Actress: ఈ ఫొటోలోని అమ్మాయిని గుర్తుపట్టారా? ప్రస్తుతం ఈ హీరోయినే ట్రెండింగ్‌.. కుర్రాళ్ల హార్ట్‌ త్రోబ్‌

సినిమా తారలకు సంబంధించి పుట్టిన రోజు లేదా స్పెషల్ అకేషన్‌ ఏదైనా ఉంటే చాలు.. వారి ఫొటోస్‌, వీడియోలు ఇట్టే వైరలైపోతుంటాయి. ఆరోజున వారి పేరు ట్రెండింగ్‌లో ఉండాల్సిందే. అందులో చైల్డ్‌హుడ్ ఫొటోస్‌ ముందు వరసలో ఉంటాయి. నెటిజన్లు కూడా తమ అభిమాన తారల చిన్నప్పటి ఫోటోస్‌..

Actress: ఈ ఫొటోలోని అమ్మాయిని గుర్తుపట్టారా? ప్రస్తుతం  ఈ హీరోయినే ట్రెండింగ్‌.. కుర్రాళ్ల హార్ట్‌ త్రోబ్‌
Actress
Follow us
Basha Shek

|

Updated on: May 11, 2023 | 6:05 AM

సెలబ్రిటీలు, సోషల్‌ మీడియాకు చాలా అవినాభావ సంబంధం ఉంది. ముఖ్యంగా సినిమా తారలు వారి అభిమానుకు దగ్గరగా ఉండేందుకు సామాజిక మాధ్యమాలే వారధిగా నిలుస్తాయి. ఇక సినిమా తారలకు సంబంధించి పుట్టిన రోజు లేదా స్పెషల్ అకేషన్‌ ఏదైనా ఉంటే చాలు.. వారి ఫొటోస్‌, వీడియోలు ఇట్టే వైరలైపోతుంటాయి. ఆరోజున వారి పేరు ట్రెండింగ్‌లో ఉండాల్సిందే. అందులో చైల్డ్‌హుడ్ ఫొటోస్‌ ముందు వరసలో ఉంటాయి. నెటిజన్లు కూడా తమ అభిమాన తారల చిన్నప్పటి ఫోటోస్‌, అరుదైన పిక్స్‌ చూసేందుకు తెగ ఆసక్తి చూపిస్తుంటారు. అందుకు తగ్గట్లే సినిమా తారలు కూడా తరచూ తమ త్రో బ్యాక్‌ ఫొటోస్‌ను షేర్ చేస్తుంటారు. పై ఫొటో కూడా ఈ కోవకు చెందినదే. ఇందులో ఎంతో క్యూట్‌గా కనిపిస్తున్న అమ్మాయి ఇప్పుడు ఓ స్టార్‌ హీరోయిన్‌. ప్రస్తుతం ఆమె పేరు ట్రెండింగ్‌లో ఉంది. తను హీరోయిన్‌గా నటించిన ఓ సినిమా దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. వివాదాలకు కేంద్రబిందువుగా నిలుస్తోంది. మేము చెప్తున్నది ఎవరో అని ఈ పాటికే చాలామందికే అర్థమై ఉంటుంది. యస్‌.. పై ఫొటోలో ఉన్నది మరెవరో కాదు ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కాక రేపుతోన్న ది కేరళ స్టోరీ మూవీ హీరోయిన్‌ అదాశర్మ. ఈరోజు (మే 11) అదా పుట్టిన రోజు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు ఆమెకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

నితిన్‌, పూరి జగన్నాథ్‌ కాంబినేషన్‌లో వచ్చిన హార్ట్‌ ఎటాక్‌ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది అదాశర్మ. పేరుకు తగ్గట్టుగానే ఈ మూవీలో తన అందంతో కుర్రాళ్లకు నిజంగానే హార్ట్‌ ఎటాక్‌ తెప్పించిందీ బ్యూటీ. అంతకు ముందే కొన్ని బాలీవుడ్ సినిమాల్లో నటించి మెప్పించిందీ ముద్దుగుమ్మ. అల్లు అర్జున్‌ సన్‌ ఆఫ్‌ సత్యమూర్తి, సాయి ధరమ్‌ తేజ్‌ సుబ్రహ్మణ్యం ఫర్‌ సేల్‌ సినిమాల్లో సెకెండ్‌ హీరోయిన్‌గా నటించిన అదా శర్మ.. రాజశేఖర్‌ కల్కి సినిమాలో మెయిన్‌ హీరోయిన్‌గా నటించింది. అయితే ఎందుకో కానీ స్టార్‌ డమ్ తెచ్చుకోలేకపోయింది. అయితే తాజాగా విడుదలైన ది కేరళ స్టోరీ సినిమాతో అదా పేరు దేశ వ్యాప్తంగా మార్మోగిపోతోంది. ఇప్పటివరకు ఎక్కువగా గ్లామర్‌ పాత్రలనే పోషిస్తూ వచ్చిన అదా, ది కేరళ స్టోరీ సినిమాతో తన అభినయంతో అందరి ప్రశంసలు అందుకుంటోంది. వివాదాలు ఎలా ఉన్నా ఈ మూవీ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. మొత్తానికి ఈ పుట్టిన రోజు అదా శర్మ ఎప్పటికీ గుర్తుండిపోతుంది.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by Adah Sharma (@adah_ki_adah)

View this post on Instagram

A post shared by Adah Sharma (@adah_ki_adah)

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..