మందుల షాపు బోర్డుపై దేశభక్తి.. ప్రతి ఒక్కరికీ స్ఫూర్తి!
ఇది మామూలు మెడికల్ షాప్ బోర్డు కాదు... ప్రతి భారతీయుడి గుండె చప్పుడు వినిపించే దేశభక్తి ప్రకటన!అశ్వారావుపేటలోని శ్రీ లక్ష్మీ మెడికల్ & జనరల్ స్టోర్స్ బోర్డుపై రెపరెపలాడుతున్న మన త్రివర్ణ పతాకం. దాని కిందే, ప్రతి అక్షరంలోనూ భారతమాతపై ప్రేమను చాటే అద్భుతమైన వాక్యాలు అందరిని ఆకర్షిస్తున్నాయి ..భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట పట్టణంలో భద్రాచలం రోడ్లు గల ఓ మెడికల్ షాప్ బోర్డ్ పై ఇలా రాసి తన దేశభక్తి చాటుకున్నాడు .
“భారతదేశం నా మాతృభూమి. సువిశాలమైన, సుసంపన్నమైన, సర్వ సత్తాక, సార్వభౌమాధికారం కలిగిన భారతదేశంలో జన్మించడం గర్వంగా ఉంది.” అంటూ రాశాడు
సాధారణంగా మెడికల్ షాపుల బోర్డులపై ఆఫర్లు, డిస్కౌంట్లు కనిపిస్తాయి. కానీ మందుల షాపు యజమాని మాత్రం తన బోర్డును దేశభక్తిని చాటే వేదికగా మార్చారు. వైద్యంతో పాటు దేశంపై ప్రేమను కూడా పంచుతున్నారు.ఈ బోర్డు చూసిన ప్రతి ఒక్కరూ ఒక్కసారి ఆగి, చదివి, గర్వంగా ఫీలవుతున్నారు. ముఖ్యంగా చిన్నారులకు ఇది దేశభక్తి పాఠం నేర్పుతోంది. సువిశాలమైన, సుసంపన్నమైన, సర్వ సత్తాక, సార్వభౌమాధికారం… ఈ నాలుగు పదాల్లో మన రాజ్యాంగ ప్రవేశిక సారాంశం మొత్తం ఉంది.వ్యాపారం చేస్తూనే సమాజానికి సందేశం ఇవ్వొచ్చని నిరూపించారు శ్రీ లక్ష్మీ మెడికల్ స్టోర్స్ నిర్వాహకులు. ఇది కేవలం బోర్డు కాదు… ప్రతి భారతీయుడు గుండెల్లో పెట్టుకోవాల్సిన భావన అని మెడికల్ షాప్ యజమాని చెప్తున్నాడు
అది బస్సా లేక విమానమా? కేరళ ఆర్టీసీ లగ్జరీ ప్రయాణం!
దుబాయ్‌లో సింగిల్ రూమ్ అద్దె ఎంతో తెలిస్తే నోరెళ్లబెడతారు!
అయ్యో.. అక్కడ సముద్రం ఎండిపోయిందా!
పిందె నుంచి కాయ వరకూ.. కొబ్బరికాయ తయారీలో ఆసక్తికరమైన దశలు
క్లాస్ రూంలో పాఠాలు చెబుతున్న టీచర్ అంతలోనే
బైకులోనుంచి వింత శబ్దాలు..దెబ్బకు బైకు వదిలి వ్యక్తి పరుగులు
ఏసీ కోచ్‌లో అనుమానాస్పదంగా మహిళ లగేజ్.. ఓపెన్ చేయగా చేయగా

