AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

EPFO: పీఎఫ్ అకౌంట్ ఉన్నవారందరికీ బిగ్ న్యూస్.. ఈ పని చేస్తేనే మీ అకౌంట్లోకి డబ్బులు.. తప్పనిసరి చేసిన కేంద్రం

ఈపీఎఫ్‌వో ఖాతాదారులకు ఊరట. ఇక నుంచి క్లెయిమ్స్ సెటిల్మెంట్లలో వేగం పెరగనుంది. ఇందుకు కారణంగా ఈపీఎఫ్‌వో ఆటోమేటిక్ క్లెయిమ్ సెటిల్మెంట్ విధానాన్ని పాటించడమే. ఇప్పటివరకు మాన్యువల్ ప్రాసెస్‌లో క్లెయిమ్స్ జరుగుతోండగా.. ఇక నుంచి ఆటోమేషన్ విధానాన్ని పాటించనున్నట్లు ఈపీఎఫ్‌వో ప్రకటన జారీ చేసింది.

EPFO: పీఎఫ్ అకౌంట్ ఉన్నవారందరికీ బిగ్ న్యూస్.. ఈ పని చేస్తేనే మీ అకౌంట్లోకి డబ్బులు.. తప్పనిసరి చేసిన కేంద్రం
Epfo
Venkatrao Lella
|

Updated on: Mar 05, 2026 | 1:19 PM

Share

దేశంలోని ప్రైవేట్ ఉద్యోగులందరికీ ఊరట కలిగించేలా ఈపీఎఫ్‌వో కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ఈపీఎఫ్‌వో సేవలన్నీ ఆటోమేషన్ పద్దతిలో జరగనున్నాయి. మాన్యువల్ జోక్యం ఇక తగ్గనుంది. ఈ మేరకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. మాన్యువల్ విధానాన్ని ఇక స్వస్తి పలకాలను, ఆటోమేషన్ పద్దతిలో పీఎఫ్ సేవలు అందించాలని నిర్ణయించారు. ఇందుకోసం పీఎఫ్ ఖాతాదారులందరూ తప్పనిసరిగా కేవైసీ సమర్పించాలని సూచించింది. కేవైసీ సమర్పించిన చందాదారులకు సేవలు ఆటోమేటిక్‌గా కొత్త పద్దతిలోకే మారిపోతాయి. ఈ మేరకు అందరూ కేవైసీ ప్రక్రియను పూర్తి చేయాలని ఈపీఎఫ్‌వో ఆదేశించింది. ఆటోమేషన్ పద్దతి అమలుకు సన్నద్దం కావాలని, అందుకు తగిన చర్యలు చేపట్టాలని యంత్రాగాన్ని ఈపీఎఫ్‌వో ఆదేశించింది.

క్లెయిమ్ ఆటో సెటిల్మెంట్

ఇప్పటివరకు ఈపీఎఫ్‌వో క్లెయిమ్స్ మాన్యువల్ విధానంలో జరిగేవి. ఖాతాదారుడు ఈపీఎఫ్‌వో పోర్టల్ లేదా ఉమాంగ్ యాప్‌కి వెళ్లి క్లెయిమ్ కోసం దరఖాస్తు చేసుకోని అవసరమైన ఆధారాలు, బ్యాంక్ అకౌంట్ పాస్ బుక్ వంటివి అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది. అనంతరం అధికారులు వివరాలు పరిశీలించిన సరిగ్గా ఉంటే క్లెయిమ్ ప్రాసెస్ చేసేవారు. అధికారుల పరిశీలనకు చాలా టైమ్ పట్టేది. ఇక మధ్యలో సెలవు దినాలు వస్తే అధికారులు అందుబాటులో ఉండరు గనుక క్లెయిమ్ ప్రాసెస్ ఆలస్యమయ్యేది. దీని వల్ల ఖాతాదారులకు ఆలస్యంగా నగదు అందేవి. ప్రస్తుతం ఉన్న మాన్యువల్ పేపర్ ప్రాసెస్, అధికారుల ఆమోదం లాంటివి ఇక నుంచి అవసరం లేదు. ఇక నుంచి అధికారుల పరిశీలన అవసరం లేకుండా ఆటోమేటిక్‌గా క్లెయిమ్ ప్రాసెస్ జరిగే వ్యవస్థను ఈపీఎఫ్‌వో అభివృద్ది చేస్తోంది. ఇది జరిగితే క్లెయిమ్ వేగవంతంగా పరిష్కారం అవుతాయి.

ఆధార్, బ్యాంక్ కేవైసీ తప్పనిసరి

అయితే వినియోగదారులు వేగంగా ఆటోమేషన్ పద్దతిలో క్లెయిమ్స్ పొందాలన్నా లేదా ఇతర పీఎఫ్ సేవలు వినియోగించుకోవాలన్నా కేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకోవాలి. ఇందుకోసం బ్యాంక్, ఆధార్ కేవైసీ ఈపీఎఫ్‌వో పోర్టల్‌లో పూర్తి చేయాల్సి ఉంటుంది. ఖాతాదారులందూ ఈ పనిని వెంటనే పూర్తి చేయాలని సూచించింది. ఇది పూర్తి చేసినవారికి సిస్టమ్‌నే క్లెయిమ్‌ను ప్రాసెస్ చేస్తోంది. అలాగే ఈమెయిల్స్, ఎస్‌ఎంఎస్‌ వంటి అప్డేట్స్ అందుతాయి.  అటు ఇనాపరేటివ్ ఖాతాలకు చెక్ పెట్టాలని ఈపీఎఫ్‌వో భావిస్తోంది. అందులో భాగంగా రూ.వెయ్యి కంటే తక్కువ నగదు కలిగిన ఇన్‌ఆపరేటివ్ ఖాతాలకు ఆటోమేటిక్‌గా క్లెయిమ్ చేయనుంది. వారి ఖాతాల్లో వీటిని జమ చేయనుంది. త్వరలో ఇవి వారి ఖాతాల్లో జమ చేయనున్నారు.

Follow Us