సీన్స్‌ అందరినీ కంటతడి పెట్టిస్తాయి. సినిమా సూపర్‌హిట్ కావడం, వాసుకీ పాత్రకు మంచి పేరు రావడంతో ఆమె మరికొన్ని సినిమాల్లో నటిస్తుందని భావించారు. అయితే ఆమె నటనకు గుడ్‌బై చెప్పేసి అదే సినిమాకు ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేసిన పవన్ స్నేహితుడు ఆనంద్ సాయి‌తో కలిసి పెళ్లిపీటలెక్కింది. ఆతర్వాత పిల్లలు, వారి ఆలనాపాలనాలోనే బిజీ అయిపోయింది. అయితే సుమారు 23 ఏళ్ల తర్వాత మళ్లీ సినిమాల్లో నటిస్తోంది వాసుకీ. యంగ్ హీరో సంతోష్ శోభన్, మాళవిక నాయర్ జంటగా నటిస్తోన్న అన్నీ మంచి శకునములే మూవీలో హీరో సోదరి పాత్రలో కనిపించనుంది వాసుకీ. నందని రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను స్వప్న సినిమా, విందా మూవీస్ సంస్థల పై స్వప్న దత్, ప్రియాంక దత్ సంయుక్తంగా నిర్మించారు.

ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న అన్నీ మంచి శకునములే సినిమా మే 18న గ్రాండ్‌గా రిలీజ్‌ కానుంది. కాగా ఈ మూవీ ప్రమోషన్లలో పాల్గొన్న వాసుకీ తన రీఎంట్రీ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ‘ పవన్‌ కల్యాణ్‌ ‘తొలిప్రేమ’ సినిమాలో నటించేప్పుడు నా వయసు 18 ఏళ్లు. దీని తర్వాత మరే సినిమాల్లోనూ నటించలేదు. పెళ్లి, పిల్లలు, వారి చదువులతోనే సరిపోయింది. ఇప్పుడు ఇద్దరు పిల్లలు ఉన్నత విద్య కోసం విదేశాల్లో ఉన్నారు. నేను కావాలనుకున్నది చేయవచ్చు అనిపించింది. పైగా అశ్వనీదత్‌ కుటుంబంతో మాకు మంచి సాన్నిహిత్యం ఉంది. స్వప్న, ప్రియాంక స్నేహితులు. ఈ సినిమాలో నా పాత్రకు మంచి పేరొస్తుందని అనుకుంటున్నా. మనసుకు నచ్చిన పాత్రలు దొరికితే తప్పకుండా సినిమాలు చేస్తా’ అని చెప్పుకొచ్చింది వాసుకీ.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by Vasuki Anand (@vasukianand)

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?
అరెరే ఎంతపనైపాయే.. గూగుల్ తల్లి కొంప కొల్లేరు చేసిందిగా.. పాపం.!
అరెరే ఎంతపనైపాయే.. గూగుల్ తల్లి కొంప కొల్లేరు చేసిందిగా.. పాపం.!
ఒకే ఓవర్‌లో 4,4,4,4,4,4.. వామ్మో ఇలా ఉన్నావ్ ఏంది సామీ..!
ఒకే ఓవర్‌లో 4,4,4,4,4,4.. వామ్మో ఇలా ఉన్నావ్ ఏంది సామీ..!
రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. ఆమె పేరు చెబితే పూనకాలే..
రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. ఆమె పేరు చెబితే పూనకాలే..
హిట్‌మ్యాన్, ట్రావిస్ హెడ్ కాదు.. 23 సిక్సర్లతో ఆ క్రికెటర్ తోపు
హిట్‌మ్యాన్, ట్రావిస్ హెడ్ కాదు.. 23 సిక్సర్లతో ఆ క్రికెటర్ తోపు
ఫాదర్ అఫ్ ట్రావిస్ హెడ్ అంటూ ఫుల్లు ట్రోలింగ్..
ఫాదర్ అఫ్ ట్రావిస్ హెడ్ అంటూ ఫుల్లు ట్రోలింగ్..
135 ఏళ్ల తర్వాత సరికొత్త రికార్డు.. డెబ్యూ మ్యాచ్​లోనే..
135 ఏళ్ల తర్వాత సరికొత్త రికార్డు.. డెబ్యూ మ్యాచ్​లోనే..
మీరూ ఈ తప్పు చేస్తున్నారా.? జిరాక్స్ షాపుకెళ్లి ఆ పని మాత్రం..
మీరూ ఈ తప్పు చేస్తున్నారా.? జిరాక్స్ షాపుకెళ్లి ఆ పని మాత్రం..
ఇక 10 నిమిషాల డెలివరీ రంగంలో ఓలా..ఎంత డిస్కౌంట్‌ ఇస్తుందో తెలుసా?
ఇక 10 నిమిషాల డెలివరీ రంగంలో ఓలా..ఎంత డిస్కౌంట్‌ ఇస్తుందో తెలుసా?