AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

S. S. Rajamouli: జక్కన్న జోరుకు చెక్‌ పెట్టాలన్న బాలీవుడ్ కల నెరవేరేదెప్పుడు?

S. S. Rajamouli: జక్కన్న జోరుకు చెక్‌ పెట్టాలన్న బాలీవుడ్ కల నెరవేరేదెప్పుడు?

Lakshminarayana Varanasi
| Edited By: |

Updated on: Jul 23, 2026 | 10:22 PM

Share

పాన్ ఇండియా సినిమాల యుగంలో హీరోలతో పాటు దర్శకుల మధ్య కూడా నెంబర్ గేమ్ ఆసక్తికరంగా మారింది. రాజమౌళి, సుకుమార్, సందీప్ రెడ్డి వంగా, ప్రశాంత్ నీల్ వంటి సౌత్ దర్శకులు జాతీయ స్థాయిలో ఆధిపత్యం చాటుతుండగా.. ఆ పోటీకి బాలీవుడ్ నుంచి ఆదిత్య ధర్ వంటి దర్శకులు సవాల్ విసురుతున్నారు. మరో భారీ విజయంతోనే బాలీవుడ్ నిజంగా సౌత్‌కు పోటీగా నిలుస్తుందా అన్నది తేలనుంది.

హీరోల మధ్యే కాదు ఇప్పుడు దర్శకుల మధ్య కూడా నెంబర్‌ గేమ్ నడుస్తోంది. ముఖ్యంగా పాన్ ఇండియా రేంజ్‌లో సౌత్ మేకర్స్ డామినేషన్‌కు చెక్ పెట్టేందుకు బాలీవుడ్ చాలా రోజులుగా ప్రయత్నిస్తుంది. మరి ఆ ప్రయత్నాల్లో ఉన్న బాలీవుడ్‌ మేకర్స్ ఎవరు? నెంబర్‌ గేమ్‌లో సౌత్‌ మేకర్స్‌ను వెనక్కినెట్టే సత్తా ఉన్న కెప్టెన్ బాలీవుడ్‌లో ఎమర్జ్ అయ్యారా..? బిగ్ స్క్రీన్‌ మీద పాన్ ఇండియా ట్రెండ్ మొదలు పెట్టిన కెప్టెన్‌.. దర్శకధీరుడు రాజమౌళి. ఒక్కో మూవీతో ఇండియన్ సినిమా రేంజ్‌ పెంచుకుంటూ పోతున్న జక్కన్న ఇండియాస్ బిగ్గెస్ట్ డైరెక్టర్‌ చైర్‌ను ఫస్ట్‌ టైమ్‌ ఆక్యుపై చేశారు. దీంతో ఆ రేంజ్‌కు చేరేందుకే మిగతా డైరెక్టర్స్ అంతా ట్రై చేస్తున్నారు. బాహుబలి 2తో క్రియేట్ చేసిన రికార్డ్స్‌ను పుష్ప 2తో బ్రేక్ చేశారు సుకుమార్‌. అసలు అసాధ్యమనుకున్న విషయాన్ని సాధ్యం చేసి చూపించిన లెక్కల మాస్టర్‌.. ఇండియన్ మేకర్స్‌కు కొత్త దారి చూపించారు. మరో క్రేజీ కెప్టెన్‌ సందీప్ రెడ్డి వంగా నెంబర్‌ గేమ్‌లో చాలా ముందుకు వచ్చేశారు. చేసింది తక్కువ సినిమాలే అయినా.. పాన్ ఇండియా రేంజ్‌లో సందీప్ క్రేజ్‌ నెక్ట్స్‌ లెవల్‌లో ఉంది. పాన్ ఇండియా మార్కెట్‌ను షేక్ చేసిన మరో సౌత్ డైరెక్టర్‌ ప్రశాంత్ నీల్‌. కేజీఎఫ్‌, కేజీఎఫ్ 2 సినిమాలతో వేల కోట్ల వసూళ్లు సాధించిన నీల్‌, నేషనల్ మార్కెట్‌లో సౌత్‌ డామినేషన్‌ను మరోసారి ప్రూవ్ చేశారు. అందుకే ఈ రూల్‌ను బ్రేక్ చేసేందుకు బాలీవుడ్ నుంచి సిద్ధా్ర్థ్ ఆనంద్, అయాన్ ముఖర్జీ లాంటి మేకర్స్‌ చాలా మంది ట్రై చేసి ఫెయిల్ అయ్యారు. రీసెంట్‌గా ధురంధర్‌ సిరీస్‌తో బ్లాక్ బస్టర్స్‌ ఇచ్చిన ఆదిత్యధర్‌ సడన్‌గా రేసులోకి వచ్చారు. బాహుబలి నెంబర్స్‌కు ఆల్మోస్ట్ దగ్గరగా వచ్చిన ఆదిత్యధర్‌ నార్త్ స్క్రీన్‌కు ఆశలు కల్పించారు. సౌత్‌ డామినేషన్‌కు చెక్‌ పెట్టే సత్తా ఉన్న మేకర్స్ బాలీవుడ్‌లోనూ ఉన్నారన్న సిగ్నల్ ఇచ్చారు. అయితే ఈ విషయంలో ఫుల్ కాన్ఫిడెన్స్‌ రావాలంటే మాత్రం ఆదిత్యధర్‌ కాంపౌండ్‌ నుంచి మరో హిట్ రావాలి. అప్పుడే సౌత్‌తో పోటి పడే సత్తా బాలీవుడ్‌కు వచ్చిందా లేదా అన్న విషయంలో క్లారిటీ వస్తుంది. మరి ఆ రోజులు ఎప్పుడొస్తాయో చూడాలి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వైరల్‌ ఇన్‌ఫెక్షన్‌కు గురయ్యారా.. ఈ 5 లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకండి!

భారతీయులకు నిద్ర కరవు.. షాకింగ్ నిజాలు!

మనుషులను చల్లబరిచే ఫ్రిజ్‌.. లోపల 5 నిమిషాలు కూర్చుంటే చాలు

40 అడుగుల ఎత్తు నుంచి పడ్డ టూరిస్ట్! ఏం జరిగిందో మీరే చూడండి!

Tirumala: అన్నప్రసాదాల పంపిణీకి కొత్త టెక్నాలజీ టీటీడీ వినూత్న ప్రయోగం

Follow Us