వనపర్తి జిల్లా కరివేన తాండాకు చెందిన శాంతమ్మ అనే వృద్ధురాలు గత 30 ఏళ్లుగా తన ఇంట్లో పాముల పుట్టతో భయం భయంగా జీవిస్తోంది. కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న ఆమెకు సరైన ఆశ్రయం లేదు. ఇంటి కోసం అధికారులను ఆశ్రయించినా ఫలితం లేకపోవడంతో, కనీసం ఓ చిన్న గుడిసె అయినా నిర్మించాలని ప్రభుత్వాన్ని వేడుకుంటోంది.