AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

17ఏళ్లుగా టాలీవుడ్‌కు దూరం.. ఇన్నాళ్లకు ఇలా.. ఖడ్గం భామ ఇప్పుడు ఎలా ఉందంటే

సినిమా ఇండస్ట్రీలో చాలా మంది అందాలభామలు ఇలా వచ్చి ప్రేక్షకులను ఆకట్టుకొని అలా వెళ్లిపోతుంటారు. అలాంటి వారు ఇప్పుడు ఎలా ఉన్నారు. అప్పుడు కుర్రాళ్ళ గుండెల్లో బాణాలు గుచ్చి ఇప్పుడు కనుమరుగైన ముద్దుగుమ్మలు ఎలా ఉన్నారు అని నెటిజన్లు గూగుల్ ను గాలించేస్తోన్నారు.

17ఏళ్లుగా టాలీవుడ్‌కు దూరం.. ఇన్నాళ్లకు ఇలా.. ఖడ్గం భామ ఇప్పుడు ఎలా ఉందంటే
Khadgam
Rajeev Rayala
|

Updated on: Mar 05, 2026 | 1:18 PM

Share

టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ తెరకెక్కించిన సూపర్ హిట్ సినిమాల్లో.. ఎవర్ గ్రీన్ బ్లాక్ బస్టర్ మూవీ ఖడ్గం. దేశ భక్తి నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఆ మధ్య స్వాతంత్య్ర దినోత్సవం వచ్చిందంటే చాలు ఈ సినిమా కచ్చితంగా టీవీలో ప్రత్యక్షమైపోవాల్సిందే.  ఆగస్టు 15న స్కూల్స్, కాలేజీల్లో జరిగే ఇండిపెండెన్స్ డే వేడుకల్లో ఖడ్గం సినిమా పాటలు వినిపించాల్సిందే. ఇప్పటికీ ఈ సినిమా పాటలు వినిపిస్తూనే ఉన్నాయి. 2002లో రిలీజైన ఈ మూవీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. శ్రీకాంత్, ప్రకాశ్ రాజ్, రవితేజ, బ్రహ్మాజీ, సోనాలి బింద్రే, కిమ్ శర్మ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడంతో పాటు బెస్ట్ డైరెక్టర్ గా కృష్ణవంశీకి నంది పురస్కారం తెచ్చిపెట్టింది. ఖడ్గం సినిమాలో శ్రీకాంత్ సరసన ఇద్దరు హీరోయిన్లు నటించారు. వారు సోనాలిబింద్రే, మరొకరు కిమ్ శర్మ. అప్పటికీ వీరిద్దరూ బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్లే.

ఇది ఊహించని ట్విస్ట్ గురూ..! ఈ ఫేమస్ స్వామిజీ ఆ స్టార్ కమెడియన్ కొడుకా..!!

సోనాలి బింద్రే శ్రీకాంత్ ప్రియురాలిగా నటించగా, కిమ్ శర్మ మాత్రం శ్రీకాంత్ వెంట పడే అల్లరి అమ్మాయి పాత్రలో అద్భుతంగా నటించింది. ముఖ్యంగా ‘ముసుగు వేయద్దు మనసు మీద’ పాటలో కిమ్ శర్మ స్టెప్పులు అభిమానులను ఓ రేంజ్ లో అలరించాయి. ఖడ్గం తర్వాత రాజమౌళి- రామ్ చరణ్ కాంబోలో వచ్చిన మగధీరలో ఓ స్పెషల్ సాంగ్‌లో కిమ్ స్టెప్పులేసింది. అలాగే రవితేజ ఆంజనేయలు సినిమాలోనూ ఓ ప్రత్యేక గీతంలో కనిపించింది. ఆఖరిగా యాగం అనే సినిమాలో కనిపించింది. బాలీవుడ్ లోనూ 2011లో లూట్ అనే సినిమా తర్వాత ప్రేక్షకులకు కనిపించలేదు కిమ్ శర్మ.

ఇవి కూడా చదవండి

అప్పుడు బూటు కాలుతో తన్నులు తిన్నా.. ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.!! షాకింగ్ విషయం చెప్పిన స్టార్ హీరో

కిమ్ శర్మ అనగానే చాలా మందికి ప్రముఖ మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ లవర్ అన్న ముద్ర పడింది. అయితే ఆమె 2010లో అనిల్ పుంజానీని పెళ్లి చేసుకుంది. అయితే ఈ దంపతులు 2016లో విడిపోయారు. దీని తర్వాత ప్రముఖ టాలీవుడ్ నటుడు హర్ష వర్దన్ ఠాణేతో కిమ్ శర్మ డేటింగ్ చేసింది. ఆతర్వాత అలాగే టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్‌తోనూ ప్రేమలో పడిందీ అందాల తార. ఆతర్వాత వీరిద్దరూ బ్రేకప్ చెప్పుకున్నారు. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ సింగిల్ గానే ఉంటోంది. సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉంటోంది. రెగ్యులర్ గా ఫోటోలు షేర్ చేస్తూ ఆకట్టుకుంటుంది.

అలీకి హైదరాబాద్‌లో పెద్ద వ్యాపారం..! ముంబై నుంచి సరుకు దింపుతున్నారట..!! ఈ వీడియో మీరూ చూడండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us