AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Savitri: సెట్లో అవమానం, అన్నం కూడా పెట్టకుండా.. సావిత్రి చివరి రోజుల్లో వింటే కన్నీళ్లు ఆగవు.!

దివంగత మహానటి సావిత్రి జీవిత చివరి దశలో ఒక సినిమా సెట్‌లో ఎదుర్కొన్న కఠిన పరిస్థితిని ప్రముఖ నటుడు గుమ్మడి ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. కథానాయికగా అవకాశాలు తగ్గుముఖం పట్టిన తర్వాత సావిత్రి క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, ముఖ్యంగా తల్లి పాత్రలలో నటించేవారు.

Savitri: సెట్లో అవమానం, అన్నం కూడా పెట్టకుండా.. సావిత్రి చివరి రోజుల్లో వింటే కన్నీళ్లు ఆగవు.!
Savitri1
Ravi Kiran
|

Updated on: Mar 05, 2026 | 1:23 PM

Share

దివంగత నటుడు గుమ్మడి మహానటి సావిత్రి చివరి రోజుల్లో సెట్‌లో ఎదురైన చేదు అనుభవాన్ని గతంలో ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. అవకాశాలు తగ్గి, తల్లి పాత్రలు చేస్తున్న సమయంలో ఆమెకు భోజనం కూడా లభించలేదని వివరించారు. సావిత్రిని పలకరించగా ఆకలి లేదని చెప్పిందని, గుమ్మడి పట్టుబట్టడంతో ఆమె కన్నీళ్లతో భోజనం చేసిందని ఆయన గుర్తు చేసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే..! దివంగత మహానటి సావిత్రి జీవిత చివరి దశలో ఒక సినిమా సెట్‌లో ఎదుర్కొన్న కఠిన పరిస్థితిని ప్రముఖ నటుడు గుమ్మడి ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. కథానాయికగా అవకాశాలు తగ్గుముఖం పట్టిన తర్వాత సావిత్రి క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, ముఖ్యంగా తల్లి పాత్రలలో నటించేవారు. అలాంటి ఒక సినిమా చిత్రీకరణ సమయంలో గుమ్మడి కూడా ఆమెతో పాటు షూటింగ్‌లో పాల్గొన్నారు.

ఆ రోజు సెట్‌లో ఇతర నటీనటులందరికీ ఇంటి నుంచి భోజనాలు రాగా, సావిత్రి మాత్రం ఒంటరిగా ఒక మూల కూర్చుని ఉన్నారు. ప్రొడక్షన్ సిబ్బంది ఆమెకు భోజనం ఏర్పాటు చేయకపోవడం, ఇంటి నుంచి క్యారియర్ రాకపోవడాన్ని గుమ్మడి గమనించారు. ఆయన సావిత్రిని భోజనం చేయమని అడగ్గా, ఆమెకు ఆకలి లేదని సమాధానం ఇచ్చారు. పరిస్థితిని అర్థం చేసుకున్న గుమ్మడి, తాను కూడా భోజనం చేయనని చెప్పడంతో సావిత్రి కన్నీళ్లతో వచ్చి గుమ్మడితో కలిసి భోజనం చేశారు. ఒకప్పుడు ఆమె కాల్షీట్‌ల కోసం నిర్మాతలు ఎదురుచూసేవారని, కానీ చివరికి ఆమె పరిస్థితి ఇంత దారుణంగా మారి, ప్రొడక్షన్ బాయ్స్ కూడా చులకనగా చూసే స్థాయికి దిగజారిందని గుమ్మడి ఆ ఇంటర్వ్యూలో ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంఘటన మహానటి సావిత్రి చివరి రోజుల దుస్థితికి అద్దం పడుతోంది.

(ఈ కథనాన్ని సీనియర్ జర్నలిస్టుల చెప్పిన విషయాలు ఆధారంగా తీసుకుని ప్రచురించింది)

ఇది చదవండి: నేను, రజినీకాంత్ షూటింగ్‌లో ఒకటే సిగరెట్ కాల్చేవాళ్లం.. ఓపెన్‌గా చెప్పేసిన స్టార్ నటుడు

Follow Us
పసికందును బిడ్డకు అప్పజెప్పి పనికి వెళ్లిన తల్లిదండ్రులు..
పసికందును బిడ్డకు అప్పజెప్పి పనికి వెళ్లిన తల్లిదండ్రులు..
చెప్పుకోండి చూద్దాం.! మనుషులను చూసి సిగ్గుపడే జంతువు ఏదో తెల్సా..
చెప్పుకోండి చూద్దాం.! మనుషులను చూసి సిగ్గుపడే జంతువు ఏదో తెల్సా..
పదేళ్ల విధ్వంసాన్ని తుడిచేస్తున్నాం.. అడ్డుపడితే అడ్రస్ లేకుండా..
పదేళ్ల విధ్వంసాన్ని తుడిచేస్తున్నాం.. అడ్డుపడితే అడ్రస్ లేకుండా..
ఏపీ రైతుల కోసం కొత్త యాప్.. అన్నీ ఒకేచోట
ఏపీ రైతుల కోసం కొత్త యాప్.. అన్నీ ఒకేచోట
మీ బంగారు నగలకు పెద్ద శత్రువు ఈ చిన్న పదార్థం ! జస్ట్‌ టచ్‌చేస్తే
మీ బంగారు నగలకు పెద్ద శత్రువు ఈ చిన్న పదార్థం ! జస్ట్‌ టచ్‌చేస్తే
కావ్యా కోసం క్యూ కట్టిన ప్రేమికులు.. స్టేడియంలోనే గులాబీలతో ప్రేమ
కావ్యా కోసం క్యూ కట్టిన ప్రేమికులు.. స్టేడియంలోనే గులాబీలతో ప్రేమ
ఏజెన్సీలోకి మళ్లీ 'పెద్దపులి'.. పగలంతా రెస్ట్, రాత్రిపూట వేట
ఏజెన్సీలోకి మళ్లీ 'పెద్దపులి'.. పగలంతా రెస్ట్, రాత్రిపూట వేట
శంషాబాద్‌లో బుల్లెట్ రైళ్ల కోసం భారీ టెర్మినల్.. 600 ఎకరాల్లో..
శంషాబాద్‌లో బుల్లెట్ రైళ్ల కోసం భారీ టెర్మినల్.. 600 ఎకరాల్లో..
ఎండాకాలంలో తమలపాకు మొక్క గుబురుగా పెరగాలంటే ఇలా చేయండి..
ఎండాకాలంలో తమలపాకు మొక్క గుబురుగా పెరగాలంటే ఇలా చేయండి..
50 అడుగుల బావిలోంచి ఒకటే అరుపులు.. ఏంటా అని చూసిన రైతులు షాక్‌!
50 అడుగుల బావిలోంచి ఒకటే అరుపులు.. ఏంటా అని చూసిన రైతులు షాక్‌!