AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

COVID-19: మళ్లీ కరోనా కలకలం.. ఏపీలో 32 కేసులు.. మాస్కు లేకుంటే రిస్కేనా?

COVID-19: మళ్లీ కరోనా కలకలం.. ఏపీలో 32 కేసులు.. మాస్కు లేకుంటే రిస్కేనా?

Phani CH
|

Updated on: Jul 23, 2026 | 10:21 PM

Share

దేశంలో మళ్లీ కొవిడ్ కేసులు నమోదవుతుండటంతో అప్రమత్తత అవసరమని వైద్యులు సూచిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కేసులు పెరుగుతుండగా, తెలంగాణలో కూడా జ్వరం, దగ్గు లక్షణాలతో ఆస్పత్రులకు రోగుల రాక అధికమైంది. రద్దీ ప్రాంతాలు, ఆస్పత్రులకు వెళ్లేవారు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు మాస్క్ ధరించడం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం ద్వారా వైరస్ వ్యాప్తిని తగ్గించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

దేశంలో వివిధ ప్రాంతాల్లో మళ్లీ కొవిడ్ కేసులు నమోదు అవుతుండటంతో ప్రజల్లో మరోసారి భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. కేసులు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడానికి మళ్లీ మాస్క్ వాడాల్సిందేనా.. అనే చర్చ తీవ్రమవుతోంది. ముఖ్యంగా రద్దీగా ఉండే ప్రాంతాలు, ఆస్పత్రులకు వెళ్లేటప్పుడు మాస్క్ వాడటం శ్రేయస్కరమని, వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. రద్దీ ప్రదేశాలు, ఆస్పత్రులకు వెళ్లేవారు, వయోవృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు ముందు జాగ్రత్తగా మాస్క్ వాడటం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. గత కొన్ని రోజులుగా తగ్గుముఖంట్టిన కేసులు ఇప్పుడు మళ్లీ నిలకడగా పెరుగుతుండటం అధికారులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. వైరస్ వ్యాప్తి నివారణకు అప్రమత్తమైన ఆరోగ్య శాఖ, ప్రజలు ముందస్తు జాగ్రత్తలు పాటించాలని సూచిస్తోంది. మరో వైపు తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ మళ్లీ పంజా విసురుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల తగ్గుముఖం పట్టిన కొవిడ్ బాధితుల సంఖ్య మళ్లీ పెరుగుతుండటం స్థానికంగా తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. గత కొన్ని రోజులుగా అదుపులో ఉన్నట్టు కనిపించిన కేసులు ఇప్పుడు క్రమంగా పెరుగుతుండటంతో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. పరిస్థితి చేయిదాటకుండా ముందస్తు జాగ్రత్తలు, నివారణ చర్యలు చేపట్టడంపై దృష్టి సారించారు. తెలంగాణలో కొద్ది రోజులుగా తీవ్రమైన జలుబు, జ్వరం, దగ్గు, ఒళ్లునొప్పులతో బాధపడుతున్న వారి సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. హైదరాబాద్‌ పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులకు గత నెల రోజులుగా భారీ సంఖ్యలో రోగులు తరలివస్తున్నారు. అయితే ఆస్పత్రుల్లో వైద్యులు కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించకపోవడంతో ఈ కేసులు అధికారికంగా బయటకు రావడం లేదనే ప్రచారం సాగుతోంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలను కరోనా టెన్షన్ వెంటాడుతోంది. రాష్ట్రంలో రోజురోజుకూ కోవిడ్ కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. కొత్తగా మరో 6 కరోనా కేసులు నమోదు కావడంతో మొత్తం బాధితుల సంఖ్య 32కు చేరింది. బుధవారం నమోదైన కేసుల్లో విశాఖపట్నంలో మూడు, రాజమహేంద్రవరంలో మూడు కేసులు ఉన్నాయి. కొద్దిరోజులుగా వరుసగా కేసులు బయటపడుతుండటంతో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మాస్కులు, మందులు, టెస్టింగ్ కిట్లను సిద్ధం చేశారు. వైద్యాధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కొత్త వేరియంట్ గుర్తింపు కలకలం రేపుతోంది. కడప జిల్లాలో సేకరించిన నమూనాల్లో ఒమిక్రాన్ ఆర్‌ఎఫ్‌.5 వేరియంట్ ఉన్నట్లు పుణెలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ల్యాబ్ స్పష్టం చేసింది. ఈ కొత్త వేరియంట్ వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్ర ఆరోగ్య శాఖ మరింత అప్రమత్తమైంది. బాధితుల ప్రాథమిక పరిచయాలను గుర్తించి, ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలని అధికారులు కోరుతున్నారు. రాష్ట్రంలో కరోనా వ్యాప్తిని సమర్థంగా ఎదుర్కొనేందుకు పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉండాలని వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ అధికారులను ఆదేశించింది. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ముందస్తుగా దశల వారీ కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు. ఆస్పత్రుల్లో బెడ్లు, ఆక్సిజన్ సరఫరా, అవసరమైన మందులు అందుబాటులో ఉంచాలని స్పష్టం చేశారు. ప్రజలు ఆందోళన చెందకుండా కనీస ముందస్తు జాగ్రత్తలు పాటించేలా చైతన్యం తేవాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ముందస్తు ఏర్పాట్లను ముమ్మరం చేసినట్లు వెల్లడించారు. రోగులకు అవసరమైన వైద్య పరీక్షలు, చికిత్సల కోసం అన్ని వసతులు సిద్ధం చేశామని చెప్పారు. కరోనా విషయంలో ప్రజలు ఏమాత్రం భయాందోళన చెందాల్సిన అవసరం లేదని, అయితే తగిన జాగ్రత్తలు పాటించడం శ్రేయస్కరమని సూచించారు. శరీరంలో ఏవైనా స్వల్ప లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా వెంటనే సమీపంలోని ప్రభుత్వాసుపత్రికి వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకోవాలని కోరారు. మంగళగిరి ఎయిమ్స్ ఆసుపత్రిలో కరోనా వైరస్ వ్యాప్తి కలకలం రేపుతోంది. దుగ్గిరాల, చినకాకాని ప్రాంతాలకు చెందిన వ్యక్తులకు నిర్వహించిన వైద్య పరీక్షల్లో కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో ఎయిమ్స్ ఆసుపత్రి ప్రాంగణంలో నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఐదుకు చేరుకుంది. వరుసగా కేసులు వెలుగు చూస్తుండటంతో ఆసుపత్రి వర్గాలు, స్థానికులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తం ఆరు కరోనా కేసులు నమోదు కావడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రతీ ఒక్కరూ సామాజిక దూరం, వ్యక్తిగత పరిశుభ్రత తప్పనిసరిగా పాటించాలని అధికారులు సూచించారు. కొత్తగా వస్తున్న అనుమానిత కేసులను త్వరితగతిన గుర్తించేందుకు వీలుగా అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో ఆర్టీపిసిఆర్ కిట్లను అందుబాటులో ఉంచినట్లు స్పష్టం చేశారు. రాజమండ్రి ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతుండటంతో స్థానికంగా ఆందోళన వ్యక్తమవుతోంది. ఆస్పత్రికి వచ్చిన అనుమానితులకు నిర్వహించిన కోవిడ్ 19 రేపిడ్ టెస్టుల్లో తాజాగా మరో ఐదుగురికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వారం రోజుల క్రితం ఒక కేసు వెలుగుచూడగా, ప్రస్తుతం ఈ సంఖ్య ఆరుకు చేరినట్లు వైద్యులు స్పష్టం చేశారు. బాధితులకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కోవిడ్ వార్డులో ఉంచి మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు. కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఆసుపత్రి వర్గాలు ముందస్తు జాగ్రత్తలు ముమ్మరం చేశాయి. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సత్య అందిస్తారు. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో విశాఖపట్నం జిల్లాలోని ప్రముఖ పర్యాటక , సున్నితమైన ప్రాంతమైన సీలేరులో అధికారులు తక్షణ రక్షణ చర్యలు ప్రారంభించారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు పొరుగు రాష్ట్రాలైన ఒడిశా, ఛత్తీస్‌గఢ్ నుంచి పర్యాటకులు విపరీతంగా వచ్చే సీలేరు పవర్ కాంప్లెక్స్ పరిధిలో సందర్శకుల ప్రవేశాన్ని తాత్కాలికంగా పూర్తిగా రద్దు చేశారు. సీలేరు, డొంకరాయి, పొల్లూరు , మాచ్‌ఖండ్ జలవిద్యుత్ కేంద్రాలతో పాటు ఇక్కడి ప్రధాన రిజర్వాయర్లను చూసేందుకు బయటి వ్యక్తులెవరూ రాకుండా ఆంక్షలు విధించారు. ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరానికి నిత్యం వేలాది మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. నిత్యం ఆర్టీసీ, ప్రైవేటు రవాణా వ్యవస్థల పరిధిలో వెయ్యికి పైగా బస్సులు సేవలు అందిస్తున్నాయి. బస్సులతో పాటు రైళ్లు, విమానాల ద్వారా కూడా నిత్యం 10 వేల మందికి పైగా ప్రయాణికులు సిటీకి వస్తుంటారు. కరోనా ఒకరి నుంచి మరొకరికి వేగంగా వ్యాపించే వైరస్ కావడంతో ఈ రద్దీ రవాణా మార్గాల్లో ప్రయాణించే వారు తప్పనిసరిగా ముందస్తు జాగ్రత్తలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. రాష్ట్రానికి ఎంతో కీలకమైన విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలలో పనిచేసే ఉద్యోగులు, కార్మికుల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని సీనియర్ అధికారులు ప్రత్యేక మార్గదర్శకాలను జారీ చేశారు. సిబ్బంది అంతా విధిగా మాస్కులు ధరించడం, శానిటైజేషన్ , భౌతిక దూరం వంటి కోవిడ్ ప్రోటోకాల్స్‌ను కచ్చితంగా పాటించాలని ఆదేశించారు. వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండాలంటే సాధారణ ప్రజలు కూడా మాస్కులు ధరిస్తూ, మాటిమాటికీ చేతులు శుభ్రం చేసుకుంటూ అత్యంత జాగ్రత్తగా ఉండాలని వైద్యాధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, కేరళ వంటి రాష్ట్రాల్లో అక్కడక్కడ మళ్లీ కరోనా కేసులు బయటపడుతున్నప్పటికీ, ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతం వ్యాపిస్తున్నది ఒమిక్రాన్ సబ్ వేరియంట్ అని, ఇది ఏమాత్రం ప్రమాదకారి కాదని వెల్లడించారు. గతంలో ఒమిక్రాన్ వల్ల ఎలాంటి తీవ్ర ప్రాణనష్టం జరగలేదని, ఇప్పుడు వస్తున్న సబ్ వేరియంట్‌తో కూడా పెద్దగా ముప్పు ఉండదని ధైర్యం చెప్పారు. అయితే, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్నవారు మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉండే వారిపై ఈ వైరస్ కొంత ప్రభావం చూపే అవకాశం ఉన్నందున, ఆ వర్గాలు కాస్త అప్రమత్తంగా ఉండాలని వైద్యులు స్పష్టం చేస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వైరల్‌ ఇన్‌ఫెక్షన్‌కు గురయ్యారా.. ఈ 5 లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకండి!

భారతీయులకు నిద్ర కరవు.. షాకింగ్ నిజాలు!

మనుషులను చల్లబరిచే ఫ్రిజ్‌.. లోపల 5 నిమిషాలు కూర్చుంటే చాలు

40 అడుగుల ఎత్తు నుంచి పడ్డ టూరిస్ట్! ఏం జరిగిందో మీరే చూడండి!

Tirumala: అన్నప్రసాదాల పంపిణీకి కొత్త టెక్నాలజీ టీటీడీ వినూత్న ప్రయోగం

Follow Us