MS Dhoni: ఆస్కార్‌ విజేతలను ఘనంగా సత్కరించిన ధోని.. ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ యూనిట్‌కు సర్‌ప్రైజ్‌ గిఫ్ట్స్‌

కొన్ని రోజుల క్రితం జరిగిన అస్కార్‌ అవార్డుల ప్రదానోత్సవంలో ఇండియా నుంచి ఆర్‌ఆర్‌ఆర్‌తో పాటు ది ఎలిఫెంట్ విస్పరర్స్ సినిమా పురస్కారం గెల్చుకున్న సంగతి తెలిసిందే. కార్తికి గోన్సాల్వేస్ దర్శకత్వం వహించిన ఈ మూవీ బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ కేటగిరీలో అత్యున్నత పురస్కారం అందుకుంది.

MS Dhoni: ఆస్కార్‌ విజేతలను ఘనంగా సత్కరించిన ధోని.. 'ది ఎలిఫెంట్ విస్పరర్స్' యూనిట్‌కు సర్‌ప్రైజ్‌ గిఫ్ట్స్‌
Ms Dhoni
Follow us
Basha Shek

|

Updated on: May 11, 2023 | 5:55 AM

కొన్ని రోజుల క్రితం జరిగిన అస్కార్‌ అవార్డుల ప్రదానోత్సవంలో ఇండియా నుంచి ఆర్‌ఆర్‌ఆర్‌తో పాటు ది ఎలిఫెంట్ విస్పరర్స్ సినిమా పురస్కారం గెల్చుకున్న సంగతి తెలిసిందే. కార్తికి గోన్సాల్వేస్ దర్శకత్వం వహించిన ఈ మూవీ బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ కేటగిరీలో అత్యున్నత పురస్కారం అందుకుంది. భారత్ తరఫున ఆస్కార్ గెలుచుకున్న మొదటి డాక్యుమెంటరీ కూడా ఇదే. ఈ క్రమంలో చెన్నైలోని చెపాక్ స్టేడియంలో ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ యూనిట్‌కు సత్కరించేందుకు చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం ఒక స్పెషల్ ఈవెంట్‌ను నిర్వహించింది. ఈ సందర్భంగా మూవీ యూనిట్‌ను చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని ఘనంగా సత్కరించాడు. సభ్యులందరికీ అభినందనలు తెలిపాడు. అనంతరం వారికి స్పెషల్ గిఫ్ట్స్‌ను అందజేశాడు. ఆస్కార్ విజేతలతో ఆప్యాయంగా మాట్లాడిన ధోని తన నెం.7 జెర్సీలను బొమ్మన్, బెల్లీ, గొన్సాల్వేజ్ లకు అందజేశాడు.

ఈ సందర్భంగా ధోనీ తన కుమార్తె జివాను సైతం ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్ యూనిట్‌కు పరిచయం చేశారు. వారితో కరచాలనం చేయించారు. అనంతరం ఈ ఈవెంట్‌కు సంబంధించిన ఫొటోలను చెన్నై సూపర్ కింగ్స్ ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకుంది. ప్రస్తుతం ఈ ఫొటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో వైరలవుతున్నాయి. సీఎస్కే, ధోని మంచి పనిచేశారంటూ అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా ఇటీవల  తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ తో పాటు సూపర్  స్టార్ రజినీకాంత్ వంటి ప్రముఖులు కూడా ఎలిఫెంట్ విస్పరర్స్  యూనిట్  ను సత్కరించి అభినందనలు తెలిపారు.  ఇక ఐపీఎల్‌ తాజా సీజన్‌లో దూసుకుపోతోంది సీఎస్కే. ప్రస్తుతం ఆ జట్టు పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..