కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని గూడెం గ్రామంలో చిన్న సైజు బ్యాటరీ నోటిలో పేలడంతో నికిడి గణేష్ అనే విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. బ్యాటరీని కొరకడంతో జరిగిన ఈ ప్రమాదంలో నోరు, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే బాలుడు మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటన స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.