AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మళ్లీ ట్రెండ్ అవుతున్న ఏజ్‌ గ్యాప్‌ సినిమాలు

మళ్లీ ట్రెండ్ అవుతున్న ఏజ్‌ గ్యాప్‌ సినిమాలు

Lakshminarayana Varanasi
| Edited By: |

Updated on: Jul 23, 2026 | 10:25 PM

Share

సౌత్ సినిమాల్లో ఏజ్ గ్యాప్ ప్రేమకథలు మరోసారి హాట్ టాపిక్‌గా మారాయి. సూర్య–మమిత బైజు జంటగా వస్తున్న విశ్వనాథ్ అండ్ సన్స్, నయనతార–కవిన్ నటించిన హాయ్ చిత్రాలు విభిన్న ప్రేమకథలతో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. గతంలో మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి విజయం తర్వాత ఈ తరహా కథలపై ఆసక్తి మరింత పెరిగింది.

తెలుగు తెర మీద ప్రేమకథల్లో ఎప్పుడూ ప్రయోగాత్మక సినిమాలు వస్తూనే ఉంటాయి. ఏజ్ గ్యాప్ అన్నది కేవలం రియల్ లైఫ్‌లో చర్చించుకునే ముచ్చట్లే కాదు, రీల్ లైఫ్‌లోనూ ఓ సాలిడ్ కాన్సెప్ట్‌గా మారిపోయింది. మరి ప్రేక్షకులను మెప్పించేలా మన సౌత్ ఇండస్ట్రీ ఈ ఏజ్ డిఫరెన్స్ కాన్సెప్ట్‌తో ఎలాంటి మ్యాజిక్ చేయబోతోంది అసలు ఈ తరహా ట్రెండ్‌ సెట్ చేసిన, చేయబోతున్న సినిమాలేంటి? ఈ స్టోరీలో చూద్దాం. ఆగస్ట్ 14న బాక్సాఫీస్ దగ్గర ఓ ఇంట్రెస్టింగ్ ఫైట్‌ జరగబోతోంది. వెంకీ అట్లూరి డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న విశ్వనాథ్ అండ్ సన్స్ అదే రిలీజ్ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా 40 ఏళ్లు దాటిన సూర్యను, పాతికేళ్ల అమ్మాయి మమిత బైజు ప్రేమించటం అనే కాన్సెప్ట్‌తో రూపొందుతోంది. ఏమాత్రం తేడా కొట్టినా ఆడియన్స్ రిసీవ్ చేసుకోలేని ఈ సబ్జెక్ట్‌ను దర్శకుడు ఎమోషనల్‌గా ఎలా ప్రెజెంట్ చేశారన్న డిస్కషన్ జరుగుతోంది. విశ్వనాథ్ అండ్‌ సన్స్‌తో పాటు తమిళ యంగ్ హీరో కవిన్, లేడీ సూపర్ స్టార్ నయనతార జంటగా నటిస్తున్న హాయ్ మూవీ కూడా రిలీజ్ అవుతోంది. ఈ సినిమాలోనూ నయన్, కవిన్ మధ్య ఉన్న ఏజ్ డిఫరెన్స్ కాన్సెప్టే మెయిన్ హైలైట్. ఓల్డర్ ఉమెన్, యంగర్ బాయ్ మధ్య ఎమోషనల్ ప్రేమకథగా వస్తున్న ఈ రామ్-కామ్ మీద మంచి అంచనాలే ఉన్నాయి. ఒకేరోజు ఇలా రెండు ఏజ్ డిఫరెన్స్ కథలు రిలీజ్ అవుతుండటంతో ఈ ఫైట్ ఆసక్తికరంగా మారింది. రియల్‌ లైఫ్‌ ఏజ్‌ గ్యాప్‌ గురించి చర్చ జరుగుతున్న టైమ్‌లో… ఆన్‌ స్క్రీన్‌ కూడా అదే పాయింట్‌ను హైలెట్‌ చేస్తుండటం ఆడియన్స్‌లో క్యూరియాసిటీ క్రియేట్ చేస్తోంది. ఈ పాయింట్‌ను హైలైట్ చేస్తూ వచ్చిన సినిమాలు మంచి విజయం సాధించాయి. ముఖ్యంగా నవీన్ పొలిశెట్టి, అనుష్క నటించిన మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి ఈ కాన్సెప్ట్‌తోనే వచ్చి బాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ చేసింది. మెచ్యూర్డ్ ఉమెన్, యంగ్ బాయ్ మధ్య ఉన్న ఏజ్ అండ్ మైండ్ సెట్ గ్యాప్‌ని ఎంటర్టైనింగ్‌గా చూపించి టీమ్ సక్సెస్ అయ్యింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వైరల్‌ ఇన్‌ఫెక్షన్‌కు గురయ్యారా.. ఈ 5 లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకండి!

భారతీయులకు నిద్ర కరవు.. షాకింగ్ నిజాలు!

మనుషులను చల్లబరిచే ఫ్రిజ్‌.. లోపల 5 నిమిషాలు కూర్చుంటే చాలు

40 అడుగుల ఎత్తు నుంచి పడ్డ టూరిస్ట్! ఏం జరిగిందో మీరే చూడండి!

Tirumala: అన్నప్రసాదాల పంపిణీకి కొత్త టెక్నాలజీ టీటీడీ వినూత్న ప్రయోగం

Follow Us