ఎంప్లాయిస్‌కి గుడ్‌న్యూస్.. PF పెరగనుందోచ్..
ప్రైవేట్, కార్పొరేట్ ఉద్యోగులకు కీలకమైన EPFO మార్పు అమల్లోకి వచ్చింది. కేంద్ర ప్రభుత్వం EPFO తప్పనిసరి కవరేజీకి ఉన్న వేతన పరిమితిని నెలకు రూ.15,000 నుంచి రూ.25,000కు పెంచింది. సెప్టెంబర్ 17, 2026 నుంచి అమల్లోకి వచ్చిన ఈ నిర్ణయంతో రూ.15,000 నుంచి రూ.25,000 మధ్య వేతనం పొందే 51 లక్షలకు పైగా అదనపు ఉద్యోగులు EPFO పరిధిలోకి రానున్నారు. PFతో పాటు EPS పెన్షన్, EDLI బీమా రక్షణ కూడా వర్తిస్తుంది.
ఉద్యోగుల భవిష్య నిధి (EPFO) చందాదారులకు, ప్రైవేట్ ఉద్యోగులకు ఒక అదిరిపోయే శుభవార్త. మీరు ప్రైవేట్ లేదా కార్పొరేట్ రంగంలో పనిచేస్తున్నారా? ప్రతి నెలా మీ జీతం నుంచి PF డబ్బులు కట్ అవుతున్నాయా? అయితే ఈ వీడియో మీకోసమే! ప్రైవేట్, కార్పొరేట్ ఉద్యోగులకు ప్రభుత్వం ఒక బిగ్ న్యూస్ అందించబోతోంది. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) పరిధిలోని వేతన పరిమితిని 15 వేల రూపాయల నుంచి ఏకంగా 25వేల రూపాయలకు పెంచేలా ప్రతిపాదించారు. ఈ ఒక్క నిర్ణయం వల్ల మీ చేతికి వచ్చే జీతం, మీ PF ఖాతాలో జమ అయ్యే డబ్బు, రిటైర్మెంట్ తర్వాత వచ్చే EPS పెన్షన్, ఉచిత లైఫ్ ఇన్సూరెన్స్ మొత్తం పూర్తిగా మారిపోనున్నాయి! అసలు ఈ మార్పుల వల్ల ఎవరికి ఎంత లాభం? మీ జీతం, పెన్షన్ పై ఇది ఎలాంటి ప్రభావం చూపిస్తుందో పూర్తి డిటెల్స్ ఇప్పుడు చూద్దాం.. ప్రస్తుత నిబంధనల ప్రకారం వేతన పరిమితి 15 వేల రూపాయలు గా ఉంది. దీని ప్రకారం..ఉద్యోగి కాంట్రిబ్యూషన్ ప్రతి నెలా బేసిక్ పే లో 12శాతం అనగా గరిష్టంగా 18 వందల రూపాయలు PF ఖాతాకి వెళ్తుంది. కొత్త పరిమితితో ఇకపై 12శాతం లెక్క ప్రకారం ప్రతి నెలా 3వేల రూపాయలు PF ఖాతాలోకి జమ అవుతుంది. దీంతో టేక్-హోమ్ శాలరీ నెలకు 12వందలు అదనంగా PF కి వెళ్లడం వల్ల మీ చేతికి వచ్చే నెలవారీ జీతం స్వల్పంగా తగ్గుతుంది. కానీ, దీర్ఘకాలంలో చక్రవడ్డీ ప్రభావంతో మీ రిటైర్మెంట్ ఫండ్ 35 లక్షల నుంచి 50 లక్షల రూపాయల కంటే ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది! యాజమాన్యం ఇచ్చే 12శాతం కాంట్రిబ్యూషన్ లో 8.33శాతం EPSకి, 3.67శాతం EPFకి వెళ్తుంది. పాత నియమం ప్రకారం 15వేల రూపాయల పై 8.33శాతం అనగా ప్రతి నెలా గరిష్టంగా 1250 రూపాయలు మాత్రమే పెన్షన్ ఫండ్‌లో జమ అయ్యేది. కొత్త నియమం అమల్లోకి రావటం వల్ల 25వేల రూపాయల పై 8.33శాతం లెక్క పెడితే.. ప్రతి నెలా 2,083 రూపాయలు మీ పెన్షన్ ఖాతాకు వెళ్తుంది. అంటే ఈ నిర్ణయం అమలైతే నెలకు పెన్షన్ దాదాపు 67శాతం పెరిగి, అదనంగా 4,571 రూపాయల వరకు ప్రయోజనం చేకూరుతుంది. కనీసం 10 సంవత్సరాలు సర్వీస్ పూర్తి చేసిన వారు ఈ పెన్షన్ ప్రయోజనాన్ని పొందవచ్చు. ఇక, ఉద్యోగి సర్వీస్‌లో ఉన్నప్పుడు అకస్మాత్తుగా మరణిస్తే వారి కుటుంబానికి లభించే ఎంప్లాయిస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ EDLI (Employees’ Deposit Linked Insurance) పథకంలోనూ పెద్ద మార్పు రాబోతోంది. దీనికోసం ఉద్యోగి రూపాయి కూడా చెల్లించనక్కర్లేదు. యజమాని మాత్రమే 0.5శాతం ప్రీమియం చెల్లిస్తారు. ప్రస్తుతం దీనికి కనీస పరిమితి రెండున్నర లక్షలు కాగా, గరిష్ట పరిమితి 7 లక్షల రూపాయల వరకు ఉచిత ఇన్సూరెన్స్ లభిస్తోంది. వేతన పరిమితి 25వేల రూపాయలకు పెరగడం వల్ల, సగటు జీతం ఆధారంగా లెక్కించే ఇన్సూరెన్స్ క్లెయిమ్ అమౌంట్ మరింత సులభంగా గరిష్ట స్థాయికి చేరుకుంటుంది. ఇది ఉద్యోగుల కుటుంబాలకు గొప్ప ఆర్థిక భద్రత. ఈ 25 వేల రూపాయల వేతన పరిమితి పెంపు నిర్ణయం వల్ల దేశ వ్యాప్తంగా దాదాపు 50 లక్షల మందికి పైగా కొత్త ఉద్యోగులు EPFO పరిధిలోకి వస్తారు. స్వల్పకాలంలో చేతికి వచ్చే జీతం కాస్త తగ్గినా, రిటైర్మెంట్ సమయానికి భారీ ఫండ్, ఎక్కువ పెన్షన్, మెరుగైన ఇన్సూరెన్స్ కవరేజ్ లభిస్తాయి. ప్రస్తుత కాలంలో రిటైర్మెంట్ ప్లానింగ్ ఎంత ప్రాముఖ్యమైనదో అందరికీ తెలుసు. ద్రవ్యోల్బణానికి అనుగుణంగా ప్రైవేట్ ఉద్యోగులకు తగిన ఆర్థిక భరోసా కల్పించేందుకు ఈ సవరణ ఎంతగానో దోహదపడుతుంది. దీనికి సంబంధించిన అధికారిక నోటిఫికేషన్, ఇతర నిబంధనలు ప్రభుత్వం త్వరలోనే ప్రకటించనుంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సొంతిల్లు లేనివారికి గుడ్ న్యూస్.. రూ.15 లక్షలకే లగ్జరీ ఇల్లు!
కొత్త ఫోన్..కొత్త EMI..పాత బిల్లులే! ఐఫోన్ లవర్స్‌కు సోనూ సూద్ కౌంటర్
Dengue Vaccine: త్వరలో మార్కెట్ లోకి డెంగ్యూ నివారణకు వ్యాక్సిన్!
నేను స్వతంత్రుడిని.. ఎవరికీ సమాధానం చెప్పను.. ఓపెన్ ఏఐ తిరుగుబాటు
ఆహా.. భర్త అంటే నీలా ఉండాలి బాస్.. హ్యాట్సాఫ్!
విమానంలో షర్ట్స్ చిరిగేలా కొట్టుకున్న ప్రయాణికులు..
రోబోల చేతికి కత్తెర? బార్బర్ ఉద్యోగాలూ గో..వింద!
చంద్రుడిపై అతి పెద్ద బిలం.. ఏకంగా 728 అడుగుల వెడల్పుతో..
బియ్యంలో తేలే గింజలు.. అసలు నిజమేంటి?
నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల కుప్ప.. అసలేం జరిగింది?
పులసలకు మించి క్రేజ్.. ఈ రొయ్యల సొంతం!

