Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anasuya Bharadwaj: అనసూయ మరో సెన్సేషనల్‌ ట్వీట్‌.. ‘మీ పెంపకం ఎలాంటిదో మీరే అర్థం చేసుకోండి’ అంటూ..

అనసూయ భరద్వాజ్‌.. గత కొన్ని రోజుల నుంచి సోషల్‌ మీడియాలో ఈ స్టార్ యాంకర్‌ కమ్‌ యాక్ట్రెస్‌ పేరు తెగ మార్మోగిపోతోంది. దీనికి కారణం టాలీవుడ్‌కు చెందిన ఓ యంగ్‌ హీరోను ఉద్దేశిస్తూ ఆమె చేస్తున్న వరుస ట్వీట్లే. హీరో పేరు ముందు 'THE' అని పెట్టుకోవడాన్ని తప్పు పడుతూ 'పైత్యం ఎక్కువైంది' అంటూ మొదలైన ఈ ట్వీట్ల పరంపర నేటికీ కొనసాగుతూనే ఉంది.

Anasuya Bharadwaj: అనసూయ మరో సెన్సేషనల్‌ ట్వీట్‌.. 'మీ పెంపకం ఎలాంటిదో మీరే అర్థం చేసుకోండి' అంటూ..
Vijay Devarakonda, Anasuya
Follow us
Basha Shek

|

Updated on: May 11, 2023 | 5:50 AM

అనసూయ భరద్వాజ్‌.. గత కొన్ని రోజుల నుంచి సోషల్‌ మీడియాలో ఈ స్టార్ యాంకర్‌ కమ్‌ యాక్ట్రెస్‌ పేరు తెగ మార్మోగిపోతోంది. దీనికి కారణం టాలీవుడ్‌కు చెందిన ఓ యంగ్‌ హీరోను ఉద్దేశిస్తూ ఆమె చేస్తున్న వరుస ట్వీట్లే. హీరో పేరు ముందు ‘THE’ అని పెట్టుకోవడాన్ని తప్పు పడుతూ ‘పైత్యం ఎక్కువైంది’ అంటూ మొదలైన ఈ ట్వీట్ల పరంపర నేటికీ కొనసాగుతూనే ఉంది. సదరు హీరో స్పందించకపోయినా హీరో అభిమానులు, నెటిజన్లు అనసూయను తప్పుబడుతూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు షేర్‌ చేస్తున్నారు. మధ్యలో డైరెక్టర్‌ హరీష్ శంకర్, కొబ్బరిమట్ట దర్శకుడు సాయి రాజేష్ వంటి వారు కూడా ‘THE’ అనే పదాన్ని ప్రస్తావిస్తూ నెట్టింట్లో పోస్టులు షేర్‌ చేశారు. వీటిపై స్పందించిన అనసూయ.. ‘ అంటే ఇంతమంది వత్తాసు పలికితే గాని పని అవ్వదు అన్నమాట, అతడు సినిమాలో బుజ్జిని పార్థు అడిగినట్టు అదే ఎంతమంది ఏంటి అని నా ఒక్కదాని కోసం అడుగుతున్నానని ఆమె పేర్కొంది. ఏమో బాబు నాకు పీఆర్‌ స్టెంట్లు తెలియవు, రావు, అవసరం లేదు కూడా. కానీయండి కానీయండి’ అంటూ మరో పోస్ట్ పెట్టింది.

తాజాగా బుధవారం సాయంత్రమ మరో ట్వీట్‌ చేసింది అనసూయ. ‘నువ్వు నన్ను తిడితే నీ కంపు నోరు తప్పవుతుంది కానీ, నేనెలా తప్పు అవుతాను!! నా పెంపకం గర్వించదగినది. నా అభిప్రాయాన్ని ధైర్యంగా గౌరవపూర్వకంగా చెప్పడం నేర్పింది. మీ పెంపకం ఎలాంటిదో మీరే అర్థం చేసుకోండి. వేధింపులకు గురయ్యే వాళ్లకు కాదు.. వేధించే వాళ్లకు బుద్ధి, సిగ్గు ఉండాలి’ అని ట్వీట్‌లో రాసుకొచ్చింది అనసూయ. ప్రస్తుతం ఈ పోస్ట్‌ కూడా నెట్టింట్లో వైరలవుతోంది. దీనిపై కూడా నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ‘ఈమె మళ్లీ మొదలెట్టింది’ అని కొందరు కామెంట్ చేస్తుంటే.. యంగ్ హీరో ఫ్యాన్స్‌ మాత్రం అనసూయను ట్రోల్ చేస్తూ కామెంట్లు పెడుతున్నారు. మొత్తానికి ఈ వ్యవహారం ఎప్పటికీ సద్దుమణుగుతుందో..

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..