Tollywood: ఈ ఫోటోలో ఉన్న చిన్నారి ఇప్పుడు బుల్లితెరపై అల్లరి పిల్ల.. మాటకారి మాత్రమే కాదు.. డాన్స్ అదరగొట్టేస్తుంది..
పైన ఫోటోను చూశారు కదా..ఆ చిన్నారి ఇప్పుడు బుల్లితెరపై అల్లరి పిల్ల.. చురుకైన అమ్మాయి.. అంతేకాదు.. మాటకారి కూడా. ఇవేకాదండోయ్.. డాన్స్ కూడా అదరగొట్సేస్తోంది. సోషల్ మీడియాలో ఈ ముద్దుగుమ్మ చేసే రచ్చ గురించి చెప్పక్కర్లేదు. గుర్తుపట్టారా ఎవరో ?..

గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో చైల్డ్ హుడ్ ఫోటోస్ తెగ వైరలవుతున్నాయి. తెలుగుతోపాటు.. తమిళం, మలయాళం, కన్నడ, హిందీ సినీ పరిశ్రమకు చెందిన పలువురు స్టార్స్ చిన్ననాటి ఫిక్స్ చక్కర్లు కొడుతున్నాయి. తమ అభిమాన హీరోహీరోయిన్లను గుర్తుపట్టేందుకు నెటిజన్స్ సైతం ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ అందాల యాంకరమ్మ చిన్ననాటి పిక్ వైరలవుతుంది. పైన ఫోటోను చూశారు కదా..ఆ చిన్నారి ఇప్పుడు బుల్లితెరపై అల్లరి పిల్ల.. చురుకైన అమ్మాయి.. అంతేకాదు.. మాటకారి కూడా. ఇవేకాదండోయ్.. డాన్స్ కూడా అదరగొట్సేస్తోంది. సోషల్ మీడియాలో ఈ ముద్దుగుమ్మ చేసే రచ్చ గురించి చెప్పక్కర్లేదు. గుర్తుపట్టారా ఎవరో ?.. తనే యాంకర్ విష్ణుప్రియ.
బుల్లితెరకంటే ముందే సోషల్ మీడియాలో తెగ ఫేమస్ విష్ణు ప్రియ. హైదరాబాద్ లో పుట్టి పెరిగిన ఆమె.. షార్ట్ ఫిల్మ్ చేసింది. సుడిగాలి సుధీర్ తో కలిసి చేసిన పోవే పోరా టీవీ షోతో పాపులర్ అయ్యింది. ఆ తర్వాత బుల్లితెరపై పలు ఈవెంట్స్.. షోస్ చేసింది. 2016లో ‘ట్వంటీ ఫస్ట్ సెంచరీ లవ్’ అనే సినిమాలో నటించారు. ఆ తరవాత 2020లో ‘చెక్ మేట్’ అనే మూవీలో హీరోయిన్‌గా నటించారు.




ఓవైపు బుల్లితెరపై షోస్ చేస్తునే.. మరోవైపు పలు వెబ్ సిరీస్ చేస్తుంది. ఇవే కాకుండా.. ప్రైవేట్ సాంగ్స్ సైతం చేస్తుంది. గతంలో బిగ్ బాస్ ఫేమ్ మానస్ తో కలిసి విష్ణు ప్రియ చేసిన జరీ జరీ పంచెకట్టి సాంగ్ నెట్టింట వైరలయ్యింది. ఈ పాటకు అద్బుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇటీవల వీరిద్దరు కలిసి గంగులు సాంగ్ చేసిన సంగతి తెలిసిందే.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.